E-Paper
Advertisement

త్వరగా సన్నబడాలని ప్రయత్నిస్తూ అందరూ చేసే తప్పులివే.. ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు

త్వరగా సన్నబడాలని ప్రయత్నిస్తూ అందరూ చేసే తప్పులివే.. ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు
Advertisement

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. అయితే చాలా తక్కువ సమయంలో బరువు తగ్గాలని ప్రయత్నించడం సమస్యలకు దారి తీస్తుంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలను నమ్మి చాలామంది ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లతోనే శాశ్వత ఫలితాలు వస్తాయని గుర్తుంచుకోవాలి.

భోజనం మానేయడం పెద్ద తప్పు

చాలామంది త్వరగా బరువు తగ్గేందుకు భోజనం తగ్గిస్తారు. కొందరు పూర్తిగా మీల్స్ తీసుకోవడం కూడా మానేస్తారు. దీని వల్ల శరీరంలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఫ్యాట్ తగ్గే బదులు కండరాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. అలసట, నీరసం, తల తిరగడం వంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

మార్కెట్లో లభించే ఫ్యాట్ లాస్ మాత్రలు, పౌడర్లను గుడ్డిగా నమ్మొద్దు

Advertisement

మార్కెట్‌లో వెంటనే బరువు తగ్గిస్తామని చెప్పే ఎన్నో ఉత్పత్తులు కనిపిస్తాయి. అయితే వాటిలో చాలా వరకు నిజమైన ఫ్యాట్‌ను తగ్గించవు. కొన్ని కేవలం శరీరంలోని నీటి శాతాన్ని మాత్రమే తగ్గిస్తాయి. కొన్ని ఉత్పత్తుల్లో ఉండే పదార్థాలు కిడ్నీలు, కాలేయం, గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

కేవలం కార్డియో వ్యాయామాలు చేస్తే సరిపోదు

రన్నింగ్, సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలు కేలరీలు ఖర్చు చేయడంలో ఉపయోగపడతాయి. కానీ వాటితో మాత్రమే సరిపోదు. స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా అవసరం. వెయిట్ ట్రైనింగ్ వల్ల కండరాలు బలంగా ఉంటాయి. శరీరం మరింత టోన్డ్‌గా కనిపించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

ఆహారంలో ప్రోటీన్‌ తప్పనిసరి

Advertisement

కొంతమంది సలాడ్స్ లేదా ఉడికించిన కూరగాయలతోనే సరిపెడతారు. ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే కండరాల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో ఆకలి మరింత పెరుగుతుంది. జుట్టు రాలడం, చర్మం కాంతి తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పప్పులు, గుడ్లు, పనీర్, చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్స్ రోజువారీ ఆహారంలో చేర్చడం మంచిది.

Also Read: మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? దీనికి కారణాలు ఇవే

నిద్ర లేకపోవడం, ఒత్తిడి కూడా కారణమే

వ్యాయామంతో పాటు మంచి జీవనశైలి కూడా అవసరం. తగినంత నిద్ర లేకపోతే శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అధిక ఒత్తిడి వల్ల తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుంది. దీంతో బరువు తగ్గడం మరింత కష్టమవుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.

ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గాలి

బరువు తగ్గడం అనేది ఒక్కరోజులో జరిగే పని కాదు. ఓపికతో పాటు సరైన అలవాట్లు కూడా అవసరం. సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బాగా నిద్రపోవడం వంటి అలవాట్లు దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయి. ఏదైనా కొత్త డైట్ లేదా సప్లిమెంట్ ప్రారంభించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Related News

పాలు,పంచదార ఉంటే చాలు..ఇంట్లోనే దూది లాంటి రసగుల్లా రెడీ!

ఎప్పుడూ చేసుకునే దొండకాయ ఫ్రై బోర్ కొట్టిందా?ఈసారి ఇలా ట్రై చేయండి

గోధుమపిండితో చల్ల పునుగులు..మైదా లేకుండానే బెస్ట్ టేస్ట్

నిద్రలోనే పక్షవాతం రావచ్చు.. ఉదయం లేవగానే ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదు

రోజూ బ్రష్ చేస్తున్నా నోటి దుర్వాసన తగ్గడం లేదా? దీనికి కారణాలు ఇవే

కత్తెర సరిగ్గా కట్ చేయడం లేదా? ఎక్కువకాలం పదునుగా ఉండాలంటే ఇంట్లోనే ఇలా చేయండి

ఎండ లేకపోయినా బట్టలు త్వరగా ఆరిపోతాయి.. ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే సరి

‘ఐ లవ్ యూ’ చెప్పడం మాత్రమే సరిపోదు.. మీ లవర్‌కు నమ్మకం కలిగించడం చాలా ముఖ్యం

Big Stories

Advertisement
×