E-Paper
Advertisement

10 ఏళ్లలో 55 బదిలీలు… చివరికి ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా వదలని కానిస్టేబుల్ కథ

10 ఏళ్లలో 55 బదిలీలు… చివరికి ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా వదలని కానిస్టేబుల్ కథ
Advertisement

Political action drama: 10 ఏళ్ల సర్వీస్‌లో 55 బదిలీలు ఎదుర్కొన్న ఓ నిజాయితీ పోలీస్ కానిస్టేబుల్ చేతికి ఒక అవినీతి ఫైల్ దొరికితే ఏం జరుగుతుంది ? ఆ ఫైల్‌లోనే వందల కోట్ల భూ కుంభకోణం, మైనింగ్ మాఫియాకు సంబంధించిన రహస్యాలు బయటపడితే ? అధికారుల ఒత్తిడికి తలొగ్గకుండా ఆ ఫైల్‌తోనే మొత్తం ప్రభుత్వాన్ని ఎదిరించే కానిస్టేబుల్ కథే ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu). వడ్డే నవీన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో వ్యవస్థలోని అవినీతి, అధికార దుర్వినియోగం, నిజాయితీగల పోలీస్ ఎదుర్కొనే సమస్యలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. మరి ఇలాంటి ఆసక్తికరమైన సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? ఎక్కడ చూడవచ్చు ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

త్రిమూర్తులు ఒక నిజాయితీగల పోలీస్ కానిస్టేబుల్. డిపార్ట్‌మెంట్‌లో ఏ చిన్న అవినీతి లేదా అన్యాయం కనిపించినా ప్రశ్నించడం అతని స్వభావం. పై అధికారులు చేసిన తప్పులను కూడా భయపడకుండా ఎత్తిచూపుతుంటాడు. అయితే అతని నిజాయితీనే అతనికి సమస్యగా మారుతుంది. ఎక్కడ పని చేసినా అక్కడి అక్రమాలను ప్రశ్నించడం, అధికారుల మాటకు గుడ్డిగా తలొగ్గకపోవడంతో త్రిమూర్తులు తరచూ బదిలీ అవుతుంటాడు. అలా కేవలం 10 ఏళ్ల సర్వీస్‌లోనే అతనికి ఏకంగా 55 ట్రాన్స్‌ఫర్లు వస్తాయి.

Advertisement

ఒక్కో ప్రాంతంలో మూడు నెలలు కూడా ప్రశాంతంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయినా అతని స్వభావంలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. ఇలాంటి సమయంలో త్రిమూర్తుల చేతికి ఒక అత్యంత కీలకమైన అవినీతి ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ సాధారణ కేసుకు సంబంధించినది కాదు. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి, వారి అనుచరులకు సంబంధించిన అవినీతి వ్యవహారాలకు సంబంధించిన కీలక ఆధారాలు ఉంటాయి.

వందల కోట్ల భూ కుంభకోణంతో పాటు మైనింగ్ మాఫియాకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఆ ఫైల్‌లో బయటపడతాయి. ఆ ఫైల్‌ను పట్టించుకోకుండా వదిలేస్తే తన ఉద్యోగం సేఫ్‌గా ఉంటుంది. కానీ త్రిమూర్తులు అలా చేయడు. నిజం బయటకు రావాలని నిర్ణయించుకుని, తన చేతిలో ఉన్న ఆధారాలతోనే దర్యాప్తు ప్రారంభిస్తాడు. ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలోకి ఒక సాధారణ కానిస్టేబుల్ అడుగు పెట్టడంతో అసలు సమస్య మొదలవుతుంది.

Advertisement

త్రిమూర్తులను ఆపడానికి అధికార యంత్రాంగం రంగంలోకి దిగుతుంది. అతనిపై ఒత్తిళ్లు పెరుగుతాయి. బెదిరింపులు, బదిలీలు మాత్రమే కాకుండా రౌడీలు, మాఫియా ద్వారా కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ త్రిమూర్తులు మాత్రం వెనక్కి తగ్గకుండా ఒక్కో ఆధారాన్ని బయటకు తీస్తూ ముందుకు సాగుతాడు. ఒక చిన్న పోలీస్ కానిస్టేబుల్ చేతిలో ఉన్న ఒక్క ఫైల్ కారణంగా రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మొత్తం ఎందుకు కదిలిపోయింది ? ఆ ఫైల్‌లో అసలు దాగి ఉన్న నిజం ఏంటి ? ముఖ్యమంత్రి కుటుంబం వెనుక ఉన్న అవినీతి సామ్రాజ్యాన్ని త్రిమూర్తులు ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు నిజాయితీ గెలిచిందా ? లేక అధికార బలం గెలిచిందా? అనేదే ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో ఆసక్తిని పెంచే అంశం.

తెలుగు సినిమానే

వడ్డే నవీన్, సాయికుమార్, రావు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శివప్రసాద్ నాయుడు దర్శకత్వం వహించారు. పోలీస్ వ్యవస్థ, రాజకీయ అవినీతి, మైనింగ్ మాఫియా, పవర్ గేమ్స్ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగుతుంది కథ. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ప్రస్తుతం తెలుగులోనే జీ5 (Zee5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: పంచ్ పడితే ఎముకలు విరగాల్సిందే… ఈ ఇద్దరి ముందు మాఫియా కూడా గాయబ్

Tags

Related News

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

Big Stories

Advertisement
×