BigTV English

World’s only City of Vegetarians: ప్రపంచంలోనే వింత నగరం.. ఇక్కడ మాంసాహారం నిషేధం.. ఈ నగరం ఎక్కడో తెలుసా ?

World’s only City of Vegetarians: ప్రపంచంలోనే వింత నగరం.. ఇక్కడ మాంసాహారం నిషేధం.. ఈ నగరం ఎక్కడో తెలుసా ?

World’s only City of Vegetarians: ఆహారం అంటే శాఖాహారం, మాంసాహారం రెండు కలిపి తీసుకుంటారు. ముఖ్యంగా ఫుడ్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. కొంత మందికి మాంసాహారం మాత్రమే చాలా ఇష్టంగా తింటాు. మరికొంత మంది మాత్రం కేవలం శాఖాహారం మాత్రమే ఇష్టంగా తింటుంటారు. ఇక మరోవైపు ఈ రెండింటిని కలిపి తినే వారు కూడా ఉంటారు. కొన్నిసార్లు ప్రాంతాలను బట్టి కూడా ఆహారపు అలవాట్లు ఉంటాయి. అయితే ఓ నగరంలో కేవలం శాఖాహారం మాత్రమే తింటారట. ఇక్కడ మాంసాహారాన్ని విక్రయించడం, కొనుగోలు చేయడం లేదా తినడం వంటివి పూర్తిగా నిషేధించబడింది. అది ఎక్కడో కాదు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఓ జిల్లాల్లో ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు.


భావ్ నగర్ జిల్లాలోని పాలిటానా పట్టణంలో మాంసం, గుడ్లు అమ్మకం, వినియోగం పూర్తిగా నిషేధించబడింది. ఇది ప్రపంచంలోనే ఏకైక మాంసాహారం నిషేధించిన నగరంగా పేరుగాంచింది. నివేదికల ప్రకారం పాలిటానా నగరంలోని దాదాపు 250 మాంసాహార దుకాణాలను మూసివేయాలని 200 మంది సన్యాసులు కలిసి 2014వ సంవత్సరంలో నిరాహార దీక్ష చేశారు. ఇందులో జైన సన్యాసులు కూడా పాల్గొన్నారు. వీరి నిరాహార దీక్ష కారణంగా అప్పటి నుంచి ఈ నగరంలో మాంసాహారాన్ని నిషేధించారు.

జైన కమ్యూనిటీ భావాలను గౌరవిస్తూ ప్రభుత్వం ఇక్కడ మాంసాహారాన్ని నిషేధించింది. దీంతో మాంసం, గుడ్లు ఇతర ఏ మాంసాహారానికి సంబంధించినవి కూడా నిషేధించడినాయి. కాగా, గుజరాత్ ను దేవాలయాలకు నిలయమైన నగరంగా పిలుస్తారు. 900 సంవత్సరాల క్రితం నిర్మించిన జైన దేవాలయాలతో పాటు, పాలిటానాలో జైన వంటకాలు కూడా చాలా ప్రసిద్ధిగాంచాయి. జైన వంటకాలు అహింసా తత్వశాస్త్రంపై ఆధారపడి ఉంటాయి. సూక్ష్మజీవులకు హాని కలిగించకుండా ఉండటానికి కేవలం కూరగాయాలను మాత్రమే తీసుకుంటారు. అంతేకాదు జైనులు పాలు, పాల ఆధారిత ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటారు.


పాలిటానాలో ప్రసిద్ధి చెందిన ఆహారాలలో గుజరాతీ వంటకాలైన ధోక్లా, ఖాండ్వి, గతియా మరియు కధి ఉన్నాయి. మిల్లెట్లను ఉపయోగించి తయారు చేసిన ఫ్లాట్‌రొట్టె, బెల్లం మరియు నెయ్యితో తయారు చేసిన వంటకాలు అగ్రస్థానంలో ఉంటాయి.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×