E-Paper
Advertisement

ఓటీటీలోకి ‘మహేంద్రగిరి వారాహి’ కొన్ని గంటల్లో స్ట్రీమింగ్!

ఓటీటీలోకి ‘మహేంద్రగిరి వారాహి’ కొన్ని గంటల్లో స్ట్రీమింగ్!
Advertisement

Mahendragiri Varahi OTT: అక్కినేని హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి'(Mahendragiri Varahi). సుమంత్ తన (Sumanth)సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎన్నో సరికొత్త ప్రయోగాత్మక సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి సినిమా సెప్టెంబర్ 11వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.

అమెజాన్ ప్రైమ్ లో మహేంద్రగిరి వారాహి..

ఇలా థియేటర్లలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న మహేంద్రగిరి వారాహి డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి అమెజాన్ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ నుంచి అమెజాన్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉండబోతుందని తెలిపారు. ఈ సినిమా హిందీ, తెలుగు, కన్నడ ,తమిళ, మలయాళ భాషలలో ఏకకాలంలో స్ట్రీమింగ్ కాబోతోంది. మరికొన్ని గంటలలో ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కాబోతుంది థియేటర్లలో ఈ డివోషనల్ థ్రిల్లర్ మిస్ అయిన ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు.

డివోషనల్ థ్రిల్లర్…

Advertisement

సుమంత్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో మరొక టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.బ్రిడ్జ్ ఫిలిమ్స్ మరియు రాజా శ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కింది. మరి థియేటర్లలో డీసెంట్ హిట్ అందుకున్న ఈ డివోషనల్ సినిమాకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..

సిద్దార్థ్ (సుమంత్) ఒక యూట్యూబర్ గా ఈ సినిమాలో కనిపించారు. పూజల నిమిత్తం తన సోదరుడితో కలిసి విజయనగరం సమీపంలోని మహేంద్రగిరిలో ఉన్న వారాహి ఆలయానికి వెళ్తారు. అనుకోకుండా తన సోదరుడు రాజీవ్( కమల్ కామరాజు) తో పాటు మహేంద్రగిరి రాజా వంశికుడు నాగేంద్ర వర్మ చనిపోతారు. ఇలా వీరి చావు అనంతరం సిద్దార్థ్ కు మహేంద్రగిరి రాజా వంశానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. ఈ వంశంలో గత 150 ఏళ్లుగా పుట్టిన ప్రతి మగ బిడ్డ 33వ పుట్టినరోజునే చనిపోతూ ఉంటారు. అయితే ఇది ఆ వంశానికి అమ్మవారి శాపమని ఊరి జనం అంత నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే ఈ చావుల వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని సిద్దార్థ్ బావిస్తారు. మరి ఈ చావులకు కారణాలను సిద్దార్థ్ తెలుసుకుంటాడా? వీరి మరణానికి అమ్మవారి శాపమే కారణమా? మరణం వెనుక ఏదైనా సంబంధం ఉందా? అనేది ఈ సినిమా కథ..

Advertisement

Also Read: అల్లు రామలింగయ్య జయంతి.. గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్!

Related News

అన్నదమ్ములిద్దరికీ ఒకే అమ్మాయి… ఫ్యామిలీలో చిచ్చురేపే రచ్చ… ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ తెలుగులోనే

మొబైల్ టవర్ వల్ల టైఫాయిడ్, సునామీ వస్తాయా ? సీజన్ 2తో మరోసారి కితకితలు

కుక్కను వెతుక్కుంటూ వెళ్లిన బాలుడికి ఊహించని వ్యక్తి జాడ దొరికితే… ఓటీటీలోకి డిఫరెంట్ మిస్టరీ మూవీ

లవర్ బ్లాక్ చేసిందని ఈ కుర్రాడు చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరు… నెల తిరక్కుండానే ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా మూవీ

కేరళ ప్రజలలో పాతుకుపోయిన ఫుట్‌బాల్ ప్రేమ… ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

అక్టోబర్‌లో ఓటీటీలోకి వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే… హారర్, థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు భారీ లిస్ట్

క్రిప్టోతో కోటీశ్వరుడు అవ్వాలనుకుంటే ఊహించని చిక్కులు… దిమాక్ కరాబ్ ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్ తెలుగులోనే

Big Stories

Advertisement
×