Daily Head Shower: జుట్టు సంరక్షణ విషయంలో తరచుగా వినిపించే సందేహాల్లో ఒకటి ప్రతిరోజూ తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందా ?. ఈ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. నిజానికి.. ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోతుందా లేదా అనేది కొన్ని ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం స్నానం చేసే పద్ధతి, ఉపయోగించే ఉత్పత్తులు అంతే కాకుండా మీ జుట్టు రకంపై ఆధారపడి ఉంటుంది తప్ప, స్నానం చేయడం వల్లనే జుట్టు ఊడి పోతుందనేది నిజం కాదు.
ప్రతిరోజూ తలస్నానం వల్ల ఏం జరుగుతుంది ?
జుట్టు పొడిబారడం, చిట్లడం:
మీరు ప్రతిరోజూ తలస్నానం చేసినప్పుడు కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను ఉపయోగిస్తే.. మాత్రం అవి జుట్టులోని సహజ నూనెలను (sebum) తొలగిస్తాయి. దీనివల్ల జుట్టు పొడిబారి, బలహీనపడి, సులభంగా చిట్లిపోతుంది. ముఖ్యంగా పొడి లేదా చిట్లిన జుట్టు ఉన్నవారికి ఇది మరింత సమస్యను సృష్టిస్తుంది.
స్కాల్ప్ పొడిబారడం లేదా జిడ్డుగా మారడం:
కొంతమందికి.. ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్ (తల చర్మం) పొడిబారి దురద, చుండ్రు వచ్చే అవకాశం ఉంటుంది. మరికొందరికి, స్కాల్ప్ పొడిబారినప్పుడు, శరీరం దానికి ప్రతిస్పందనగా మరింత జిడ్డును ఉత్పత్తి చేస్తుంది. ఇది స్కాల్ప్ జిడ్డుగా మారడానికి దారితీస్తుంది.
రంగు వేసిన జుట్టుకు నష్టం:
రంగు వేసిన జుట్టు ఉన్నవారు ప్రతిరోజూ తలస్నానం చేస్తే.. రంగు త్వరగా వెలిసిపోతుంది. షాంపూలోని కెమికల్స్ రంగును తొలగించి.. జుట్టు నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి.
జుట్టు రాలడం (అపోహ):
సాధారణంగా మనం తలస్నానం చేసినప్పుడు.. ప్రతి రోజు రాలాల్సిన జుట్టు (సాధారణంగా 50-100 వెంట్రుకలు) బయటకు వస్తుంది. ఇది చాలా సాధారణ ప్రక్రియ. చాలా మంది దీన్ని చూసి, స్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోతుందని అపోహ పడతారు. కానీ.. ఇది ఇప్పటికే రాలిన లేదా రాలబోయే జుట్టు మాత్రమే. మీరు వాడే షాంపూ, నీరు, జుట్టును శుభ్రం చేసే విధానం సరిగా లేకపోతేనే నిజంగా జుట్టు రాలడం జరుగుతుంది.
ప్రతిరోజూ తలస్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
సల్ఫేట్ లేని షాంపూలు: మీరు ప్రతిరోజూ తలస్నానం చేయాలనుకుంటే, సల్ఫేట్ లేని, తేలికపాటి షాంపూలను ఎంచుకోండి. ఇవి జుట్టులోని సహజ నూనెలను ఎక్కువగా తొలగించవు.
కండీషనర్ వాడకం:
ప్రతిసారీ షాంపూ చేసిన తర్వాత కచ్చితంగా కండీషనర్‌ను ఉపయోగించండి. ఇది జుట్టుకు తేమను అందించి.. మృదువుగా ఉంచుతుంది. స్కాల్ప్‌కు కాకుండా జుట్టు చివర్లకు అప్లై చేయండి.
Also Read: పాలతో జుట్టుకు పోషణ.. ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు !
గోరువెచ్చని నీరు: వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారి, బలహీనపడుతుంది. అందుకే తలస్నానం చేయడానికి గోరువెచ్చని లేదా చల్లటి నీటిని ఉపయోగించండి.
జుట్టు రకం: మీ జుట్టు జిడ్డుగా ఉంటే ప్రతిరోజూ తలస్నానం చేయడం అవసరం కావచ్చు. పొడి లేదా సాధారణ జుట్టు ఉన్నవారు రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి స్నానం చేస్తే సరిపోతుంది.
టవల్ డ్రైయింగ్: తలస్నానం చేసిన తర్వాత జుట్టును గట్టిగా రుద్దకుండా, మృదువైన టవల్‌తో కట్టి సున్నితంగా తడి ఆరబెట్టండి.
వేడి లేకుండా ఆరబెట్టడం: హెయిర్ డ్రయ్యర్ వాడకాన్ని తగ్గించండి. సహజంగానే జుట్టును ఆరనివ్వండి.
ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల నేరుగా జుట్టు రాలిపోదు. కానీ.. తప్పుడు ఉత్పత్తులను ఉపయోగించడం, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల జుట్టు బలహీనపడి రాలే ప్రమాదం కూడా ఉంటుంది. మీ జుట్టు రకాన్ని బట్టి సరైన సంరక్షణ పద్ధతులను అనుసరించడం వల్ల ప్రతిరోజూ స్నానం చేసినా మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.