Bird Poop Facials: పిట్ట రెట్టతో ఫేషియల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నిజానికి ఇదో పిచ్చి పనిగా అనిపించవచ్చు. కానీ, ఇది నిజం. ఈ బ్యూటీ ట్రీట్మెంట్ కోసం నైటింగేల్ అనే పక్షి నుంచి వచ్చే రెట్టను ఉపయోగిస్తారు. జపాన్ లోని గీషాలు చాలా కాలం క్రితం తమ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుకునేందకు దీన్ని ఉపయోగించారు. కాబట్టి దీన్ని ‘గీషా ఫేషియల్’ అని కూడా పిలుస్తారు. ఈ ఫేషియల్ ను జపాన్ తో పాటు న్యూయార్క్ లోని కొన్ని ఫ్యాన్సీ స్పాలు ఈ ట్రీట్మెంట్ ను అందిస్తున్నాయి.
ఈ ఫేషియల్ ఎలా పని చేస్తుంది?
ఈ ఫేషియల్ అనేది నేరుగా పక్షి నుంచి వచ్చిన రెట్టను ఉపయోగించరు. ముందుగా పక్షి రెట్టను సేకరించి, శుభ్రం చేసి, ఎండబెడతారు. ఆ తరువాత చక్కటి పొడిగా మారుస్తారు. ఈ పొడిని నీటితో లేదంటే ఇతర పదార్థాలతో కలిపి ఫేస్ మాస్క్ తయారు చేస్తారు. ప్రజలు ఈ మాస్క్ ను వారి చర్మంపై కొద్ది సేపు ఉంచి, ఆ తర్వాత కడుగుతారు.
ఎందుకు దీనిని ఉపయోగిస్తారు?
పక్షి రెట్టతో చేసిన ఫేషియల్ చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా చేస్తుందని ప్రజలు నమ్ముతారు. పక్షి రెట్టలో ‘గ్వానైన్’ అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్ చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయ పడుతుంది. ముఖం తాజాగా, మృదువుగా అనిపించేలా చేస్తుంది. కొందరు ఇది మొటిమలు, నల్లటి మచ్చలను కూడా తొలగించేందుకు ఉపయోగపడుతుందంటారు. విక్టోరియా బెక్హాం లాంటి సెలబ్రిటీలు కూడా దీనిని ప్రయత్నించారు. ఆ తర్వాత ఈ ఫేషియల్ బాగా పాపులర్ అయ్యింది.
ఈ షేషియల్ సేఫేనా?
ఈ ఫేషియల్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా సురక్షితం. పిట్ట రెట్టను శుభ్రం చేసి శానిటైజ్ చేస్తారు. కాబట్టి, ఎలాంటి క్రిములు ఉండవు. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు.
నిజంగా పని చేస్తుందా?
ఇతర ఫేషియల్స్ తో పోల్చితే పిట్ట రెట్ట ఫేషియల్స్ బాగా పని చేస్తుందని చెప్పడానికి పెద్దగా ఆధారాలు లేవు. అయితే, ఈ ఫేషియల్ వల్ల చర్మం మెరుస్తుందని చెప్తారు.
Read Also: చార్‌కోల్ ఇడ్లీ ఏంటీ అనుకుంటున్నారా? తింటే ఎన్ని ప్రయోజనాలో..
ఎందుకు వింత అనిపిస్తుందా?
నిజానికి ముఖం మీద పక్షి రెట్టను ఫేషియల్ గా వాడటం చాలా మందికి నచ్చకపోవచ్చు. చాలా మంది అందం కోసం పండ్లు, పువ్వులు, నూనెలు వంటి వాటిని ఉపయోగిస్తారు. పక్షి రెట్ట అనేది నిజంగా వింతగా అనిపిస్తుంది. ఈ ఫేషియల్ ఎలా పని చేస్తుందో తెలియాలంటే.. మీరు కూడా జపాన్ కు లేదంటే అమెరికాకు వెళ్లినప్పుడు ఓసారి ట్రై చేసి చూడండి.
Read Also: అర్జెంటుగా బయటికి వెళుతున్నారా? మీ తెల్ల జుట్టును ఐదు నిమిషాల్లో ఇలా నల్లగా మార్చేయండి