బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

IPL Cheerleader: ఇండియా అంటేనే న‌ర‌కం..త‌ప్పుడు రిపోర్ట్ తో 5 రోజులు చుక్క‌లు చూపించారు !

IPL Cheerleader: ఇండియా అంటేనే న‌ర‌కం..త‌ప్పుడు రిపోర్ట్ తో 5 రోజులు చుక్క‌లు చూపించారు !

IPL Cheerleader Irina:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ దాదాపు రెండు నెలల పాటు సాగగా.. ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ అయింది. అయితే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ముగిసిన నేపథ్యంలో ఒక విదేశీ చీర్ లీడర్ ఇరినా (IPL Cheerleader Irina) ఇవాళ వివాద‌స్ప‌ద‌ వ్యాఖ్యలు చేశారు. ఇండియా అంటేనే నరకంగా మారిందని.. ఇక్కడ వర్క్ చేయడం కంటే, ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ ఘాటుగా స్పందించారు. కాలు వేలు విరిగిన కూడా తనకు చుక్కలు చూపించారని ఓ ఫ్రాంచైజీ యాజమాన్యంపై చీర్ లీడర్ ఇరినా సీరియస్ అయ్యారు. దీంతో ఐపీఎల్ చీర్ లీడర్ ఇరినా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

కాలు వేలు విరిగినా న‌ర‌కం చూపించారు – ఇరినా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) ముగిసిన నేపథ్యంలో చీర్ లీడర్ ఇరినా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఓ మ్యాచ్ సందర్భంగా తన కాలు వేలు విరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తన ఫ్రాంచైజీ ఐదు రోజులపాటు సెలవులు ఇచ్చి… తనను ఆసుపత్రిలో చేర్పించిందని వెల్లడించారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షలు చేసి… తన కాలికి ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారని ఇరినా స్పష్టం చేశారు. అయితే రిపోర్టులో మాత్రం తన కాలు వేలు విరిగిందని ఉందని ఆమె చెప్పారు. తనకు లోకల్ లాంగ్వేజ్ రాకపోవడంతో.. తాను ఆ రిపోర్ట్ చదవలేకపోయానని చెప్పుకొచ్చారు. కాలు బాగా నొప్పిగా ఉందని చెప్పినా కూడా… అది వాపు మాత్రమే అంటూ వైద్యులు వెల్లడించినట్లు ఆమె స్పష్టం చేశారు.

ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేసిన ఇరినా

ఇక మరుసటి రోజు ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేసి… తన స్నేహితుడికి తన గాయం పై సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు ఇరినా. ఐపీఎల్ రూల్స్ ప్రకారం మూడవ వ్యక్తికి ఈ చీర్ లీడర్స్ అస్సలు కలవకూడదు. కానీ తన నొప్పి భరించలేక, ఇరినా రూల్స్ బ్రేక్ చేశారట. తన స్నేహితుడి సహాయంతో మరో ఆసుపత్రికి వెళ్లారట. ఈ క్రమంలో ఇరినా కాలు వేలు విరిగినట్లు వైద్యులు రిపోర్టు ఇచ్చారట. ఈ విషయాలను స్వయంగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న చీర్ లీడర్ ఇరినా బయటపెట్టారు. ఈ తరుణంలోనే ఇండియాలో కాంట్రాక్టు డాన్సర్ గా పని చేయడం నరకంలా మారిందని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ పనిచేయడం కంటే ఇంట్లో కూర్చోవడం బెటర్ అని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాగా చీర్ లీడర్ ఇరినా సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు ప‌లు ఫ్రాంచైజీల‌కు వ‌ర్క్ చేశారు.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

 

Related News

ప్ర‌మాదంలో ఆస్ట్రేలియా..రంగంలోకి 40 ఏళ్ల ముస‌లోడు, ఇక ర‌చ్చ ర‌చ్చే

ట్రావిస్ హెడ్ పై పాట్ కమ్మిన్స్ సీరియ‌స్‌.. ఆ ఓవ‌రాక్ష‌న్ వ‌ల్లే SRH కొంప‌మునిగింది

PSLకు పోటీగా తాలిబ‌న్లు అదిరిపోయే ప్లాన్‌..మ‌ళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియ‌ర్ లీగ్ వ‌చ్చేస్తోంది

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన మొహ్సిన్‌ న‌ఖ్వీ..పాకిస్తాన్ కుక్క‌ల‌కు విశ్వాస‌మే లేదుగా !

Younis Khan: నాకు కోచ్ ప‌ద‌వి ఇవ్వండి రా..పాకిస్తాన్ త‌ల‌రాత మార్చుతా

Shahid Afridi: పాకిస్తాన్ లో స‌చిన్ పుట్టింటే, అర్జున్ ప్ర‌తీ మ్యాచ్ లోనూ ఆడేవాడు

అల్లా మీద ఒట్టు..నా కెప్టెన్సీలో పాకిస్తాన్ కు 3 వ‌ర‌ల్డ్ క‌ప్ లు తీసుకొస్తా

×