మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే అది ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ప్రపంచంలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. మన భారతదేశం మధుమేహం రాజధానిగా మారే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఉంచే ఆహారాలను తినడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం ప్రతిరోజు ఒక చిన్న పని చేయండి చాలు. రోజుకు ఒక యాలకులను నోట్లో పెట్టుకొని అలా నములుతూ ఉండండి. ఇలా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండే అవకాశం ఉంది.
యాలకులను ఆహారం రుచి, సువాసనను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు యాలకులు ఔషధంతో సమానం. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. వీటి గ్లెసైమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఉదయం ఒక యాలకులు, రాత్రి ఒక యాలకులు తినడం వల్ల మీరు మధుమేహం నుండి బయటపడవచ్చు.
యాలకులు తినడం వల్ల ఇన్సులిన్ పరిమాణం కూడా పెరుగుతుంది. దీని కారణంగా రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. టీ తాగే అలవాటు ఉంటే అందులో ఆకుపచ్చ యాలకులు వేసుకోండి. ఇది కూడా ఎంతో మేలు చేసే చిట్కానే.
ఆకుపచ్చని యాలకులతో టీ చేయడానికి ముందు ఒక కప్పు నీరు తీసుకోవాలి. ఆ కప్పు నీటిని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు ఏలకులు, అల్లం, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. దాన్ని వడపోసి తాగుతూ ఉండాలి. అంతే తప్ప పాలను వేసుకోకూడదు. వీటిని ప్రతి రోజు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉండడం ఖాయం.
Also Read: వారానికి 60 గంటలు పనిచేస్తే ఆరోగ్యానికి హానికరం.. మరీ 70-90 గంటలా?
యాలకులు కాస్తా ఖరీదైనవే. అందుకే వీటిని వాడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వీటిని బిర్యానీలలో మాత్రమే వేసేందుకు ఇష్టపడుతున్నారు. మధుమేహలు మాత్రం ఏలకులను ప్రతిరోజు తినడం ద్వారా రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. తద్వారా హ్యాపీగా జీవించవచ్చు.