చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడూ మొండిగా, కోపంగా ఉండడం చూసి ఆందోళన చెందుతారు. ఈ అలవాటు ఇలాగే కొనసాగితే ఆ పిల్లలు హింసాత్మకంగా మారుతారు. తరుచూ తల్లిదండ్రులను తమ చుట్టూ ఉన్నవారిని కొట్టడం చేస్తారు. ఇది చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు.
పిల్లల ఇలా ప్రవర్తించడంతో ఇంట్లో వాతావరణం కూడా గందరగోళంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు కోపం వచ్చినప్పుడు కొడతారు. మరికొందరు తల్లిదండ్రులు తమకే ప్రాధాన్యం ఇవ్వాలనే కొట్టడం చేస్తారు. నిపుణులు ఈ ప్రవర్తన మాటలు రాని చిన్నపిల్లల్లో కనిపిస్తుందని చెబుతారు. చిన్న పిల్లలు తమ భావాలను మాటల్లో చెప్పలేకపోతారు. అందువల్ల వారు శారీరకంగా స్పందిస్తారు.
పిల్లలు నిరాశ చెందినప్పుడు లేదా భావోద్వేగాలు అదుపు చేయలేకపోతే కొడతారు. అలసట, ఆకలి, అధిక ఉత్తేజం వల్ల కూడా ఈ ప్రవర్తన వస్తుంది. ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దలు లేదా చుట్టుపక్కల వారి హింసాత్మక ప్రవర్తనను పిల్లలు అనుకరిస్తారు.
పిల్లలు కొడితే తల్లిదండ్రులు కూడా కోపం చేయకుండా ప్రశాంతంగా ఉండాలి. అరవడం లేదా తిరిగి కొట్టడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. పిల్లల చేతులను మెల్లగా పట్టుకొని “కొట్టడం బాధిస్తుంది” అని సరళంగా చెప్పండి. కోపంగా మాట్లాడకుండా దృఢంగా మాట్లాడాలి.
మాటలు రాని చిన్న పిల్లలు తమ భావాలు వ్యక్తం చేయలేక కొడతారు. అందుకే వారికి చిన్న చిన్నగా మాటలు నేర్పించాలి. వారికి మంచి కథలు వినిపించడం, ఏదైనా బొమ్మలు గీయడం లాంటివి చేయాలి. కోపం వచ్చినప్పుడు ఊపిరి బాగా పీల్చాలని ప్రొత్సహించాలి. ఇలాంటివి ప్రతి రోజూ చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
పిల్లలకు సరైన ప్రవర్తన ఏమిటో స్పష్టంగా చెప్పాలి. కొట్టకూడదు అని చెప్పడానికి బదులు మెల్లగా చేతులు తాకి పిలవాలి అని నేర్పండి. పిల్లలు మీరు చెప్పినట్లు మంచిగా ప్రవర్తిస్తే వెంటనే ప్రశంసించండి.
శిక్షించడం కంటే ప్రశింసచడం ఎక్కువ ప్రభావం చూపుతుంది. పిల్లలు ప్రశాంతంగా ఉన్నప్పుడు వారితో ఆడుకోవడం లేదా వారికి నచ్చిన వస్తువులు ఇవ్వండి.
పిల్లలను కొట్టడం లేదా వారికి శారీరకంగా కఠిన శిక్షలు వేయడం సరికాదు. దీంతో వారిలో హింస ప్రవృత్తి మరింత పెరుగుతుంది. తల్లిదండ్రులు ప్రశాంతంగా, గౌరవంగా ప్రవర్తించాలి. తప్పు జరిగితే క్షమాపణ చెప్పాలి.
Also Read: మెత్తని కుళ్లిన టమాటాలను పారేస్తున్నారా? ఇలా ఉపయోగిస్తే మంచి లాభాలు
ఆకలి, అలసట, ఎక్కువ ఉత్తేజం వల్ల పిల్లలు కొడతారు. ఈ కారణాలను గమనించి సరైన ఆహారం, నిద్ర, ప్రేమ ఇవ్వండి. స్థిరమైన దినచర్య పిల్లలకు భద్రత ఇస్తుంది.
పిల్లలు అప్పుడప్పుడు కొట్టడం సాధారణం. కానీ తరచుగా లేదా తీవ్రంగా ఉంటే చైల్డ్ సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ముందుగానే సహాయం తీసుకోవడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.
Also Read: గర్భవతిగా ఉన్నప్పుడు టీ తాగితే బిడ్డ నల్లగా పుడతాడా? డాక్టర్లు చెప్పిన నిజం ఇదే