BigTV English

Sravanthi Chokkarapu: అమ్మాయిలూ.. స్రవంతి చొక్కారపులా మీరు చేయొద్దు, ఆమెకు ఏమైందంటే?

Sravanthi Chokkarapu: అమ్మాయిలూ.. స్రవంతి చొక్కారపులా మీరు చేయొద్దు, ఆమెకు ఏమైందంటే?

అమ్మాయిలూ జాగ్రత్త. ఇది ప్రత్యేకించి మీ కోసమే. బిజిబిజి లైఫ్ లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యాన్ని చేస్తున్నారా.. ? దొరికిన టాబ్లెట్ వేసుకుని పెయిన్ కు టెంపరరీ రిలీఫ్ ఇస్తున్నారా..? అయితే ఇదిగో ఇలా హాస్పటల్ బెడ్ కు స్టిక్ అవ్వాల్సిందే. ఇదో యాంకర్ స్రవంతి చొక్కారపు లాగా.. తనకు ఏమైంది అనుకుంటున్నారా.. సోసైటిలో చాలా మంది మహిళల్లాగే బిజిలైఫ్ లో పడి అనారోగ్యం పాలైంది. చివరికి ఆసుపత్రిపాలై సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు నాలుగు, ఐదు వారాలు నడవలేని పరిస్థితి. ఈ సమస్య తనొక్కరిదే కాదు.. ఈ కాలపు అమ్మాయిలకు తెలియాల్సిన విషయం.


స్రవంతికి ఏం జరిగింది? సర్జరీ ఎందుకు అనివార్యమైంది? ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆమె 40 రోజులుగా తీవ్రమైన బ్లీడింగ్‌తో బాధపడింది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి సర్జరీ చేయించాల్సి వచ్చింది. మహిళల పీరియడ్స్ టైంలో కొత్త సమస్యను వైద్యులు గుర్తించారు. ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని స్రవంతి కోరుతోంది. ఏ పని చేస్తున్న మహిళలైనా సరే.. రాత్రి పగలు పని చేయొద్దని అంటోంది. పనిపై కమిట్‌మెంట్ ఉండాలి కానీ… అది ఆరోగ్యం పాడయ్యేలా కాదంటోంది.

తన హెల్త్ తో పాటు మహిళలకు స్రవంతి సుధీర్ఘ వివరణ ఇచ్చింది. ఇది స్రవంతి చుక్కారపు పోస్ట్. తను ఏమందో వివరంగా చెప్పుకుందాం. అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పెట్టక తప్పడం లేదు, కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే. స్పెషల్ గా ఆడవారికోసం. గత 35 నుంచి 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్. రకరకాల మెడిసిన్ వాడాను, డాక్టర్ ని డైరెక్ట్ వెళ్లి కంసల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేపించుకోలేదు. అయితే ఒక రోజు షూట్ మార్నింగ్ 6:45 నిమిషాల నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగింది, విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను. అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని, వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీ కి వెళ్లాల్సి వచ్చింది. ఈజీ గా కంప్లీట్ గా రికవర్ అవ్వాలి, ముందు లాగ నడవాలి అంటే ఒక 4 నుండి 5 వారాలు పడ్డది అని చెప్పారు డాక్టర్ తెలిపారు. సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే. అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేసాను మల్లి హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో,ఇబ్బంది పడుతారేమో అని ఫీల్ అవ్వకండి, అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే, హెల్త్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. వర్క్, షూట్స్, ఈవెంట్స్ అని కుదరక నెగ్లెట్ చెయ్యకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. అని స్రవంతి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.


Also Read: భార్యభర్తలు ముద్దు పెట్టుకోవడం మానేస్తే? ఓ మై గాడ్.. ఇలా జరుగుతోందా?

నిజానికి కాలేజీలకు వెళ్లే అమ్మాయిలతో పాటు వర్కింగ్ ఉమెన్స్, హౌస్ వైఫ్స్ జీవితాలు కూడా బిజీగా మారిపోయాయి. ఓ వైపు ఇంటి పనులు, మరోవైపు వర్క్ స్ట్రెస్ తో ఆరోగ్యంపై దృష్టిపెట్టడం లేదు.. దాంతో తమ ఆకలి గురించీ, ఆరోగ్యం గురించీ శ్రద్ధ తగ్గిపోతుంది. ఫలితంగా బరువు పెరగడం, నెలసరి సమస్యలు వేధించడం, షుగర్, థైరాయిడ్‌ లాంటి సమస్యలు మొదలవుతాయి. ఉదయం నుంచీ రాత్రి వరకూ బొంగరాల్లా తిరిగే మహిళలు తమ అలసటనూ, నిస్సత్తువనూ, ఆరోగ్యాన్నీ అశ్రద్ధ చేస్తున్నార. గృహిణిగా, ఉద్యోగినిగా కుటుంబం కోసం ఖర్చయిపోతూ ఉండే మహిళల జీవితాలు చలాకీగా సాగినంత కాలమే కుటుంబం ఎదగగలుగుతుంది. కాబట్టి మహిళలూ… ఫస్ట్ హెల్త్.. ఆ తర్వాతే ఏదైనా.

 

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×