చేపలు రుచికరమైనవే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మటన్, చికెన్ వంటి వాటితో పోలిస్తే చేపలనే తినమని వైద్యులు సూచిస్తారు. ముఖ్యంగా తినడం వల్ల బరువు పెరగరు కాబట్టి చేపలు అధికంగా తినమని డైటీషియన్లు కూడా చెబుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల చేపలు ప్రమాదకరమైనవి అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వాటిల్లో హానికరమైన విష వ్యర్ధాలు ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఉందని అంటారు. ఇప్పుడు సంవత్సరాలు చెరువులు, నదులు అన్నీ కూడా విషపూరితంగా మారిపోతున్నాయి. శరీరంలో ప్లాస్టిక్ అధికంగా చేరుతోంది. అదంతా చెరువుల నుండి చేపల్లోకి కూడా చేరిపోతున్నట్టు తెలుస్తోంది. అలా ఎక్కువ హానికరమైన పదార్థాలను కలిగి ఉన్న చేపల జాబితా ఇదిగో.
బసా చేపలు: బసా చేపలు అనేక రకాల చెరువుల్లో, నదుల్లో పెరుగుతూ ఉంటాయి. ఇవి తక్కువ ధరకే దొరుకుతాయి. మనదేశంలో అధికంగా తినే చేపల్లో ఇవి కూడా ఒకటి. వీటిలో హానికరమైన ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఎవరైతే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ చేపలను తినకూడదు. ఈ చేపల్లో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు వారి సమస్యలను మరింతగా పెంచేస్తాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన చేపలను తినకపోవడం మంచిది.
తిలాపియా: తిలాపియా చేపలు తక్కువ ధరకే దొరుకుతాయి. అందుకే ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది అన్ని ప్రాంతాల్లో అధికంగా దొరికే చేప. ఈ చేపలకు కోడి వ్యర్ధాలను అధికంగా మేతగా వేస్తారు. తిలాపియా చేపలను అధికంగా తింటే గుండెపోటు, స్ట్రోక్, ఆస్తమా వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. తిలాపియాలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. అలాగే ఒక విష రసాయనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కొందరిలో ఉబ్బసం, అలర్జీలను కలిగిస్తుంది. కాబట్టి తిలాపియా చేపను ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
క్యాట్ ఫిష్: ఇవి కూడా ప్రజలు అధికంగానే తినే చేపల్లో ఒకటి. వీటిని తీసుకోవడం చాలా హానికరం. ఎందుకంటే ఈ చేపలను హార్మోన్లతో ఇంజెక్ట్ చేస్తారు. అంటే అవి త్వరగా లావుగా పెరిగేందుకు ఇంజెక్షన్లు ఇస్తారు. వాటిని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.
మాకెరల్: మాకెరల్ చేపలు కూడా మనదేశంలో అధికంగానే అమ్ముతూ ఉంటారు. ఈ చేపల్లో విటమిన్ ఏ, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కానీ పాదరసం కూడా అధికంగానే ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ చేపను తింటే ఆ పాదరసం మన శరీరంలో చేరిపోతుంది. ఇక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి మాకెరల్ చేపలను చాలా తక్కువగా తింటే మంచిది.
సార్డయిన్స్: టూనా, మాకెరిల్ చేపల్లాగే సార్డయిన్స్ కూడా అధికంగా తినే చేపలే. వీటిలో కూడా పాదరసం అధికంగా చేరిపోతుంది. ఈ చేపలను తింటే ఆ పాదరసం మన శరీరంలో చేరి అనారోగ్యాలకు కారణం అవుతుంది.
టూనా చేపలు: టూనా చేపలను కూడా ప్రపంచంలో ఎన్నో దేశాల ప్రజలు ఇష్టంగా తింటారు. మనదేశంలో కూడా టూనా అధికంగానే దొరుకుతుంది. వీటిలో విటమిన్ బి3 పోషకాలు నిండుగా ఉంటాయి. అయితే ఈ చేపల్లో కూడా పాదరసం అధికంగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే యాంటీబయోటిక్స్, హార్మోన్స్ వంటివి ఇంజెక్ట్ చేసి వీటిని పెంచుతారని తెలుస్తోంది. అందుకే టూనా చేపలను తక్కువగా తినాలి. లేకుంటే తీవ్ర సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
Also Read: ఆ దేశ ప్రజలతో డాన్స్ చేయిస్తున్న డింగా డింగా వ్యాధి, ఇది మహమ్మారిగా మారుతుందా?
చేపల పేర్లు స్థానికంగా మారుతూ ఉంటాయి. ఒక్కోచోట చేపను ఒక్కోలా పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన చేపలను పేర్లను మీ స్థానిక భాషలో ఏమంటారో తెలుసుకొని దాన్నిబట్టి ఆ చేపలకు దూరంగా ఉంటే మంచిది. లేకుంటే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.