E-Paper
Advertisement

చేతులు ఎత్తేశావా సర్దార్.. రెండో రోజుకే దుకాణం డౌన్!

చేతులు ఎత్తేశావా సర్దార్.. రెండో రోజుకే దుకాణం డౌన్!
Advertisement

Sardar 2 Box Office:సర్దార్.. అంటూ మొదటి సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడంతో దానికి సీక్వెల్ గా సర్దార్ 2 అనే సినిమాని పట్టా లెక్కించాడు కార్తి.ఇక ఈ సినిమా ట్రైలర్ మంచి టాక్ తెచ్చుకోవడంతో సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారంతా.

పైగా ఈ సినిమాల్లో ఎస్ జె సూర్య, మాళవిక మోహన్, ఆశిక రంగనాథ్, యోగి బాబు లాంటి స్టార్స్ నటించడంతో సినిమాపై బజ్ మరింత పెరిగిపోయింది. కానీ తీరా సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చాక సినిమా పై ఉన్న అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

Advertisement

మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్‌

పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకోవడం గమనార్హం.ఫస్ట్ పార్టు లో ఉన్న డ్యూయల్ రోల్ మ్యాజిక్, పవర్ ఫుల్ స్క్రీన్ ప్లే  ఈ సీక్వెల్‌లో పూర్తిగా మిస్ అయ్యాయన్న టాక్ వినిపిస్తుంది.

Advertisement

స్క్రీన్ ప్లే స్లోగా ఉండటం , అనవసరమైన సీన్లు, కథకు ఉపయోగపడని భారీ యాక్షన్ డ్రామా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుందని వినిపిస్తుంది.’పేరుకే సీక్వెల్ కానీ.. మొదటి పార్ట్ ఇచ్చిన ఇంపాక్ట్‌లో 10 పర్సెంట్ కూడా అంటూ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్లు.

దాదాపు రూ.130 కోట్ల భారీ బడ్జెట్

ఇక ఈ సినిమాకి దాదాపు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌ పెట్టగా ,ఈ ప్రపంచవ్యాప్తంగా 1600కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారట మేకర్స్.ఇక ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే సుమారు రూ.70 కోట్లు జరగ్గా, సినిమా సేఫ్ అవ్వాలంటే దాదాపు రూ.75 కోట్ల షేర్ రాబట్టాల్సిన పరిస్థితి.. కానీ వచ్చిన నెగెటివ్ టాక్ వల్ల కలెక్షన్లు మొదటి రోజే సర్దార్ చేతులేయాల్సిన పరిస్థితి.

దాదాపు రూ.6 కోట్లకు పైగా

ఇక మొదటి రోజు ఇండియాలో దాదాపు రూ.6 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినప్పటికీ ,రెండో రోజుకే సీన్ పూర్తిగా మారిపోయిందట . ఏమైనా పిక్ అప్ అవుతుందేమో అని ఆశ పడ్డ మేకర్స్ కి షాక్ ఇస్తూ రెండో రోజు ఇండియాలో కేవలం 2.5కోట్ల పై చిలుకు మాత్రమే రాబట్టడం గమనార్హం .ఇక మూడో రోజు కూడా కేవలం . దాదాపు రూ.2.5 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది.

‘సర్దార్ 2’ కోలుకోవడం అసాధ్యమే

మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 3 రోజుల్లో కలిపి రూ.11 కోట్ల గ్రాస్ (సుమారు రూ.6 కోట్ల షేర్) మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది.
ఈలెక్కన రూ.130 కోట్ల బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ ఉన్నా సరే, వీకెండ్‌లోనే ఆక్యుపెన్సీ పడిపోవడం సినిమా డిజాస్టర్ అయినట్టు తేల్చేస్తుంది. మొదటి భాగం ఇచ్చిన ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తే.. అది కాస్తా రూ.60 కోట్ల భారీ డిజాస్టర్‌గా మారేలా ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ‘సర్దార్ 2’ కోలుకోవడం అసాధ్యమే

Tags

Related News

సీతమ్మ ఇలా మారిపోయిందేంటి..మృణాల్ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా!

ఛాన్స్ ఇస్తాం.. కానీ ఆ పని చేయాలంటూ ఆఫర్.. ఖుషీ షాకింగ్ రివీల్!

టాలీవుడ్ హీరో భార్యతో మనస్పర్థలంట.. విడాకులపై బయటకొచ్చిన క్లారిటీ

హీరో అజిత్ ను కలిసిన సీఎం విజయ్.. ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

పాలక్ తివారీ అందాల జాతర.. ఒక్క ఫొటోతో ఫుల్ వైరల్!

ఆ అక్కినేని హీరో ‘మనం’ సినిమా చూడలేదా? కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

త్రివిక్రమ్‌ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? ‘ఆదర్శ కుటుంబం’పై మొదలైన డౌట్స్‌!

Big Stories

Advertisement
×