E-Paper
Advertisement

ఒక్క సినిమా కెరీర్ మొత్తం మార్చేసింది.. ఇప్పుడు ఆమె రేంజ్ ఇదే!

ఒక్క సినిమా కెరీర్ మొత్తం మార్చేసింది.. ఇప్పుడు ఆమె రేంజ్ ఇదే!
Advertisement

Mamitha Baiju:సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాదు. కానీ ఒక్క సినిమా మాత్రం వాళ్ల కెరీర్‌నే మార్చేస్తుంది. అలాంటి హీరోయిన్లలో మమితా బైజు కూడా ఒకరు.మమితా బైజు మలయాళంలో చాలానే సినిమాలు చేసింది. కానీ ‘ప్రేమలు’ సినిమాతో వచ్చిన గుర్తింపు మాత్రం వేరే లెవల్ అని చెప్పాలి.

సినిమాల్లోకి చిన్నప్పుడే..

మమితా బైజు చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చింది. మొదట కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.ఆ తర్వాత ‘ఆపరేషన్ జావా’, ‘ఖో-ఖో’, ‘సూపర్ శరణ్య’, ‘రెండు’ వంటి సినిమాల్లో నటించింది.ఈ సినిమాలతో నటిగా మంచి పేరు వచ్చినా.. స్టార్ హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు రాలేదు.

‘ప్రేమలు’తో ఒక్కసారిగా క్రేజ్

Advertisement

2024లో వచ్చిన ‘ప్రేమలు’ సినిమా మమితా బైజు కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి.ఈ సినిమాలో నస్లెన్‌కు జోడీగా రీను పాత్రలో చాలా నేచురల్‌గా నటించింది మమితా బైజు.ముఖ్యంగాఆమె యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్, క్యూట్ లుక్స్ యూత్‌కు బాగా నచ్చాయి.అలా సినిమా సూపర్ హిట్ కావడంతో మమితా బైజు పేరు ఒక్కసారిగా అందరికీ తెలిసిపోయింది.

సోషల్ మీడియాలోనూ ఫుల్ క్రేజ్

‘ప్రేమలు’ తర్వాత మమితా బైజు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘ప్రేమలు’ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో మమితాకు ఇక్కడ కూడా ఫ్యాన్స్ పెరిగారు.అప్పటివరకు మలయాళంలో నటించిన హీరోయిన్‌గా ఉన్న మమితా.. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమైంది.

వరుసగా సినిమాలు

Advertisement

‘ప్రేమలు’ తర్వాత మమితా బైజు వరుసగా సినిమాలు చేస్తోంది.కర ,డ్యూడ్ ,జననాయగన్ ఇలా ప్రిస్టేజియస్ గా ఏ సినిమా మొదలైనా మామితా నే ఆన్ బోర్డు అవ్వడం విశేషం.

ఇక తెలుగులో సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’తో మరింత దగ్గర అవుతుంది అనడంలో సందేహం లేదు.దీంతో మమితాకు మలయాళంతో పాటు తెలుగు ఆడియన్స్‌లో కూడా మంచి క్రేజ్ రావడం పక్కా

ఇప్పుడు ఆమె రేంజ్ ఇదే!

మమితా బైజు కెరీర్ చూస్తే ఒక్క విషయం మాత్రం క్లియర్‌గా తెలుస్తుంది.ఆమె ‘ప్రేమలు’ కంటే ముందు కూడా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలన్నింటికంటే ‘ప్రేమలు’ ఆమెకు ఇచ్చిన గుర్తింపు చాలా ఎక్కువ.చెప్పాలంటే ఒక్క సినిమాతో పేరు, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ పెరిగిపోయాయి.కానీ ఇప్పుడు ఆమె ముందున్న అసలు ఛాలెంజ్ మాత్రం ఈ క్రేజ్‌ను అలాగే కొనసాగించడం.

also read:రిలీజ్‌కు ముందే జైలర్ 2 రికార్డ్.. ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే ధర!

మంచి కథలు, మంచి పాత్రలు ఎంచుకుని వరుస హిట్లు ఇస్తే.. మమితా బైజు రేంజ్ ఇంకా పెరగడం ఖాయం.ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు.. ఒక్క ‘ప్రేమలు’ సినిమాతో వచ్చేసింది. ఇప్పుడు ఆ క్రేజ్‌ను ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి!

Tags

Related News

రిలీజ్‌కు ముందే జైలర్ 2 రికార్డ్.. ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే ధర!

రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయడం వల్లే..తేజస్విని మదివాడ వైరల్ కామెంట్స్ !

ఈ వీకెండ్ సినిమాల జాతర.. బరిలో ఉన్నవి ఇవే!

బండ్ల గణేష్ ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఘనంగా హల్దీ వేడుక!

నిర్మాత కారు యాక్సిడెంట్.. హాస్పిటల్ ఖర్చుల దగ్గరే అసలు గొడవ!వైరల్ వీడియో

సుకుమార్ కూతురి ఖాతాలో మరో ఘనత!

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరిదో? తెరపైకి ముగ్గురు డైరెక్టర్లు!

Big Stories

Advertisement
×