BigTV English

World Thyroid Day 2025: థైరాయిడ్ వల్ల జుట్టు ఎందుకు రాలుతుంది ?

World Thyroid Day 2025: థైరాయిడ్ వల్ల జుట్టు ఎందుకు రాలుతుంది ?

World Thyroid Day 2025: కొంతకాలం క్రితం వరకు, జుట్టు రాలడం అనే సమస్య వృద్ధాప్యంలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు యువత కూడా దీనికి బలైపోతున్నారు. ఈ సమస్య 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా కనిపిస్తోంది.జుట్టు సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్రజలు వివిధ రకాల చిట్కాలు పాటిస్తుంటారు. అంతే కాకుండా నూనెలు, మందులను ఉపయోగిస్తారు కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.


మీరు కూడా జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. ఏదైనా చికిత్సను ఉపయోగించే ముందు, దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమస్యను గుర్తించి దానికి అనుగుణంగా చికిత్స చేయడం చాలా ముఖ్యం.

జుట్టు రాలడం సమస్య కొన్నిసార్లు థైరాయిడ్ రుగ్మతల వల్ల కూడా వస్తుందని మీకు తెలుసా ? థైరాయిడ్ సమస్యలు సాధారణంగా బరువు పెరగడంతో ముడిపడి ఉంటాయి. కానీ అది జుట్టు ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.


థైరాయిడ్ సమస్య:

ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే.. జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. కానీ అది అకస్మాత్తుగా, వేగంగా జరగడం ప్రారంభించినప్పుడు, దాని వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం అవసరం. కొన్నిసార్లు జుట్టు సమస్యలు ఏదైనా తీవ్రమైన వ్యాధి లేదా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యల యొక్క సైడ్ ఎఫెక్ట్ కూడా కావొచ్చు.

థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత జీవక్రియను ప్రభావితం చేయడమే కాకుండా జుట్టు ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

జుట్టు రాలడం సమస్య:
జుట్టు కుదుళ్లు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు ఈ రకమైన పరిస్థితి తలెత్తుతుంది. హైపోథైరాయిడిజంతో బాధపడేవారు తరచుగా జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి థైరాయిడ్ సమస్యలు జుట్టును పొడిగా చేస్తాయి. అంతే కాకుండా ఇది జుట్టు మూలాలను బలహీన పరుస్తుంది. జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది.

థైరాయిడ్ అనేది గొంతు దిగువ భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రంథి T3 , T4 అనే రెండు ప్రధాన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర జీవక్రియ, శక్తి స్థాయిలు, జుట్టుతో సహా చర్మం, గోళ్ల ఆరోగ్యాన్ని నియంత్రిస్తాయి.ఈ కారణంగానే థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారికి జుట్టు సంబంధిత సమస్యలు మొదలవుతాయి.

Also Read: మందార పూలను ఇలా వాడితే.. చందమామ లాంటి చర్మం మీ సొంతం

థైరాయిడ్ రుగ్మత శరీరంలో.. జుట్టుతో పాటు అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది.

ముఖ్యంగా హైపో థైరాయిడిజం కారణంగా.. కనుబొమ్మల నుండి జుట్టు రాలడం, గోళ్లు విరిగిపోవడం, బలహీనపడటం.. చర్మంలో చికాకు ,వాపు వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. దీంతో పాటు.. ఈ పరిస్థితి స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా జరగకపోవడం, గర్భం దాల్చడంలో ఇబ్బందిని కూడా కలిగిస్తుంది.

Also Read: జామ ఆకులను ఇలా వాడితే.. తలమోయలేనంత జుట్టు

Related News

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Alcohol: 30 రోజులు ఆల్కహాల్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Masala Vada: మాసాలా వడ బయట తిన్నట్లే క్రిస్పీగా రావాలంటే.. ఇలా ట్రై చేయండి

Brain Health:ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది

High Cholesterol: గుండె జబ్బులు రాకూడదంటే ? నిపుణుల సూచనలివే !

Warning Signs of Stroke: బ్రెయిన్ స్ట్రోక్.. ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి ?

Big Stories

×