Jr NTR Yamadonga:తారక్ ..తనదైన టాలెంట్ తో కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న ఈ టాలీవుడ్ టాప్ హీరో మరోసారి తన మార్క్ మాస్ ఎనర్జీతో అభిమానులను ఫిదా చేశాడు.అవును .. చాలా ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యమదొంగ’లోని తన ఐకానిక్ మేనరిజమ్‌ను గుర్తు చేస్తూ, తాజాగా జరిగిన ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఇచ్చిన ఎంట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్
విషయంలోకి వెళ్తే ఫహద్ ఫాజిల్ నటిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయిన సంగతి తెల్సిందే. అయితే ఈ ఈవెంట్ లో తారక్ స్టేజ్‌పైకి వచ్చిన విధానం అక్కడున్న అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ నింపిందనే చెప్పాలి.
తన పాత స్టైల్‌ను గుర్తు చేసేలా
యాంకర్ సుమ ఎన్టీఆర్‌ను వేదికపైకి మాములుగానే ఆహ్వానించింది. అయితే తారక్ ఎప్పటిలా స్టేజ్‌పైకి వెళ్లకుండా, తన పాత స్టైల్‌ను గుర్తు చేసేలా ఎన్టీఆర్ నడుచుకుంటూ రావడం అభిమానుల్లో ఎక్కడ లేని జోష్ నింపింది. ముఖ్యంగా ‘యమదొంగ’లో కనిపించిన బాడీ లాంగ్వేజ్, ముఖంలో కాన్ఫిడెన్స్ నడకలో కనిపించిన స్వాగ్‌ను ఎన్టీఆర్ మరోసారి రీక్రియేట్ చేయడంతో నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోయారు. స్టేజ్‌పై ఉన్న రాజమౌళి కూడా ఈ మూమెంట్‌ను ఎంజాయ్ చేయడం ఈవెంట్ ని మరింత సందడిగా మార్చేసింది.
‘యమదొంగ’ సినిమాకి వస్తే ఎన్టీఆర్ కెరీర్‌లో’ దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఎన్టీఆర్‌ను సరికొత్త అవతారంలో ప్రేక్షకులకు పరిచయం చేసింది. అప్పటి వరకు వచ్చిన ప్లాపులకి చెక్ పెట్టిన సినిమా ఇది . ముఖ్యంగా సినిమాలో యముడిగా ఎన్టీఆర్ చేసిన పాత్ర, ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, డ్యాన్స్, మాస్ మేనరిజమ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచిపోయాయి.
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్
అప్పటి వరకు ఎన్టీఆర్‌ను ఒక రేంజ్‌లో చూసిన అభిమానులకు ‘యమదొంగ’ మరో కొత్త ఇమేజ్‌ను చూపించిందనడంలో సందేహం లేదు. అదే కారణంగా ‘యమదొంగ’లోని కొన్ని సన్నివేశాలు సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలు గడిచినా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇప్పుడు ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఇచ్చిన ఎంట్రీ కూడా అలాంటి పాత జ్ఞాపకాలను అభిమానులకు గుర్తు చేసింది. యమదొంగలోని ఎన్టీఆర్‌ను మరోసారి లైవ్‌లో చూసిన ఫీలింగ్ వచ్చిందంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నడక, ముఖ కవళికలు, చేతి కదలికలు చూసి ‘యమదొంగ’ రోజులను గుర్తు చేసుకుంటున్నారు.
ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
ఇక ఈ కార్యక్రమానికి రాజమౌళి కూడా హాజరు కావడంతో ఈ రీ-క్రియేషన్‌కు మరింత ప్రత్యేకత వచ్చింది. ‘యమదొంగ’ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి ఎదుటే ఎన్టీఆర్ ఆ సినిమాలోని మేనరిజమ్‌ను గుర్తు చేసేలా ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు మాంచి ఐ ఫీస్ట్ లా మారిపోయింది. స్టేజ్‌పై ఎన్టీఆర్, రాజమౌళి కలిసి కనిపించడం కూడా ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చింది.
also read :సినిమా మీద సినిమా.. ఫలితం మాత్రం అదే! కయాదు కష్టాలు కంటిన్యూ
మరోవైపు ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్ గా వస్తున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. చూడాలి మరి ఆక్టోబర్ 2 న రానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !