Mohammad Rizwan: పాకిస్తాన్ క్రికెట్ జట్టు వైట్ – బాల్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ఇటీవల ఇంగ్లీష్ విషయమై తరచూ ట్రోలింగ్ కి గురవుతున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ప్రారంభానికి ముందు, మ్యాచ్ అనంతరం అతడు మీడియాతో మాట్లాడే ఇంగ్లీష్ వీడియో క్లిప్స్ ని కొందరు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. దీంతో రిజ్వాన్ ఇంగ్లీష్ పై విపరీతమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నాడు. మార్చ్ నెల ప్రారంభంలో మహమ్మద్ రిజ్వాన్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడాడు. అందులో అతడు ఇంగ్లీష్ మాట్లాడిన విధానాన్ని ఉద్దేశిస్తూ ఆ దేశ టీవీ యాంకర్ తబీష్ హష్మీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. రిజ్వాన్ నైపుణ్యాలను ఎగతాళి చేసినట్లుగా వ్యాఖ్యానించారు అంటూ కొంతమంది అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read: Preeti Zinta In Temple: SRHను ఓడించేందుకు ప్రీతి జింటా కుట్రలు.. హైదరాబాద్ లోనే టెంపుల్ లోనే
ఈ ఘటన మరువకముందే మరోసారి తన ఇంగ్లీష్ తో వైరల్ గా మారాడు మొహమ్మద్ రిజ్వాన్. శుక్రవారం నుండి పాకిస్తాన్ సూపర్ లీగ్ {PSL 2025} ప్రారంభమైంది. ఈ క్రమంలో తాజాగా ముల్తాన్ సుల్తాన్ కెప్టెన్ అయిన మహమ్మద్ రిజ్వాన్ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో ఇంగ్లీష్ భాష పై సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ చూసి భావోద్వేగానికి గురయ్యానని అన్నాడు మహమ్మద్ రిజ్వాన్. దేశం తన నుండి నాణ్యమైన క్రికెట్ ని కోరుకుంటుందని.. ఇంగ్లీష్ కాదని అన్నాడు. తనకు ఇంగ్లీష్ రాదని సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందిస్తూ..” నా పని పాకిస్తాన్ కోసం క్రికెట్ ఆడడం. మంచి ఇంగ్లీష్ మాట్లాడడం కాదు. బయట నుండి చాలా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి.
నేను వాటిని లెక్క చేయను. నేను ఒక విషయంలో మాత్రం గర్వంగా ఫీల్ అవుతా. నేను ఏం మాట్లాడినా నా మనసులో నుండి వస్తుంది. నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. సరైన చదువు లేదని నేను పశ్చాత్తాప పడుతుంటా. అంతేగాని పాకిస్తాన్ కెప్టెన్ గా ఉంటూ ఇలాంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నందుకు సిగ్గుగా భావించను. నన్ను బాగా క్రికెట్ ఆడాలని డిమాండ్ చేయండి. కానీ ఇంగ్లీష్ గురించి కాదు. నేను పెద్ద చదువులను పూర్తి చేయలేదు.
Also Read: Prithvi Shaw In CSK: CSKను కాపాడేందుకు బులెట్ లా దూసుకొస్తున్న పృథ్వీ షా
అందుకే ఇంగ్లీషులో ఇబ్బంది పడతా. నా జూనియర్లకు కూడా ఈ విషయంలో ఓ సూచన ఇస్తుంట. బాగా చదువుకొని క్రీడల్లోకి రావాలి. లేదంటే చదువును కొనసాగించాలని సూచిస్తా. అప్పుడే మంచి ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే నేను క్రికెట్ నీ వదిలి ప్రొఫెసర్ గా మారలేను. ఒకవేళ ఇంగ్లీష్ కావాలంటే క్రికెట్ ని వదిలి ప్రొఫెసర్ అయ్యుండే వాడిని” అంటూ తన ఇంగ్లీష్ గురించి జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించాడు మహమ్మద్ రిజ్వాన్.
M Rizwan reacts to his English controversy. these Pakistan's journalists and fans are sick minded .
One piece of advice for Rizwan is to stop talking in english. Rest is changa @iMRizwanPak@TheRealPCB pic.twitter.com/7M6q1GWLEL— RJ Speaks 💕 ( میر اخلاق ) 🎤🎙️ (@Mir_Ikhlaq786) April 11, 2025