E-Paper
Advertisement

భూమికి దగ్గరగా శని గ్రహం, 15 ఏళ్లకు ఒక్కసారే వచ్చే అద్భుతం.. ఈ తేదీ మిస్ కావద్దు!

భూమికి దగ్గరగా శని గ్రహం, 15 ఏళ్లకు ఒక్కసారే వచ్చే అద్భుతం.. ఈ తేదీ మిస్ కావద్దు!
Advertisement

భూమి చుట్టూ ఎన్నో గ్రహాలు ఉంటాయి. వాటిలో మన కంటికి కనిపించేది కేవలం చంద్రుడు మాత్రమే. మిగతా గ్రహాలు కూడా కంటికి కనిపిస్తాయి. కానీ, సూర్యకాంతి వల్ల అవి నక్షత్రాల్లా మెరుస్తుంటాయి. అంత స్పష్టంగా కనిపించవు. వాటిని చూడాలంటే కేవలం టెలిస్కోప్‌తో మాత్రమే సాధ్యం. అయితే గ్రహాల్లో అన్నింటికంటే భిన్నంగా ఉండే శని గ్రహాన్ని ఇప్పుడు మనకి చాలా దగ్గరగా రాబోతుంది. దీన్ని భారీ టెలిస్కోపులు అవసరం లేకుండానే చూసేయొచ్చని, ఈ అవకాశాన్ని వదలొద్దని చెబుతున్నారు మన ఖగోళ శాస్త్రవేత్తలు.

ఈ సారి ఎందుకంత ప్రత్యేకం?

ఈ ఏడాది కనిపించే శనిగ్రహం చాలా ప్రత్యేకమైనది. సూర్యుడు, భూమి, శని గ్రహం.. ఈ మూడు ఒకే సరళ రేఖలోకి రానున్నాయి. ఈ స్థితిని ఒపోషిజన్ అని పిలుస్తారు. ఈ సమయంలో భూమికి శని గ్రహానికి మధ్య దూరం తగ్గుతుంది. దానివల్ల శని గ్రహం రాత్రంతా ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. గతేడాది శనిగ్రహం వలయాలు భూమికి సమాంతరంగా ఉండటం వల్ల సరిగ్గా కనిపించలేదు. ఈ ఏడాది మాత్రం ఆ వలయాలు విడివిడి కనిపించనున్నాయి. ఇలాంటి అద్భుతం ప్రతి 13 నుంచి 15 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఓపోజిషన్ ఎఫెక్ట్ వల్ల సూర్యుడి కాంతి నేరుగా వలయాలపై పడుతుంది. దానివల్ల వలయాల్లోని దుమ్ము రేణువుల నీడలు కనిపించకుండా పోయి.. వలయాలు మరింత కాంతివంతంగా మెరుస్తాయి.

తెలుగు రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరులో ఎలా చూడొచ్చు?

Advertisement

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న బిర్లా ప్లానిటోరియం అండ్ బి.ఎం. బిర్లా సైన్స్ సెంటర్‌లో వీటిని వీక్షించవచ్చు. అయితే, ముందుగా ఇందుకు అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మీరు హైదరాబాద్‌లో తక్కువ కాంతి కాలుష్యం కలిగిన ప్రాంతాల్లో ఉన్నట్లయితే.. తూర్పు దిక్కున ఆకాశంలో చూస్తే.. శని గ్రహం కనిపిస్తుంది. లేత పసుపు రంగులో మెరుస్తుంది. మీ దగ్గర బైనాక్యూలర్ లేదా చిన్న టెలిస్కోప్ ఉన్నట్లయితే.. ఆ గ్రహాన్ని చాలా ఈజీగా చూసేయొచ్చు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో అలిపిరి జూ పార్క్ రోడ్డులో ఉన్న రీజినల్ సైన్స్ సెంటర్‌ డిజిటల్ ప్లానిటోరియం నుంచి కూడా దీన్ని చూడొచ్చు. గ్రహణాల ఏర్పడినప్పుడు ఇక్కడ టెలిస్కోప్ ద్వారా.. వాటిని చూసే అవకాశం కలిపిస్తారు. అయితే, శనిగ్రహాన్ని వీక్షించడానికి అనుమతి ఉందా లేదా అనేది ముందుగా తెలుసుకోండి. విశాఖ, విజయవాడలో ఇలాంటి సదుపాయాలు లేవు. కాబట్టి.. రాత్రి వేళ.. ఓపెన్ టెర్రస్‌ల నుంచి బైన్యుక్యులర్‌తో ఈ గ్రహాన్ని సులభంగా చూడవచ్చు. బెంగళూరులో సంకీ రోడ్డులో గల జవహార్ లాల్ నెహ్రూ ప్లానిటోరియం, చెన్నైలో గాంధీ మంటపం రోడ్డులో గల ఎంపీ బిర్లా ప్లానిటోరియంలో కూడా ఈ సౌలభ్యం ఉంది.

Advertisement

Also Read: మద్యానికి నో.. 70 ఏళ్లుగా ఇదే రూల్.. సూర్యాపేటలోని ఈ ఆదర్శ గ్రామం గురించి తెలుసా?

ఎప్పుడు చూడొచ్చు?

శని గ్రహం, సూర్యుడు, భూమితో సరళ రేఖలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. కాబట్టి.. అక్టోబర్ 4వ తేదీ ఇందుకు సరైన సమయం. ఆ రోజు రాత్రంతా శనిగ్రహం ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కాబట్టి సాయంత్రం 6 తర్వాత ఆకాశంలోకి చూడటం మొదలుపెట్టండి. ఒక వేళ ఆకాశం మేఘాలతో ఉంటే మాత్రం.. మీకు ఆ లక్ లేనట్లే. కాంతి ఎక్కువ లేని ప్రాంతాల్లో ఈ గ్రహాన్ని నేరుగా కంటితో ఎలాంటి ఆటకం లేకుండా చూసేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. సిద్ధమైపోండి.

Tags

Related News

రూ.5,999కే వాషింగ్ మెషీన్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి!

ఆన్ లైన్‌లో బట్టలు కొనక ముందే.. ఫిట్టింగ్ సరిపోతుందో లేదో ముందే చూసుకోవచ్చు!

ల్యాప్‌టాప్ ఫీచర్లతో బెస్ట్ ట్యాబ్ విడుదల..ధర కూడా చాలా తక్కువ తెలుసా?

జియో vs వొడాఫోన్ ఐడియా.. రూ.299కే అదిరిపోయే ప్లాన్లు.. ఏది రీఛార్జ్ చేస్తే బెస్ట్?

రూ. 699లకే Airtel, Jio బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు.. రెండింటిలో ఏది బెస్ట్? దేని వల్ల ఎక్కువ లాభం!

ఈ ప్రైస్‌కి ఈ లుక్ వేరే లెవెల్ అంతే! మార్కెట్‌లో అదరగొడుతున్న స్మార్ట్ వాచ్

మీ ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో..క్షణాల్లో తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×