BigTV English

Sonia Gandhi George Soros: సోనియా గాంధీకి జార్జి సోరోస్ నుంచి నిధులు అందుతున్నాయి.. బిజేపీ ఆరోపణలు

Sonia Gandhi George Soros: సోనియా గాంధీకి జార్జి సోరోస్ నుంచి నిధులు అందుతున్నాయి.. బిజేపీ ఆరోపణలు

Sonia Gandhi George Soros| కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీకి అమెరికా వ్యాపార వేత్త జార్జి సోరోస్ నుంచి నిధులు అందుతున్నాయని.. కశ్మీర్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా విడగొట్టడానికి జార్జి సోరోస్ కుట్ర చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజేపీ) తీవ్ర ఆరోపణలు చేసింది. ఆదివారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో బిజేపీ సోనియా గాంధీపై ఆరోపణలు చేస్తూ వరుసగా కొన్ని పోస్ట్‌లు పెట్టింది. భారత దేశ అంతర్గత వ్యవహారాలను విదేశియులు ప్రభావితం చేయడం చాలా సీరియస్ అంశమని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు.


పార్లమెంటు శీతాకాల సమావేశాల పున:ప్రారంభానికి ముందు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. “మేము పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగించాలనుకుంటున్నాం. కొన్ని సమస్యలు రాజకీయ కోణంలో ఉంటాయని స్పష్టం చేస్తున్నాను. కానీ విదేశీ శక్తులు భారత దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిస్తే.. ఇది చాలా సీరియస్ అంశంగా పరిగణిస్తాం.” అని అన్నారు.

మరోవైపు లోక్ సభ బిజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కూడా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తరుచూ విదేశాలకు వెళ్లి జార్జి సోరోస్‌తో మీటింగులు చేస్తున్నారని.. అమెరికా ప్రభుత్వం కూడా జార్జి సోరోస్ వెనుక ఉండి భారత దేశలో ప్రభుత్వం కూల్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ తరువాత అమెరికా అధికారులు బిజేపీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేంసింది. అయితే తాజాగా ఎంపీ నిశికాంత్ దూబే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి తాను ఈ అంశంపై 10 ప్రశ్నలు అడుగుతానని ప్రకటించారు.


హంగేరి, అమెరికా దేశాల పౌరసత్వం ఉన్న బడా వ్యాపారవేత్త ఓసిసిఆర్‌పి (Organised Crime and Corruption Reporting Project) అనే ఇన్‌వెస్టిగేటివ్ మీడియా సంస్థ నడుపుతున్నారని.. నిజానికి ఈ సంస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి, దేశంలో మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేయడానికే పనిచేస్తోందని ఆరోపించారు. ఈ సంస్థ ఇచ్చే రిపోర్ట్ ల ఆధారంగా మోడీ ప్రభుత్వంపై రాహుల్ దాడులు చేస్తున్నారని వెల్లడించారు.

Also Read:  మోడీ వ్యతిరేకి ఐపిఎస్ ఆఫీసర్‌కు కోర్టులో ఊరట.. లాకప్ డెత్ కేసులో నిర్దోషిగా తీర్పు

మరోవైపు సోనియా గాంధీ సహ అధ్యక్షురాలిగా (co-president) ఉన్న ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్ (FDL-AP) ఫౌండేషన్‌కు కూడా జార్జి సోరోస్ ఫౌండేషన్ నుంచి నిధులు అందుతున్నాయని బిజేపీ ఆరోపణలు చేసింది. అంతే కాకుండా సోనియా గాంధీ చైర్మెన్ గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లో కూడా జార్జి సోరోస్ ఫౌండేషన్ భాగస్వామిగా ఉందని తెలిపారు. ఈ ఆధారాలు చాలు భారతసంస్థల్లో విదేశీ శక్తుల ప్రభావం ఉందని చెప్పడానికి” అని బిజేపీ ట్వీట్ చేసింది.

“అదానీపై అవినీతి ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ నిర్వహించిన లైవ్ టెలికాస్ట్ మీడియా కార్యక్రమానికి కూడా జార్జి సోరోస్ సంస్థ ఒసిసిఆర్‌పి ఫండింగ్ చేసింది. ఇదంతా వారి మధ్య బలమైన, ప్రమాదకరమైన సంబంధం ఉందని.. వారు సంయుక్తంగా దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా జార్జి సోరోస్ తన పాత మిత్రుడని బహిరంగంగా చెప్పారు.” అని బిజేపీ వరుసగా ఎక్స్ లో పోస్ట్ లు చేసింది.

ఒసిసిఆర్‌పి అనే మీడియా సంస్థ అవినీతి, ప్రపంచదేశాల ప్రభుత్వాలు చేస్తున్న నేరాలను వెలుగులోకి తీసుకువచ్చే పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం కెనెడాలోని ఆమ్‌స్టర్‌డ్యామ్ లో ఉంది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×