Kayadu Lohar Remuneration:కయాదు లోహర్… దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా అయిపొయింది ఈ ముద్దుగుమ్మ పరిస్థితి.అవును మరి చేసిన మూడు సినిమాలు ముచ్చటగా బోల్తా పడ్డాయి మరి. దీంతో ఈ భామకి అందం ఉన్నా అదృష్టం లేదుగా అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు నెటిజన్లు.
ఈ భామ కెరీర్ విషయానికి వస్తే ఈమె తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్త కాదనే చెప్పాలి. శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో ఆమెకు తెలుగులో వెంటనే పెద్ద బ్రేక్ రాలేదు. ఆ తర్వాత ఇతర దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ తన గుర్తింపును పెంచుకుంది. ముఖ్యంగా మలయాళ, తమిళ చిత్రాల్లో కనిపించడం, సోషల్ మీడియాలో పెరిగిన పాపులారిటీ ఆమెకు మరిన్ని అవకాశాలు తీసుకొచ్చాయని చెప్పాలి.
తర్వాత విశ్వక్ సేన్‌తో కలిసి ‘ఫంకీ’ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ కయాదు స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. దీంతో సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండానే అవకాశాలు కంటిన్యూ గా పట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా కూడా అంచనాలని అందుకోలేక పోవడంతో కయాదు కి టాలీవుడ్ లో దురదృష్టం మాములుగా పట్టలేదుగా అంటూ సెటైర్స్ వేస్తున్నారు మూవీ లవర్స్.
అయితే కయాదు కెరీర్ చూస్తె మరో ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఏంటో తెలుసా తెలుగులో సినిమాలు వరుసగా బోల్తా కొట్టినా .. ఇతర భాషల్లో మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. ప్రస్తుతం మలయాళంలో ‘తారమ్’, తమిళంలో ‘మంజనాత్తి’ వంటి ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి. అలాగే సూర్య 48వ సినిమా, శివకార్తికేయన్ 27వ సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. దీంతో సౌత్ ఇండస్ట్రీలో కయాదు డిమాండ్ కొనసాగుతోందనే చెప్పాలి.
ఇక ‘ది ప్యారడైజ్’ కోసం రూ.1.5 కోట్ల రెమ్యూనరేషన్ అనే ప్రచారం నిజమైతే.. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కెరీర్‌లో చెప్పుకోదగ్గ పారితోషికం అని చెప్పాలి. ఇక అందరి దృష్టి ఇపుడు టాలీవుడ్ లో ఎ హీరో కయాదు కి హిట్ అందిస్తాడా అన్న దానిపైనే చూడాలి ఎవరు కయాదుని కష్టాల నుండి ఆదుకుంటారో !
అవుతుంది. అయితే హీరోల రెమ్యూనరేషన్లతో పోల్చితే హీరోయిన్ పారితోషికం చాలా తక్కువగా ఉండటం సాధారణమే. సినిమా బడ్జెట్, పాత్ర నిడివి, హీరోయిన్‌కు ఉన్న మార్కెట్, ఇతర భాషల్లో క్రేజ్ వంటి అంశాలను బట్టి రెమ్యూనరేషన్ మారుతూ ఉంటుంది.
కయాదు విషయంలో కూడా ఇదే ఫార్ములా పనిచేసి ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ‘ది ప్యారడైజ్’ లాంటి భారీ ప్రాజెక్టులో భాగం కావడం ఆమెకు రెమ్యూనరేషన్‌తో పాటు మార్కెట్ పరంగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో మంచి కథ, బలమైన పాత్ర దొరికితే.. ఇప్పటివరకు వచ్చిన సినిమాల కంటే మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.
also read :‘ఏష నాగుల కట్ట’ పాటతో ఫేమస్.. జంగి రెడ్డి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్!
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ కోసం కయాదు అందుకున్నారంటూ ప్రచారంలో ఉన్న రూ.1.5 కోట్ల రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇది అధికారికంగా ధృవీకరించని సమాచారం కావడంతో ప్రేక్షకులు దీన్ని అంచనాగానే చూడాలి. ఒకవైపు వరుస అవకాశాలు, మరోవైపు పెరుగుతున్న క్రేజ్.. ఇప్పుడు కయాదుకు కావాల్సింది మాత్రం తెలుగులో ఒక మంచి కమర్షియల్ హిట్. ఆ ఒక్క సినిమా ఆమె కెరీర్‌కు ఎలాంటి మలుపు తీసుకొస్తుందో చూడాలి.