E-Paper
Advertisement

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. సంచలన తీర్పు ఇచ్చిన మేడ్చల్ కోర్టు!

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. సంచలన తీర్పు ఇచ్చిన మేడ్చల్ కోర్టు!
Advertisement

POCSO Case: జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ మేడ్చల్‌ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్‌ నాయమూర్తి తీర్పు వెలువరించారు. బాధిత బాలికకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

2019 జూన్‌ 22న ఘటన

2019 జూన్‌ 22న బాలిక తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా వెంకటయ్య ఆమెను ఇంటిపైకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న వారు గమనించి నిందితుడిని బెదిరించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై బాలిక తల్లిదండ్రులు జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేశారు.

ఐదేళ్ల జైలు శిక్ష..

Advertisement

కేసును విచారించిన మేడ్చల్‌ కోర్టు నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరఫున మేడ్చల్‌ కోర్టు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రభాకర్ రెడ్డి వాదనలు వినిపించినట్లు తెలిపారు.

Also read: గొర్రెల కాపరిగా 8 ఏళ్ల బాలుడు.. చలించిపోయి బాలుడిని కాపాడిన మంత్రి నారా లోకేష్!

Tags

Related News

సిరిసిల్ల పర్యటనపై రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్.. ఏమన్నారంటే?

ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆన్‌లైన్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు!

దేవుళ్లను విభజించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్.. హామీలు అమలు చేయకుండా కొత్త డ్రామాలంటూ..

ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు.. ఇకపై హాయిగా ట్రావెల్ చేయవచ్చు, అసలు మేటరేంటి?

ఫిర్యాదు చేస్తే ఎదురుదాడి చేస్తారా.. గద్వాల జిల్లాలో దారుణం!

ఖైరతాబాద్‌లో బీజేపీ గెలుస్తుందా?.. అసంతృప్తిలో ఎమ్మెల్యే రాజాసింగ్!

ఎన్ని చిప్పలు, బాత్రూమ్‌లు కడిగి కోట్లు సంపాదించావ్!.. కేటీఆర్ పై ఊగిపోయిన సీఎం రేవంత్!

Big Stories

Advertisement
×