Health Tips For Women: 30 ఏళ్ల తర్వాత మహిళలు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ వయస్సు తర్వాత కొన్ని రకాల ఆహారాలకు తప్పకుండా దూరంగా ఉండటం మంచిది. లేకుంటే అవి ఆరోగ్యం , చర్మం రెండింటికీ ప్రభావం పడుతుంది. స్త్రీలైనా, పురుషులైనా, 30 ఏళ్ల తర్వాత వారి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అది వారి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అందుకే ఈ వయస్సులో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఈ కాలంలో ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, రక్తహీనత, థైరాయిడ్ వంటి అనేక వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
ఇదే కాకుండా, ఆహారం సరిగ్గా లేకుంటే, వృద్ధాప్యం చర్మంపై వేగంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వయస్సు పెరుగుతున్నా కొద్దీ ఇంట్లో పనుల కారణంగా మహిళలు తమపై తాము అంత శ్రద్ద చూపించరు. కానీ ఇలా చేయడం చాలా తప్పు. 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తీపి పదార్థాలకు దూరంగా ఉండండి:
స్వీట్స్ ఎక్కువగా తినడం ఏ వయసు వారైనా మంచిది కాదు. 30 ఏళ్లు దాటిన తర్వాత వీలైనంత వరకు తియ్యటి పదార్థాలు తినకుండా ఉండాలి. వాస్తవానికి, 30 సంవత్సరాల వయస్సు తర్వాత జీవక్రియ క్రమంగా మందగించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం మునుపటి కంటే చాలా రెట్లు పెరుగుతుంది. అంతే కాకుండా, ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, ముడతలు, మచ్చలు , స్థూలకాయం వంటివి వస్తుంటాయి.
వేయించిన ఆహారం:
30 ఏళ్ల తర్వాత మహిళలు వీలైనంత వరకు వేయించిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి. ఈ వయస్సులో, మీ ఆహారంలో తక్కువ నూనెతో తయారు చేసిన, ఆరోగ్యకరమైన , ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే చేర్చుకోండి. ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా వేయించిన ఆహారంలో కనిపిస్తుంది. ఇది శరీరానికి చాలా హానికరం. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే చర్మానికి ఏమాత్రం మంచిది కాదు.
కెఫిన్ తీసుకోవడం తగ్గించండి:
30 ఏళ్లు దాటిన తర్వాత, మహిళలు ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం మానుకోవాలి. నిజానికి, కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని కారణంగా మానసిక ఆరోగ్య సంబంధిత సమస్యలైన డిప్రెషన్, యాంగ్జయిటీ, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీంతో పాటు అధిక కెఫిన్ చర్మం త్వరగా వృద్ధాప్యానికి కారణమవుతుంది. అంటే చిన్న వయసులోనే మీ చర్మంపై ముడతలు, చక్కటి గీతలు కనిపిస్తాయి.
Also Read: ప్రతి రోజు ఉదయం ఈ డ్రింక్ తాగితే.. ఫుల్ ఎనర్జీ
ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దు:
ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత .. మహిళలు ఉప్పు తీసుకోవడం వీలైనంత తగ్గించాలి. ఆహారంలో ఉప్పు అధికంగా ఉండటం వల్ల రక్తపోటు సమస్యలు వస్తాయి. అంతే కాకుండా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. 30 ఏళ్ల తర్వాత అధికంగా ఉప్పు తీసుకునే స్త్రీలకు థైరాయిడ్ సమస్యలు కూడా రావచ్చు.