E-Paper
Advertisement

స్టెంట్ వేసుకున్న తర్వాత కూడా హార్ట్ అటాక్ వస్తుందా? గుండె డాక్టర్ చెప్పిన సమాధానమిదే

స్టెంట్ వేసుకున్న తర్వాత కూడా హార్ట్ అటాక్ వస్తుందా? గుండె డాక్టర్ చెప్పిన సమాధానమిదే
Advertisement

స్టెంట్ వేయించుకున్న తర్వాత చాలా మంది ఇకపై హార్ట్ అటాక్ రాదని భావిస్తారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. గురుగ్రామ్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రోహిత్ గోయల్ ప్రకారం.. స్టెంట్ వల్ల గుండెలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కానీ గుండె జబ్బును పూర్తిగా తొలగించదు. అందుకే స్టెంట్ వేసుకున్న తర్వాత కూడా గుండె ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.

స్టెంట్ ఎలా పనిచేస్తుంది?

కరోనరీ స్టెంట్ అనేది చిన్న మెష్ ట్యూబ్ లాంటిది. వైద్యులు దీన్ని మూసుకుపోయిన లేదా ఇరుకైన గుండె ధమనిలో అమర్చుతారు. ఆ తరువాత ఆ ధమనిలో ఇరుకుగా ఉండే ప్రదేశం మళ్లీ తెరుచుకుంటుంది. స్టెంట్ వల్ల రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. గుండె కండరాలకు అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. దీంతో తక్షణ ప్రమాదాలు తగ్గుతాయి. అయితే స్టెంట్ కేవలం ఒక అడ్డంకిని మాత్రమే తొలగిస్తుంది. గుండె జబ్బుకు కారణమైన ఇతర సమస్యలను పూర్తిగా నయం చేయదు.

స్టెంట్ తర్వాత కూడా హార్ట్ అటాక్ రావచ్చు.. దానికి కారణాలు ఇవే

Advertisement

డాక్టర్ రోహిత్ చేసిన సూచనల ప్రకారం.. స్టెంట్ వేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మళ్లీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది.

1. మళ్లీ ధమని ఇరుకుగా మారడం

కొన్నిసార్లు స్టెంట్ అమర్చిన ధమని మళ్లీ ఇరుకుగా మారుతుంది. దీంతో రక్తప్రసరణ తగ్గిపోతుంది.

2.స్టెంట్‌లో రక్తం గడ్డకట్టడం

Advertisement

స్టెంట్ లోపల కూడా రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. ఈ గడ్డలు రక్తప్రసరణను అకస్మాత్తుగా ఆపేయవచ్చు. అలాంటి పరిస్థితిలో మరోసారి గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

3. వైద్యులు సూచించిన మందులు ఆపేయడం

కొంతమంది ఆరోగ్యం మెరుగుపడగానే మందులు తీసుకోవడం మానేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. రక్తాన్ని పలుచగా ఉంచే మందులు, కొలెస్ట్రాల్ నియంత్రణ మందులు తప్పనిసరిగా తీసుకోవాలి.

4. నియంత్రణలో లేని ఆరోగ్య సమస్యలు

మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి. ఈ సమస్యలు అదుపులో లేకపోతే గుండె ప్రమాదాలు పెరుగుతాయి.

5. అనారోగ్యకరమైన జీవనశైలి

ధూమపానం గుండె ఆరోగ్యానికి పెద్ద శత్రువు. అధిక బరువు, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.

స్టెంట్ తర్వాత గుండెను ఎలా కాపాడుకోవాలి?

  • స్టెంట్ వేసుకున్న తర్వాత వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించాలి.
  • సమయానికి మందులు తీసుకోవాలి.
  • పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి.
  • రోజూ తగినంత వ్యాయామం చేయాలి.
  • ధూమపానం పూర్తిగా మానేయాలి.
  • మద్యం సేవనాన్ని తగ్గించాలి. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచాలి.
  • క్రమం తప్పకుండా కార్డియాలజిస్ట్‌ను కలవడం కూడా చాలా ముఖ్యం.

Also Read: ఉమ్మడి కుటుంబంలో పిల్లలకు మంచి విలువలు, సంస్కారం నేర్పాలనుకుంటున్నారా.. ఈ సులభమైన టిప్స్ మీ కోసమే

ఈ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు

  • ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • అధికంగా చెమటలు పడటం
  • దవడ లేదా ఎడమ చేతిలో నొప్పి
  • అకస్మాత్తుగా బలహీనత
  • తీవ్ర అలసట

పై లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. సమయానికి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తగ్గించవచ్చు.

స్టెంట్ గుండెకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కానీ భవిష్యత్తులో గుండెపోటు ప్రమాదం రాకుండా పూర్తిగా రక్షించదు. మందులు క్రమంగా తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం చాలా అవసరం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే గుండె సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

Related News

భార్యాభర్తల మధ్య దూరం అక్రమ సంబంధాలకు దారితీస్తుందా?

హైబ్రిడ్ ఫిట్‌నెస్ అంటే ఏంటి? స్టామినా, బలం రెండూ పెంచే కొత్త వర్కౌట్స్

ప్రేమలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా పొసిసివ్

కిచెన్‌లో మీరు చేసే ఈ 9 తప్పుల వల్లే వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు..

పిల్లలు బొటనవేలు ఎందుకు చీకు తుంటారు? ఈ అలవాటు మాన్పించేందుకు ఈజీ టిప్స్ hi

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

Big Stories

Advertisement
×