Mahakumbh Monalisa | ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళా నేపథ్యంలో చాలామంది వైరల్‌గా మారారు. అయితే వీరందరిలో ప్రయాగరాజ్‌కు పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా భోంస్లే ప్రముఖంగా నిలిచారు. ఆమె రాత్రికి రాత్రే సోషల్ మీడియా క్వీన్‌గా మారిపోయారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ నీలి కళ్ల సుందరి రిస్క్‌లో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై మోనాలిసా వివరణ ఇచ్చింది.
కుంభమేళాలో మోనాలిసాను చూసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికి వచ్చి సినిమా ఆఫర్ ఇచ్చారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ పేరుతో కుంభమేళా మోనాలిసా హీరోయిన్‌గా సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. దీనిని విన్నవారంతా ఇక మోనాలిసా దశ తిరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆమె న్యూడ్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అలాగే ఆమె నటన నేర్చుకోవడంతో పాటు, చదువుకున్నదంటూ అనేక వార్తలు వినిపించాయి. తాజాగా మోనాలిసా ఒక బ్రాండ్ ప్రమోషన్‌లో కూడా పాల్గొంది.
తాజాగా ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ్ కుంభమేళా గర్ల్ మోనాలిసా రిస్క్‌లో పడిందంటూ వ్యాఖ్యానించారు. ఆమె దర్శకుడు సనోజ్ మిశ్రా ట్రాప్‌లో పడిందంటూ ఆరోపించారు. సనోజ్ దగ్గర సినిమాను నిర్మించేందుకు సరిపడినంత డబ్బులు లేవని, అయితే లైమ్ లైట్‌లో ఉండేందుకే ఆయన మోనాలిసాను తన వెంట తీసుకువెళుతున్నారని ఆరోపించారు. అయితే దీనిపై తాజాగా మోనాలిసా వివరణ ఇచ్చింది.
Also Read: ప్రేక్షకుడి టైమ్ వేస్ట్ చేస్తారా!.. పివిఆర్ మల్లీప్లెక్స్‌కు జరిమానా
మోనాలిసా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల షేర్ చేసిన ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ.. సనోజ్ మిశ్రా గురించి వస్తున్న విమర్శల్లో నిజం లేదని పేర్కొంది. తానేమీ అతని ట్రాప్‌లో పడలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను మధ్యప్రదేశ్‌లో ఉన్నానని, యాక్టింగ్ నేర్చుకుంటున్నానని, తన సోదరి, తన పెదనాన్న తనతోనే ఉన్నారని, తాను ఎవరి వలలోనూ పడలేదని పేర్కొంది. సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటున్నారని.. ఆయన చాలా మంచి మనిషి అని, మా సినిమా సవ్యంగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరింది.
మోనాలీసాకు విపరీతమైన పాపులారిటీ
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన 16 ఏళ్ల మోనాలిసా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష దండలు అమ్ముకునే మోనాలిసా.. తన తేనె కళ్లు, డస్కీ స్కిన్, చక్కని చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆమె వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో.. మోనాలిసా గురించి నెటిజెన్లు తెగ సెర్చ్ చేసేశారు. మోనాలిసాతో ఫోటో కోసం కుంభమేళా వెళ్లిన వారు ఎగబడటంతో ఆమె నేషనల్ రేంజ్‌లో ఫేమస్ అయిపోయింది. దీంతో ఓ బాలీవుడ్ సినిమాలో కూడా త్వరలోనే తెరపై కనిపించనుంది. ఇప్పటివరకు నేషనల్ వరకే పరిమితం అయిన మోనాలిసా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ కానుంది.
ఈ క్రమంలోనే మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఆమెకు విదేశీ పర్యటనకు ఆహ్వానం అందింది. మోనాలిసా ఇటీవల కేరళ రాష్ట్రానికి వెళ్లి జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవం చేసింది. ఈ క్రమంలోనే మోనాలిసాకు ఆ జ్యువెలరీ షోరూమ్ ఓనర్.. రూ.15 లక్షల విలువైన వజ్రాల హారం గిఫ్ట్‌గా ఇచ్చారు.
ఇప్పుడు ఆమె విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. నేపాల్‌లో ఫిబ్రవరి 26వ తేదీన జరిగే మహా శివరాత్రి వేడుకల్లో మోనాలిసా పాల్గొననున్నట్లు సమాచారం. దానికి సంబంధించి ఇప్పటికే మోనాలిసాకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం.