Aadhaar Update| భారతదేశంలో ఆధార్ కార్డ్ ఇప్పుడు అందరికీ అవసరమైన డాక్యుమెంట్. ఇది పౌరుల ప్రధాన గుర్తింపు కార్డులా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో కొన్నిసార్లు మార్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. ఉదాహరణకు వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, లింగం, అడ్రస్, మొబైల్ నెంబర్ వంటి కీలక విషయాలు ఇందులో ఉంటాయి. వీటిలో కొన్ని వివరాల మార్పులకు ఆధార్ కార్డ్ నిర్వహణ చేసే కేంద్ర ప్రభుత్వం విభాగం అయిన యునిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఏఐ) కొని పరిమితులు విధించింది. అందుకే ఆధార్ కార్డ్ లోని వివరాలు అప్డేట్ చేసుకునే ముందు జాగ్రత్తగా యూఐడిఏఐ ప్రతిపాదించిన నిబంధనలకు తెలసుకోవడం అవసరం. భవిష్యత్తులో మళ్లీ మార్పులు చేసుకునేందుకు కొన్ని వివరాలకు ఆస్కారం లేదు అందుకే తప్పులు లేకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం అవసరం.
పేరు మార్పు ఎన్నిసార్లు చేసుకోవచ్చు?
ఆధార్ కార్డ్ లో వ్యక్తి పేరు (నేమ్ ఛేంజ్) మార్చుకోవడానికి యుఐడిఎఐ కేవలం రెండు సార్లు మాత్రమే అవకాశముంటుంది. ఇది ముఖ్యంగా మహిళల కోసం ఈ సౌలభ్యం చేశారు. పెళ్లి తరువాత సాధారణంగా మహిళల ఇంటి పేరులో మార్పు ఉంటుంది.అయితే దీనికి కూడా పెళ్లి రిజిస్ట్రేషన్ భర్త గుర్తింపు కార్డు లాంటి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.
పుట్టిన తేదీ మార్పు .. ఒక్కసారే ఛాన్స్
ఆధార్ కార్డ్ లో వ్యక్తి వయసును తెలిపేందుకు పుట్టిన తేది అవసరం. అయితే కొన్ని సార్లు తేదీ ఎంట్రీలో తప్పు జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రతి వ్యక్తి పుట్టిన తేదీ మార్చుకునేందుకు ఒక్కసారి వీలు కల్పించడం జరిగింది. ఆ తరువాత మళ్లీ సరి చేసుకోవాలంటే అందుకు అనుమతి లేదు. అయితే పుట్టిన తేదీ మార్పు చేయడానికి కూడా జనన ధృవీకరణ పత్రం అంటే బర్డ్ సర్టిఫికేట్ సమర్పించడం చాలా అవసరం.
Also Read: ప్రపంచంలోనే తొలిసారి వీర్య కణాల రేసింగ్ పోటీలు.. బెట్టింగ్ వేస్తారా?
అడ్రస్ .. ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు
ఆధార్ కార్డ్ లో ఒక వ్యక్తి చిరునామా లేదా నివసించే అడ్రస్‌ని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. సాధారణంగా పౌరులు.. ఉద్యోగం లేదా ఇతర కారణాలతో ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వలస వెళుతూ ఉంటారు. అందుకే ఇంటి అడ్రస్ మార్పు చేయడానికి ఆన్ లైన్ లో అవకాశం ఉంది లేదా సమీపంలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి చేసుకోవచ్చు. దీని కోసం అద్దె ఇంట్లో ఉంటున్నట్లైతే ఇంటి రెంటల్ అగ్రీమెంట్, కరెంట్ బిల్లు, నీటి పన్ను బిల్లు లాంటివి ఆధార పత్రాలుగా సమర్పించాలి.
లింగం వివరాల్లో మార్పు
ఒక వ్యక్తి ఆధార్ కార్డ్ లో అతని లింగం పరుషుడు లేదా మహిళ అని ఉంటుంది. కానీ ఏదైనా పొరపాటు వల్ల లేదా కొందరు వ్యక్తులు తమ లింగమార్పిడి చేసుకున్నట్లు అయితే వారికి ఇంకోసారి మార్పు చేసుకునే వీలుంది.
మొబైల్ నెంబర్ ఎన్ని సార్లు మార్చుకోవచ్చు
ఆధార్ కార్డ్ లో వ్యక్తి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. అందుకే మీ మొబైల్ నెంబర్ ని ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. దీనికి పరిమితి లేదు.