BigTV English

Diabetes: ఈ హెర్బల్ టి ఆరోగ్యానికి మంచిదే.. మరి, డయాబెటిస్ రోగులు ఎందుకు తాగకూడదు?

Diabetes: ఈ హెర్బల్ టి ఆరోగ్యానికి మంచిదే.. మరి, డయాబెటిస్ రోగులు ఎందుకు తాగకూడదు?
డయాబెటిస్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను అధికంగా తింటే, మరికొన్ని ఆహారాలను తక్కువగా తినాలి. లేకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగి వారి ఆరోగ్యానికి ఇబ్బంది కలగవచ్చు. హెర్బల్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అయితే కొన్ని రకాల ఔషధ టీలను మధుమేహం ఉన్నవారు తాగకూడదు. వాటిని తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


హెర్బల్ టీలలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి అధిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పొట్ట మంటను కూడా తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే లక్షణాలు కూడా ఉంటాయి. అయితే అన్నీ హెర్బల్ టీలలో కూడా ఇవే లక్షణాలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేము. కొన్ని రకాల హెర్బల్టీలు మందులతో కలిసి రక్తంలో చక్కెర స్థాయిపై ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. హైపో గ్లైసిమియా సమస్యకు కూడా దారి తీయవచ్చు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి హెర్బల్ టీ తాగకూడదు తెలుసుకోండి.

కలబంద టీ
కలబంద మూలిక ఔషధంగా చెప్పుకుంటారు. ఇది చర్మానికి, జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని టీ రూపంలో కూడా తాగే వారు ఎంతోమంది ఉన్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం కలబంద టీని తాగకూడదు. కలబందను ఆహారంలో తీసుకోవడం మంచిది కాదు. అలోవెరా తీసుకోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పడిపోతాయి. ఇది ప్రాణాంతక సమస్యకు కూడా కారణం కావచ్చు. అలాగే రక్తపోటు కొలెస్ట్రాల్ వంటివి కూడా దారుణంగా పడిపోయి సమస్య చేయి దాటిపోవచ్చు.


చామంతి పూల టీ
దీన్ని చమోమిలే టి అని అంటారు. ఇది చాలా ఫేమస్ ఎంతోమంది దీన్ని తాగుతూ ఉంటారు. కెఫీన్ లేని హెర్బల్ టీ… మానసిక ఆరోగ్యానికి, జీర్ణ క్రియకు, నిద్రకు ఇది ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే టైప్ టు డయాబెటిస్ ఉన్నవారికి మాత్రం ఇది మంచిది కాదు. మధుమేహం తగ్గడానికి వాడే మందులు ఈ టీతో సంకర్షణ చెంది రక్తాన్ని పలుచబడేలా చేస్తాయి. దీనివల్ల రక్తస్రావం ప్రమాదం పెరిగిపోతుంది. డయాబెటిస్ కోసం మందులు తీసుకొని వారు ఈ టీని తాగవచ్చు.

మెంతి టీ
మెంతి గింజలు, మెంతి ఆకులు మన ఆరోగ్యానికి అద్భుతంగా ఔషధాలుగా పని చేస్తాయి. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం మెంతి టీని దూరంగా పెట్టాలి. మెంతులు హైపోగ్లైసిమిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు తగ్గిస్తాయి. అలాగే రక్తం పల్చబడడానికి కూడా కారణం అవుతాయి. కాబట్టి మెంతి ఆకుల టీ ని తాగకపోవడమే మంచిది.

డయాబెటిస్ ఉన్నవారు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ప్రతి భోజనంలోనూ స్నాక్స్ లోనూ కూడా ఫైబర్ ఉండే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి.

కొన్ని రకాల కూరగాయలు కూడా డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో అవసరం. కూరగాయల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మధుమేహానికి అనుకూలమైనవి. కాబట్టి అలాగే ఫైబర్ నిండిన కూరగాయలు కూడా ఉన్నాయి.  ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మధుమేహం దాదాపు అదుపులో ఉంటుంది.

మధుమేహం ఉన్నవారు బెండకాయను అధికంగా తినడం ఉత్తమం. అలాగే సొరకాయ, కాకరకాయ, బూడిద గుమ్మడికాయ, అరటికాయ, క్యాప్సికం, ముల్లంగి, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటివి తింటూ ఉండాలి. ఇవి ఎక్కువ ఫైబర్ ను కలిగి ఉండి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో చేస్తాయి. బంగాళదుంపలు, మొక్కజొన్న, బఠానీలు వంటివి ఎంత తక్కువగా తింటే అంత మంచిది. వీటిలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×