దేశ వ్యాప్తంగా ఎన్నో వింత రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో ఓ షాకింగ్ హోటల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమాధులలోనే హోటల్ ను నిర్మించడం విశేషం. ఘోరీల పక్కనే కూర్చొని హాయి నచ్చిఫుడ్ లాగించేస్తుంటారు కస్టమర్లు. ఈ హోటల్ పేరు లక్కీ రెస్టారెంట్. అహ్మదాబాద్ లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఉంటుంది. ఈ హోటల్ లో మొత్తం 26 సమాధులు ఉంటాయి. ఈ సమాధుల పక్కనే కూర్చొని కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేస్తారు. సమాధుల పక్కన భోజనం చేస్తున్నామే అని ఎవరూ భయపడరు. పైగా సమాధుల పక్కడ కూర్చొని భోజనం చేయడం వల్ల అదృష్టం కలుగుతుందని భావిస్తారు.
టీ స్టార్ లో మొదలై… రెస్టారెంట్ గా ఎదిగి..
ఈ సమాధుల రెస్టారెంట్ వెనుక పెద్ద కథ ఉంది. 1950లలో కెహెచ్ మొహమ్మద్ అనే వ్యక్తి కేరళ కాలికట్ నుంచి అహ్మదాబాద్ కు వచ్చాడు. ఏదో ఒక వ్యాపారం చేయాలనకున్నాడు. లాల్ దర్వాజా ప్రాంతంలోని ఓ సూఫీ సాధువు సమాధికి దగ్గరగా ఉన్న ముస్లిం స్మశాన వాటిక దగ్గర ఒక చిన్న టీ స్టాల్‌ను ప్రారంభించాడు. నెమ్మదిగా తన వ్యాపారాన్ని విస్తరించాడు. చాలా మంది సమాధులు తీసేసి మంచి హోటల్ కట్టాలని సలహా ఇచ్చారు. కానీ, అతడికి సమాధులను తొలగించడం ఇష్టం లేదు. చనిపోయిన వారిని గౌరవిస్తూ వాటి చుట్టూ తన స్టాల్ ను నిర్మించాడు.
సమాధులు అదృష్టాన్ని కలిగిస్తాయని నమ్మకం
తొలి నాళ్లలో సమాధుల దగ్గర టీ తాగడం వింతగా భావించారు. కానీ, ఆ తర్వాత వారికి తెలియని సంతోషం కలిగేది. మొహమ్మద్ దగ్గర చాయ్ తాగినా, బన్ మస్కా తిన్నా కస్టమర్లు సంతోషంగా ఉండేవారు. ఇక్కడ టీ తాగిన వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేదని నమ్ముతారు. ఇక్కడ చాయ్ తాగితే, పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని, మంచి ఉద్యోగాలు వచ్చాయని చెప్పేవారు. రోజు రోజుకు తన వ్యాపారం పెరగడంతో మహ్మద్ దానిని విస్తరించి, న్యూ లక్కీ రెస్టారెంటం అని పేరు పెట్టాడు. సమాధులను మాత్రం అలాగే ఉంచాడు. సమాధులకు ఇబ్బంది కలగకుండా వాటికి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశాడు.
సమాధులకు గౌరవం
తన రెస్టారెంట్ లో ఉన్న సమాధులను మహ్మద్ ఎంతో గౌరవిస్తాడు. ప్రతి రోజూ ఉదయం, రెస్టారెంట్ సిబ్బంది సమాధులపై బంతి పువ్వులు, గులాబీలు చల్లుతారు. అహ్మదాబాద్‌లోని ప్రజలు ఈ సమాధులను పవిత్రమైనవిగా భావిస్తారు.
అందరికీ రుచికరమైన ఆహారం
న్యూ లక్కీ రెస్టారెంట్ తక్కువ ధరలకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తుంది. దోసెలు, ఊతప్పం లాంటి దక్షిణ భారత వంటకాలతోపాటు పావ్ భాజీ లాంటి ఉత్తర భారతీయ ఆహారం, గుజరాతీ స్నాక్స్ లభిస్తాయి. బన్ మస్కా, చాయ్ సూపర్ పాపులర్. కేవలం రూ. 300కి ఇద్దరు వ్యక్తులు కడుపునిండా భోజనం చెయ్యొచ్చు. ఈ హోటల్ ఎప్పుడూ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు విద్యార్థులతో బిజీగా ఉంటుంది. కుల మతాలకు అతీతంగా ఈ హోటల్ ను అందరూ ఇష్టపడతారు. చక్కటి ఫుడ్ ను ఎంజాయ్ చేస్తారు.
Read Also: వైజాగ్ లో ఆ రోడ్లన్నీ బంద్, అలా వెళ్లొద్దు.. ఎప్పటి వరకు అంటే?