E-Paper
Advertisement

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!
Advertisement

OG Universe:OG’ …ఎన్నాళ్లగానో ఒక్క సాలిడ్ హిట్ అంటూ ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ ఆకలి తీర్చిన సినిమా ఇది.ఇక ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అని ఇప్పటికే హింట్ ఇవ్వగా ఇపుడు ‘OG’ నుండి  మరోసారి పూనకాలు తెప్పించే అప్డేట్ వచ్చేసింది.

తాజాగా OG Universe – The Origin of Fire పేరుతో వచ్చిన OST ఇప్పుడు మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది.. “Here we go..!” అంటూ మేకర్స్ ఇచ్చిన ఈ అప్డేట్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌లో మరోసారి ఫుల్ జోష్ నింపుతోంది.

They Call Him OG

Advertisement

ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఓ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించిన ‘They Call Him OG’ తర్వాత, ఇప్పుడు సినిమాని యూనివర్స్ అంటూ స్పాన్ పెంచే ప్రయత్నంలో ఉండగా ఇపుడు వచ్చిన ఈ OSTపై ఆసక్తి మరింత పెరిగింది.

ఇక ‘The Origin of Fire’ OST విషయంలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ మ్యూజిక్. OG సినిమాకు సంగీతం అందించిన ఎస్. థమన్ ఇప్పటికే తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో,. ‘Firestorm’ లాంటి ట్రాక్‌తో సినిమాకి మెయిన్ ఎసెట్ గా నిలిచారు.

Advertisement

అలాంటి తమన్ ఇప్పుడు యూనివర్స్ కాన్సెప్ట్‌కు తగ్గట్టుగా మరింత ఇంటెన్స్ సౌండ్‌ను తీసుకొస్తున్నాడనే వార్త ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తుంది.

ఎదో పెద్ద ప్లానే

2025 సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ‘They Call Him OG’లో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా కనిపించి ఆడియన్స్ కి మత్తెక్కించారు.సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించగా పవన్ కళ్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

అయితే OG కథ అక్కడితో ఆగిపోదని ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ చూస్తేనే అర్థం అవుతుంది .. సెప్టెంబర్ 2న విడుదలైన కొత్త ప్రమోషనల్ వీడియోలో నేటాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ వంటి భారత చరిత్రకు సంబంధించిన అంశాలను జోడించడం చూస్తుంటే ఎదో పెద్దగానే పెద్ద ప్లానే చేస్తున్నట్టు తెలుస్తుంది.

తాజాగా విడుదలైన‘The Origin of Fire’ OST

అంతేకాదు.. ఈ కొత్త విజన్‌లో సమురాయ్ లుక్‌లో పవన్ కళ్యాణ్‌ను చూపించడం ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇచ్చింది. ‘OG’లో గ్యాంగ్‌స్టర్ షేడ్స్‌లో కనిపించిన పవన్.. ఇప్పుడు సమురాయ్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తే ఎలా ఉంటుందనే ఊహలు సోషల్ మీడియాలో అప్పుడే మొదలయ్యాయి.తాజాగా విడుదలైన ‘To Orochi Gen Shin with Love’ వీడియో ఆ ఊహలకి మరింత బలాన్ని చేకూర్చాయి.

మొత్తంగా ఇప్పటికే ‘They Call Him OG’ ద్వారా ఓజాస్ గంభీర అనే క్యారెక్టర్‌కి ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసిన సుజీత్.. దాన్ని మరింత విస్తరించే ప్లాన్‌లో ఉన్నట్టు తాజా ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి అర్థమవుతోంది.

Also read :‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

దృష్టి మొత్తం మళ్లీ OG యూనివర్స్‌పైనే

మరోవైపు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘OG’కి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడటానికి ప్రధాన కారణాల్లో ఆయన గెటప్, యాక్షన్ ప్రెజెంటేషన్‌తో పాటు థమన్ మ్యూజిక్ కూడా ఒకటి. అందుకే ఇప్పుడు ‘The Origin of Fire’ OST బయటకు రావడంతో ఫ్యాన్స్ దృష్టి మొత్తం మళ్లీ OG యూనివర్స్‌పైనే పడింది.చూడాలి మరి తమన్ సహాయంతో  సుజిత్ పవన్ తో ఎలాంటి యూనివర్స్ కి తెరతీయనున్నాడో !

 

Tags

Related News

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×