తన భర్త పరాయి స్త్రీని చూస్తే.. ఏ భార్య సహించదు. కనీసం వారి పేరు తలచుకున్నా.. చుక్కలు చూపిస్తుంది. అలాంటిది.. ఈ భార్య ఏకంగా తన భర్తకు 16 ఏళ్ల కన్నె పిల్ల కావాలని.. భర్తతో కలిసి మరీ పత్రికలో ప్రకటన ఇచ్చింది. దీంతో చాలామందికి వారిద్దరు విడాకులు తీసుకుంటున్నారా? అందుకే ఆమె భర్తకు వేరే అమ్మాయిని అంటగట్టాలని అనుకుంటుందా అని మొదట్లో అందరికీ సందేహం కలిగింది. ఆ ప్రకనట పూర్తిగా చదివిన తర్వాత దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంతకీ ఆ ప్రకటనలో ఏం ఉంది?
దక్షిణాఫ్రికాలోనే అత్యంత ధనిక దంపతు గెరిట్ కోయెట్జీ (58), ఆండ్రియా (43) దంపతులు లైన ఫ్రీ స్టేట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గత 25 ఏళ్లుగా సంతోషంగా జీవిస్తున్నారు. గెరిట్ వృత్తిరీత్యా లాయర్, వ్యాపారవేత్త. వీరి వివాహం జరిగి పాతికేళ్లయినా.. సంతానం లేదు. మొదట్లో గెరిట్ తనకు పిల్లలు అక్కర్లేదు అనుకున్నాడు. అయితే, అనూహ్యంగా ఆస్తులు పెరగడంతో.. అవన్నీ చూసుకోడానికి, తన వంశాన్ని నిలబెట్టడానికి ఒక వారసుడు కావాలని అనుకున్నాడు. ఇక తన భార్యతో అది సాధ్యం కాదని భావించి.. మరో యువతిని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అతడి భార్య ఆండ్రియా కూడా అంగీకరించింది. పైగా దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం కొన్ని ప్రత్యేక నిబంధనలతో బహుభార్యత్వాన్ని అనుమతిస్తారు. అందుకే.. వారు అంత ధైర్యంగా పత్రికా ప్రకటన ఇచ్చారు.
తనకు కాబోయే భార్య వయస్సు 16 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలని గెరిట్ దంపతులు కండిషన్ పెట్టారు. ఈ విషయం తెలిశాక.. ‘‘అరే.. కాటికి కాళ్లు చాపే వయస్సులో నీకు అంత చిన్న పిల్ల అవసరమా?’’ అంటూ నెటిజనులు అతడిని తిట్టిపోస్తున్నారు. అది మాత్రమే కాదు.. వాళ్లు ఆ ప్రకటనలో ఇంకా చాలా షరతులు పెట్టారు. కేవలం కన్నె పిల్లలే ఇందుకు అర్హులని, వారికి స్మోకింగ్ అలవాటు ఉండకూడదని పేర్కొన్నారు. బైబిల్ సూత్రాలపై విశ్వాసం ఉండాలని, ఇంటికి యజమాని మగవాడే అనే భావనను గౌరవించాలని తెలిపారు. 16 ఏళ్ల వయస్సులో కూడా తమ కుమార్తె కన్యగానే ఉందనే విషయాన్ని తల్లిదండ్రులే నిరూపించాలన్నారు. బైబిల్ ప్రకారం.. స్త్రీ పెళ్లిలోకి ప్రవేశించేప్పుడు కన్యగా ఉండాలని గెరిట్ నమ్మకం.
అమ్మాయి తల్లిదండ్రులకు కట్నం కింద రూ.1,00,000 రాండ్స్ (భారత కరెన్సీ ప్రకారం సుమారు 5.78 లక్షల రూపాయలు) ఇస్తామన్నారు. భార్య భద్రత కోసం 5 మిలియన్లు విలువ చేసే ఎస్టేట్ (సుమారు 2 కోట్ల 89 లక్షల రూపాయలు) రాసిస్తామని పేర్కొన్నారు. అయితే, గెరిట్.. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి 16 ఏళ్లు ఉండాలనే షరతు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై గెరిట్ స్పందిస్తూ.. ‘‘నేను చెప్పింది ప్రజలకు అర్థం కాలేదు. కేవలం 16 ఏళ్ల వయస్సు అనే అంశంపైనే ఫిక్స్ అయిపోయి విమర్శలు చేస్తున్నారు. ఇది రాత్రికి రాత్రి జరిగే పని కాదు. ఆ వ్యక్తిని కలవాలి, వారి కుటుంబ సభ్యులను కలవాలి, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. మా ఆస్తులు ప్రభుత్వపరం కాకుండా ఉండాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని తెలిపాడు.
ప్రజల నుంచి వస్తున్న విమర్శలపై గెరిట్ భార్య ఆండ్రియా స్పందిస్తూ.. ‘‘కొందరు మమ్మల్ని సోషల్ మీడియాలో విమర్శిస్తూ.. పెళ్లి పేరుతో మేం అమ్మాయిలను గదిలో బంధిస్తామని, గెరిట్ సీరియల్ కిల్లర్ అని కామెంట్లు చేస్తున్నారు. అవన్నీ చూస్తుంటే నవ్వొస్తోంది. నా భర్తకు పిల్లలు కావాలనే కోరికను నేను గౌరవిస్తున్నాను. నా భర్తతో కలిసి నా కొత్త ప్రయాణాన్ని సాహసంగా స్వీకరిస్తున్నా’’ అని తెలిపింది.
Also Read: భూమికి దగ్గరగా శని గ్రహం, 15 ఏళ్లకు ఒక్కసారే వచ్చే అద్భుతం.. ఈ తేదీ మిస్ కావద్దు!
వధువును ఎంపిక చేయడం అంత ఈజీ కాదని గెరిట్ దంపతులు అంటున్నారు. న్యాయ నిపుణులు, వైద్యులు, మతగురువుతో కూడిన ఒక ప్యానెల్ దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేస్తుంది. మొదటి భార్య ఆండ్రియా కూడా ఈ ప్యానెల్‌లో సభ్యురాలిగా ఉంటారు. ఎంపికైన రెండో భార్యను ఇంటికి ఆహ్వానించి, మొదటి భార్యతో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇద్దరు భార్యలు ఒకే ఇంట్లో, వేర్వేరు బెడ్రూమ్‌లలో ఉంటారు. రొటేషన్ పద్ధతిలో గెరిట్‌తో జీవిస్తారు. ఇద్దరు భార్యలకు సమానమైన హోదా ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత భార్యలతోపాటు వారికి కూడా వారసత్వ సంపాద దక్కుతుంది. మరి, ఎవరో ఆ లక్కీ ఫెలో. కానీ.. 58 ఏళ్లలో అతడి కష్టంతో పిల్లలు పుట్టించడం సాధ్యమేనా? అయినా అవన్నీ మనకు ఎందుకు చెప్పండి?