Health Benefits: ఈసారి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇంటా బయటా ఒకటే ఉక్కపోత. మంచి నీళ్లు, కూల్ డ్రింక్స్ ఎంత తాగినా దాహం తీరలేదు. ఇలాంటి సీజన్‌లో బెటర్ ‘సన్నారి లేదా సుగంధి’. పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. ఎక్కువ ఔషధ గుణాలున్న చెట్టు, దక్షిణ భారత్‌లో ఎక్కువగా పెరుగుతుంది. నన్నారి వేర్లను ఉపయోగించి శీతల పానీయాలు తయారు చేస్తారు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే చెట్టు కూడా.
నన్నారి శరీరానికి శక్తి ఇచ్చే టానిక్ మాదిరిగా పని చేస్తుంది. ఇందులో సహజమైన చల్లదనాన్ని ఇచ్చే లక్షణాలు ఉంటాయని కొందరు వైద్య నిపుణులు చెబుతున్న మాట. నన్నారి వేర్లను పొడి చేసి ఉపయోగించుకోవచ్చు. లేదంటే వేర్ల నుండి సారాన్ని ఉపయోగించి షరబత్లుగా వినియోగిస్తారు. పల్లెటూర్లలో ఇప్పటికీ చాలా మంది దీన్ని ఉపయోగిస్తారు. రక్తాన్ని శుభ్రపరచడం, శరీరంలో వేడి తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
శరీరాన్ని చల్లబరచడం.. వేసవి సీజన్‌లో ఎక్కువగా నీరసం వస్తుంది. ఒక్కోసారి ఒళ్లంతా మండే లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ స్నానం చేయాలని భావించినా నీరు వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు నన్నారి అనబడే షరబతు తాగితే శరీరానికి చల్ల దనం, ఆపై ఉపశమనం కూడా.
రక్తం శుద్ధి చేయడం.. రక్తాన్ని శుద్ధి చేసే గుణం దీని సొంతం. చర్మ సంబంధిత సమస్యలు తగ్గించడంలో దీనికి తిరుగులేదని చెబుతుంటారు.
ALSO READ: హై హీల్స్ వేసుకోవడం వల్ల అన్ని సమస్యలా?
మూత్ర సంబంధిత వ్యాధులు.. మూత్రాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు మంచి ఔషధంగా పని చేస్తుంది నన్నారి.
జీర్ణక్రియ మెరుగుపరిచే గుణం.. నన్నారి వేర్ల నుండి తయారు చేసిన కషాయం జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. జీర్ణక్రియ సరిగా కాకపోవడం వల్లే అసలు సమస్యలు ఏర్పడుతున్నాయి.
గుండె కొట్టుకునే సమస్యకు.. చాలామందిలో ఒక్కోసారి గుండె వేగంగా కొటుకుంటుందని, లేకుంటే దడగా ఉంటుందని చెబుతారు. అందుకు కూడా సహాయ పడుతుంది. నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపి శాంతియుతంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
నన్నారి వేర్లను నీటిలో ఉడికించాలి. దాని నుండి తీసిన సారాన్ని చక్కెరతో కలిపి శరబతు రూపంలో తాగవచ్చు. మార్కెట్‌లో లభించే నన్నారి సిరప్‌లు ఉన్నాయి. వీటిని నీటిలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఇందులో నిమ్మకాయ కలిసి తీసుకుంటే మాంచి ఎనర్జీ వస్తుంది.
సహజమైన ఔషధ మొక్కలలో నన్నారికి విశిష్ట స్థానం ఉంది. శరీరానికి నష్టం కలిగించదు. చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. వేసవికాలంలో ఇదొక సహజ శక్తిగా పని చేస్తుంది. ప్రతి ఒక్కరూ నన్నారి తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఫుల్ స్టాప్ పెట్టవచ్చు.