AP liquor Case: ఏపీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో కీలక నిందితులుగా వ్యవహరిస్తున్నవారిని అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు నిందితులు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై కింది కోర్టులో చూసుకోవాలని తేల్చి చెప్పేసింది.
లిక్కర్ కేసులో వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో నిందితులకు న్యాయస్థానం రిలీఫ్ ఇవ్వలేదు. తాజాగా ఎంపీ మిథున్‌రెడ్డి వంతైంది. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చింది సిట్. ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చకముందు గతంలో మిథున్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఎలాంటి కేసు లేనప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు పిటిషన్ తోసిపుచ్చింది. హైకోర్టు కొట్టేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు సదరు ఎంపీ. దీనిపై ఆ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపింది జస్టిస్ పార్థివాలా ధర్మాసనం.
ప్రస్తుతం మిథున్‌రెడ్డిని నిందితునిగా చేర్చిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మెరిట్స్ ఆధారంగా మళ్లీ విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది జస్టిస్ పార్థివాలా ధర్మాసనం. విచారణ సంస్థ చూపిన కొత్త ఆధారాలను పరిగణలోకి తీసుకొని మిధున్‌రెడ్డి బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది.
ALSO READ: వావ్.. అద్భుతమైన సందేశం.. పవన్ కల్యాణ్ కామెంట్స్
హైకోర్టు తీర్పు ఇచ్చేవరకు అప్పటివరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయబోమని ఏపీ ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి. గతంలో మిథున్‌రెడ్డికి ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించింది. హైకోర్టు నిర్ణయం వెలువడే లోపు మిథున్‌రెడ్డి విచారణకు సహకరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు నిర్ణయం వెలువడే లోపు మిథున్‌రెడ్డి విచారణకు సహకరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాదాపు నెల రోజుల్లో లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవడం ఖాయం. హైకోర్టు నిర్ణయం బట్టి అప్పుడు మళ్లీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.