Thammudu : ఓ మై ఫ్రెండ్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వేణు శ్రీరామ్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే అప్పటి నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా కూడా దర్శకుడు వేణు శ్రీరామ్ ది కొద్దిపాటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పటివరకు వేణు శ్రీరామ్ చేసిన ప్రతి సినిమా కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి వచ్చింది. నాని హీరోగా సాయి పల్లవి హీరోహిన్ గా వచ్చిన ఎంసీఏ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది అక్కడితో వేణు శ్రీరామ్ కూడా దర్శకుడుగా స్థిరపడిపోయాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే. అజ్ఞాతవాసి సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమైపోయాడు అనుకునే తరుణంలో మళ్లీ త్రివిక్రమ్ మాటతో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ ప్రాజెక్ట్ సెట్ అయింది.
వకీల్ సాబ్ తీసుకొచ్చిన క్రేజ్
ఇప్పటికీ చాలామందికి వేణు శ్రీరామ్ అంటే టక్కును గుర్తొచ్చే సినిమా వకీల్ సాబ్. ఒక రీమేక్ సినిమాకి ఎక్కడ హై ఉండాలో, పవన్ కళ్యాణ్ ను ఎలా ఎలివేట్ చేయాలో అద్భుతంగా డిజైన్ చేశాడు వేణు శ్రీరామ్. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాలలో వకీల్ సాబ్ ది బెస్ట్ అని చెప్పాలి. అప్పట్నుంచి చాలామంది వేణు శ్రీరామ్ ను ది మాస్ గాడ్ అనడం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం వేణు శ్రీరామ్ నితిన్ తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమానులు కావడంతో, నితిన్ తో చేస్తున్న సినిమాకు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ తమ్ముడు అనే పేరును ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకి ఈ టైటిల్ కరెక్ట్ అని చిత్తర యూనిట్ భావించిందట, ఇది అక్కా తమ్ముడు మధ్య ఉండే ఎమోషనల్ స్టోరీ అని సమాచారం వినిపించింది.
ట్రైలర్ బాగుంది
తమ్ముడు సినిమా చాలా బాగా వస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఆల్రెడీ కట్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది అని తెలుస్తుంది. అలానే సినిమా కూడా నితిన్ కి మంచి కం బ్యాక్ అవ్వబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ కాబట్టి చాలామందికి ఒక క్యూరియాసిటీ కూడా ఉంటుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా నితిన్ సినిమాలను ఆదరిస్తారు. నితిన్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమాని అని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు.
Also Read : RahulSankrityan : విజయ్ దేవరకొండ, రాహుల్ సినిమా స్టార్ అయ్యేది అప్పుడే