BigTV English
Advertisement

Sweating: ఎక్కువగా చెమట పడుతోందా ? అస్సలు లైట్ తీసుకోకండి !

Sweating: ఎక్కువగా చెమట పడుతోందా ? అస్సలు లైట్ తీసుకోకండి !

Sweating: ఎండలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ఆరోగ్యసమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే జనం చెమట, ఉక్కపోతతో కూడా ఇబ్బంది పడుతుంటారు. కానీ కొంత మందికి ఎక్కువ చెమట పడుతుంది. అరచేతులు, అరికాళ్లు చెమటతో తడిసిపోతాయి. అంతే కాకుండా నుదుటి నుండి కూడా చెమట కారుతూనే ఉంటుంది. ఈ పరిస్థితి కేవలం వేడివల్ల మాత్రమే కాదు. హైపర్ హైడ్రోసిస్ వల్ల వస్తుంది. ఇంతకీ హైపర్ హైడ్రోసిస్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇంటర్నేషనల్ హైపర్ హైడ్రోసిస్ సొసైటీ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 385 మిలియన్ల మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. హైపర్ హైడ్రోసిస్ ఉన్న వారిలో శరీరం దాని ఉష్ణోగ్రతను సక్రమంగా నిర్వహించుకోలేకపోతుంది. దీని కారణంగానే ఎక్కువగా చెమట పడుతుంది. ఇదిలా ఉంటే చెమట అనేది ఒక ద్రవం అని చెప్పవచ్చు. ఇది శరీరంలోని స్వేద గ్రంథుల నుండి నుండి బయటకు వస్తుంది.

హైపర్ హైడ్రోసిస్ అంటే ఏమిటి ?


నిజానికి చెమట శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అంతే కాకుండా వేడి పెరగకుండా రక్షిస్తుంది. దీని వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఈ కారణంగానే ఏదైనా శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు వేడి వాతావరణంలో శరీరం తనను తాను చల్లగా ఉంచుకోవడానికి మాత్రమే ఎక్కువ చెమటను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఇలాంటి సమయంలో ఉష్ణోగ్రత నియంత్రణలో లేకపోవడం వల్ల స్వేద గ్రంథుల నుండి అధిక చెమట రావడం ప్రారంభం అవుతుంది.

హైపర్ హైడ్రోసిస్ ఎందుకు వస్తుంది ?

హైపర్ హైడ్రోసిస్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా రెండు రకాలు. ప్రైమరీ హైపర్ హైడ్రోసిస్ , సెకండరీ హైపర్ హైడ్రోసిస్ . ప్రాథమిక హైపర్ హైడ్రోసిస్ సాధారణంగా జన్యు పరంగానే వస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. అంతే కాకుండా ఇది కొన్ని సార్లు హార్మోన్ల మార్పుల వల్ల కూడా జరుగుతుంది. ఇది చిన్న వయస్సులో లేదా టీనేజ్ లో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్వితీయ హైపర్ హైడ్రోసిస్ మధుమేహం, థైరాయిడ్, ఊబకాయం, లోబీపీ , గుండె పోటు, ఒత్తిడి , అధికంగా మందులు తీసుకోవడం వల్ల కూడా వస్తుంది. కొన్ని సార్లు ఇది కెఫిన్, స్పైసీ ఫుడ్, నికోటిన్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వస్తుంది.

Also Read: ముఖం మిళమిళ మెరిసిపోవాలంటే.. పసుపు ఐస్ క్యూబ్‌లను ఇలా వాడండి !

హైపర్ హైడ్రోసిస్‌కు శాశ్వత పరిష్కారం ఉందా ?

చెమట పట్టడం అనేది సాధారణమే. కానీ కొంత మందిలో ఒత్తిడి కారణంగా కూడా ఎక్కువగా చెమట పడుతుంది. చెమట కారణంగా చాలా మంది ఆత్మ విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. నిరంతరం చెమట కారణంగా బట్టలు తడిగా మారితే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. చెమట ఎక్కువయితే దురద, దద్దుర్లు వంటివి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది.

మీ చేతులు, కాళ్లు, ముఖంపై ఎక్కువగా చెమటగా అనిపిస్తే.. మీరు హైపర్ హైడ్రోసిస్ తో ఇబ్బంది పడుతున్నారని అర్థం. దీనిని తగ్గించడానికి కూడా చికిత్స అవసరం. అధిక చెమటతో మీరు ఇబ్బంది పడుతుంటే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

Related News

Dosakaya Pachadi: దోసకాయ కాల్చి ఇలా రోటి పచ్చడి చేశారంటే అదిరిపోతుంది

Most Dangerous Foods: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు.. సరిగ్గా వండకపోతే ప్రాణాలకే ప్రమాదం !

Omelette Vs Boiled Egg: ఎగ్స్ Vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది తింటే బెటర్ ?

Saliva Test: ఏంటి నిజమా? లాలాజలంతో గుండె పనితీరు గుర్తించొచ్చా..! అదెలా ?

Tips For Hair: జుట్టు త్వరగా పెరగాలా ? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే.. జరిగేది ఇదే ?

Heart Health:గుండె జబ్బులు ఉన్నాయని తెలిపే.. సంకేతాలు ఇవేనట !

Fruits For Weight loss: బరువు తగ్గాలనుకునే వారు.. ఎలాంటి ఫ్రూట్స్ తినాలి ?

Big Stories

×