BigTV English

Heart of Coconut stem: కొబ్బరి చెట్టు కాండాన్ని కూడా తినొచ్చు.. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Heart of Coconut stem: కొబ్బరి చెట్టు కాండాన్ని కూడా తినొచ్చు.. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Heart of Coconut stem: కొబ్బరి చెట్టులో కాండం నుంచి కొబ్బరి కాయల వరకు ప్రతి భాగం ప్రయోజనకరంగానే ఉంటుంది. కొబ్బరి చెట్టులోని లేతగా ఉండే కాండాన్ని హార్ట్ ఆఫ్ కొకొనట్ స్టెమ్ అంటారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..


హార్ట్ ఆఫ్ కొకొనట్ స్టెమ్ అంటే?
కొబ్బరి చెట్టులోని లేతగా ఉండే కాండాన్ని హార్ట్ ఆఫ్ కొకొనట్ స్టెమ్ అని పిలుస్తారు. దీనిని సేకరించడానికి గట్టిగా ఉండే బయటి పొరలను తొలగిస్తారు. దాని రసాన్ని టాడీ లేదా షుగర్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారట. దీన్ని అనేక రకాల రెసిపీలలో కూడా ఉపయోగిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రుచికరమైన సలాడ్‌లలో కూడా ఈ కాండాన్ని ముక్కలుగా కోసి వినియోగిస్తారట. దీన్ని వేయించి, గ్రిల్ చేసి లేదా సూప్‌లలో కూడా వేసి వాడతారని నిపుణులు చెబుతున్నారు. ఫిలిప్పీన్స్‌లో దీన్ని ‘ఉబోడ్’ అని పిలుస్తారట. లుంపియాంగ్ ఉబోడ్ అనే స్ప్రింగ్ రోల్స్‌లో కూడా దీన్ని వాడతారు.


పోషకాలూ ఎక్కువే..!
హార్ట్ ఆఫ్ కొకొనట్‌ స్టెమ్‌లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయట. అలాగే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ, బరువు నిర్వహణకు ఇది సహాయపడుతుంది.

ఇందులో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుందట. హార్ట్ ఆఫ్ కొకొనట్‌ స్టెమ్‌లోని బి6 మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో జింక్, ఐరన్ కూడా ఉన్నాయి.

హార్ట్ ఆఫ్ కొకొనట్‌ స్టెమ్‌లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇందులోని పాలీఫెనాల్స్ వాపును తగ్గించి, వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో హెల్ప్ చేస్తాయట. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో ఉంచేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ALSO READ: గంజాయితో క్యాన్సర్ తగ్గుతుందా?

హార్ట్ ఆఫ్ కొకొనట్ స్టెమ్‌ ట్రాపికల్ దేశాల్లో చాలా ఫేమస్. బ్రెజిల్‌లో సలాడ్‌లు, సూప్‌లు, పాల్మిటో వంటకాలలో దీన్ని వినియోగిస్తారు. కోస్టా రికాలో సెవిచే, సలాడ్‌లలో హార్ట్ ఆఫ్ కొకొనట్ స్టెమ్‌ని వాడతారు. థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల్లో కర్రీలు, సలాడ్‌లలో దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు.

ఇండియాలో అయితే కేరళ, గోవా వంటి ప్రాంతాల్లో సాంప్రదాయ వంటకాలలో దీన్ని తరచుగా వాడతారట. ఈక్వెడార్, పెరూ, హవాయి వంటి ప్రదేశాల్లో తాజాగా లేదా గ్రిల్ చేసి దీన్ని తింటారు. అమెరికా, కెనడా, యూరప్‌లో కూడా ఇది గౌర్మెట్ ఇంగ్రీడియంట్‌గా ప్రసిద్ధి చెందింది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×