BigTV English

Airport Free Service: శ్రీవారి దర్శనానికి స్వాగతం.. తిరుపతి ఎయిర్‌పోర్ట్ ఫ్రీ సేవలు మీకోసం రెడీ!

Airport Free Service: శ్రీవారి దర్శనానికి స్వాగతం.. తిరుపతి ఎయిర్‌పోర్ట్ ఫ్రీ సేవలు మీకోసం రెడీ!

Airport Free Service: కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమలకు అతి సమీపంలో ఉన్న ఎయిర్ పోర్ట్ రేణిగుంట (తిరుపతి) . దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు అధికంగా విమాన సౌకర్యం ద్వారా రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుండి శ్రీవారి దర్శనానికి పయనమవుతారు. అందుకే రేణిగుంట ఎయిర్ పోర్ట్ నిత్యం శ్రీవారి భక్తులతో నిండి ఉంటుంది. అందుకే ఈ ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రయాణికులకు కొన్ని ఫ్రీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇంతకు ఆ సర్వీసులు ఏమిటి? మనం వాటి ద్వారా ఎలా లబ్ది పొందాలో తెలుసుకుందాం.


రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌.. ఉచితంగా సేవలివే
విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో, ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు విమానాశ్రయాలు కొత్త కొత్త చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే, తిరుపతికి సేవలందిస్తున్న రేణిగుంట ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు అనేక ఉచిత సౌకర్యాలు అందిస్తోంది. ప్రతీరోజూ వేల మంది ప్రయాణికులు ఉపయోగించే ఈ ఎయిర్‌పోర్ట్‌‍‌లో ఉన్న ఉచిత సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం అందించే సహాయ సేవలు ప్రయాణంలో సౌలభ్యం కలిగిస్తున్నాయి.

ఉచిత పార్కింగ్..
ప్రయాణికులను డ్రాప్ చేయడం లేదా రీసీవ్ చేయడం వంటి తాత్కాలిక అవసరాల కోసం పార్కింగ్ ఉచితంగా అందుబాటులో ఉంది. ఇది పబ్లిక్ రవాణా, ప్రైవేట్ వాహన వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అయితే సమయం 10 నుండి 15 నిమిషాల వరకేనని సమాచారం.


ఉచిత Wi-Fi సేవలు..
ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ ప్రాంగణంలో ప్రయాణికులు సాధారణంగా 30 నిమిషాలు ఉచితంగా Wi-Fi ఉపయోగించవచ్చు. ఇది మొబైల్ డేటా ఖర్చును ఆదా చేయడంతో పాటు, వేచి ఉన్న సమయంలో ఆన్లైన్ కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది.

ఫ్రీ టాయిలెట్స్..
ఎయిర్‌పోర్ట్‌లో శుభ్రమైన టాయిలెట్‌లు అందుబాటులో ఉండటం, రెగ్యులర్‌గా మెయింటెనెన్స్ చేయడం అనేది ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు ఎంతో ముఖ్యం. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ ఈ విషయంలో మంచి గుర్తింపు పొందుతోంది.

తాగునీరు..
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఉచితంగా అందుబాటులో ఉన్న తాగునీటి పాయింట్లు కూడా ఈ ఎయిర్ పోర్ట్ లో అందుబాటులో ఉన్నాయి.

వెయిటింగ్ ఏరియా..
విమాన ప్రయాణ సమయంలో ముందస్తుగా కొందరు ప్రయాణికులు కానీ, లేక వారికి స్వాగతం పలికేందుకు వచ్చే వారు అధికం. అటువంటి సందర్భాల్లో విశ్రాంతికి అనువుగా జనరల్ వేటింగ్ ఏరియా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇవి ఏసీ లాంజ్‌లు కాకపోయినా, శుభ్రంగా ఉంటాయి.

సహాయక సిబ్బంది సేవలు..
వృద్ధులు, గర్భిణీలు, దివ్యాంగులు వంటి ప్రయాణికులకు ప్రత్యేక సహాయాన్ని ఉచితంగా అందించే సిబ్బంది ఉండటం ఒక పెద్ద సౌలభ్యం. వారిని వాహనాల దగ్గర నుంచి టెర్మినల్ వరకు సహాయం చేస్తారు. ఫ్లైట్ డేటా, బస్సు, టాక్సీ వివరాలు, ఎయిర్‌పోర్ట్ మాపింగ్ వంటి అనేక విషయాల్లో ఉచిత సమాచారం అందించేందుకు ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది.

Also Read: Namrata Shirodkar Sister: హీరో మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం.. జాగ్రత్త అంటూ సందేశం..

ప్రాథమిక వైద్య సేవలు..
ఆకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు, ప్రాథమిక వైద్య సిబ్బంది ఉచితంగా సేవలు అందిస్తారు. ఇది అత్యవసర సమయాల్లో ప్రయాణికులకు ఉపయోగపడుతుంది.
ప్రత్యేక సందర్భాల్లో, కొన్ని విమానయాన సంస్థలు డిలే అయినప్పుడు ఉచిత రిఫ్రెష్మెంట్స్ లేదా సీట్ అప్‌గ్రేడ్ వంటి సదుపాయాలు కూడా అందించవచ్చు. అయితే ఇవి ఎయిర్‌లైన్ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి.

తిరుపతి రేణిగుంట విమానాశ్రయం దేశీయ ప్రయాణికులకు కేవలం గమ్యస్థానమే కాకుండా, సౌలభ్యంతో కూడిన సేవల కేంద్రంగా మారుతోంది. ఈ ఉచిత సౌకర్యాలు సాధారణ ప్రయాణికులకు ప్రయాణంలో భారం తగ్గిస్తూ, విమానయాన సేవలను మరింత చేరువ చేసేందుకు విమానయాన శాఖ ఉచిత సేవలు అందిస్తోంది.

Related News

AP Politics: గుంటూరు టీడీపీ కొత్త సారథి ఎవరంటే?

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Big Stories

×