BigTV English

Mpox Symptoms: ఎంపాక్స్ సోకితే నరకమే..బాధితుడు చెప్పిన భయానక లక్షణాలు ఇవే, వణికిపోతారు!

Mpox Symptoms: ఎంపాక్స్ సోకితే నరకమే..బాధితుడు చెప్పిన భయానక లక్షణాలు ఇవే, వణికిపోతారు!

Mpox Symptoms: కరోనా విధ్వంసాన్ని మరవక ముందే మరో ప్రాణాంతక వ్యాధి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలను మంకీ పాక్స్ వైరస్ వణికిస్తోంది. మంకీ పాక్స్ అని పిలిచే ఈ మహమ్మారి అన్ని దేశాల్లో క్రమంగా వ్యాపిస్తోంది. ఈ అంటు వ్యాధి భారతదేశంలో కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ప్రపంచంలోని అనేక దేశాల్లో మంకీ పాక్స్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులు ప్రపంచ దేశాలను కలవర పెడుతున్నాయి. మొదట ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసు నమోదవగా తాజాగా పాకిస్తాన్, స్వీడన్ తర్వాత ఫిలిప్పైన్స్‌లో మంకీ ఫాక్స్ కేసులు నమోదయ్యాయి.

డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది..
ఆఫ్రికన్ దేశంలో పెరుగుతున్న మంకీ పాక్స్ వ్యాధి సంక్రమణను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ప్రపంచ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఆసియా దేశాల్లో కూడా ఈ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ఫిలిప్పైన్స్ కంటే ముందే ఆగస్టు 16న పాకిస్తాన్‌లో మంకీ పాక్స్ కేసులు మూడు నమోదయ్యాయి. అయితే ఈ ముగ్గురు రోగులు యూఏఈ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారిలో ఈ లక్షణాలు కనుగొన్నారు.


స్వీడన్ లో ఆగస్టు 15 న మొదటి మంకీ పాక్స్ కేసు నమోదైంది. కానీ వ్యాధి సోకిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి జరిగింది. ఆఫ్రికా తర్వాత పాకిస్తన్‌లో రెండవ కేసు నమోదైంది. మంకీపాక్స్ యొక్క క్లాడ్ వన్ వేరియంట్ ఈ వ్యక్తిలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి ఆందోళనకరంగా మారుతోంది. మంకీపాక్స్ అత్యంత భయంకరమైన అంటు వ్యాధి. ప్రాణాలు పోవడానికి కూడా ఇది కారణమవుతుంది. స్వల్ప అజాగ్రత్త కూడా సంక్రమణకు విస్తృత వ్యాప్తికి కారణం అవుతుంది.

Also Read: పురుషులకే పొట్ట ఎందుకు ఎక్కువగా పెరుగుతుందో తెలుసా?

భారతదేశ ప్రజలు అప్రమత్తంగా ఉండండి..
ఈ భయంకరమైన వ్యాధి లక్షణాలు ఫ్లూ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇది పెరుగుతున్న కొద్దీ చీముతో నిండిన దద్దుర్లు శరీరంపై కనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2024 ప్రారంభం నుంచి ఆఫ్రికా దేశంలో ఇప్పటివరకు 14 వేల కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీని ద్వారా 524 మరణాలు కూడా సంభవించాయి. గత సంవత్సరం కంటే ఇది చాలా ఎక్కువ. ఈ మంకీ పాక్స్ కేసుల వల్ల 96 కంటే ఎక్కువ మరణాలు కాంగోలోనే సంభవించాయి. దీంతో భారత దేశ ప్రజలు కూగా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×