David Warner: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో నేడు మరికొద్ది సేపట్లో హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ – లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడబోతున్నాయి. భీకర ఫామ్ లో ఉన్న హైదరాబాద్ జట్టు.. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ లోనే అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక టీమ్ స్కోరును సాధించింది.
Also Read: Kohli – RCB: కోహ్లీ జెర్సీ సెంటిమెంట్.. ఈసారి RCB కప్పు కొట్టడం గ్యారంటీ?
రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 284 పరుగులు చేసింది. అయితే 300 పరుగులను కొద్దిలో మిస్ అయిన ఆరెంజ్ ఆర్మీ.. ఈ మ్యాచ్ లో రీచ్ అవుతుందని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈరోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏ జట్టు 300 పరుగులు చేయలేదు.
అయితే ఇప్పటివరకు జరిగిన సీజన్లలో టాప్ 3 అత్యధిక స్కోర్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఖాతాలోనే ఉన్నాయి. ఇక ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ – లక్నో జట్లు ఇప్పటివరకు నాలుగు సార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ దే పై చేయిగా ఉంది. ఈ ఇరుజట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్లలో.. లక్నో మూడుసార్లు విజయం సాధిస్తే.. హైదరాబాద్ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది.
కానీ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డ్ విజయాలను నమోదు చేసింది. ఉప్పల్ లో మొత్తం హైదరాబాద్ జట్టు 58 మ్యాచులు ఆడితే.. అందులో 36 మ్యాచ్లలో విజయం సాధించింది. మరో 21 మ్యాచ్లలో ఓటమిపాలు కాగా.. ఒక మ్యాచ్ టై గా మిగిలింది. మరి ఈరోజు జరిగే మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. ఇరుజట్లు సమానమైన బలాలను కలిగి ఉండడంతో హోరాహోరి పోరు జరిగే అవకాశం ఉంది.
మైదానం సిక్సర్లు, ఫోర్లతో మోత మోగనుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ అభిమానులు అంతా 300 పరుగులపైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా తెలుగువారికి పరిచయం అక్కర్లేని, 2016లో హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.
నేడు హైదరాబాద్ జట్టు 300 పరుగులు చేస్తుందా..? అని ఎక్స్ ట్విటర్ లో ప్రశ్నించాడు. నేడు జరిగే ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు వార్నర్. అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ సెంచరీ చేస్తాడని, ట్రావిస్ హెడ్ 20 బంతులలో హఫ్ సెంచరీ చేస్తాడని అంచనా వేశాడు. ఈ నేపద్యంలో డేవిడ్ వార్నర్ వేసిన అంచనా ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.