E-Paper
Advertisement

Tollywood Stories: ప్రేక్షకుడు అప్‌డేట్.. టాలీవుడ్ కథలు మాత్రం అవుట్‌డేట్!

Tollywood Stories: ప్రేక్షకుడు అప్‌డేట్.. టాలీవుడ్ కథలు మాత్రం అవుట్‌డేట్!

Tollywood Stories:మనం ముందుకు వెళ్తున్నామా…లేక అదే చోట ఆగిపోయి పరుగు తీస్తున్నామా?
గ్రాఫిక్స్ పెరిగాయి, బడ్జెట్లు ఆకాశాన్ని తాకాయి..గ్లోబల్ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి.
కానీ, ‘కథ’ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మన అడుగులు ఎందుకు తడబడుతున్నాయి?
మనం బాహుబలి, RRR లాంటి విజువల్ వండర్స్‌ని చూసి మురిసిపోతున్నాం. అది గర్వించదగ్గ విషయమే.
కానీ అదే గ్రాండియర్ వెనుక.. సాదాసీదా కథలు మసాలా పూసుకుని మళ్లీ మళ్లీ వస్తున్నాయి.
ఈరోజు ఆడియన్ ని తక్కువ అంచనా వేయడానికి అస్సల్ లేదు .
‘స్క్విడ్ గేమ్’ లోని మనుషుల నైజాన్ని చూస్తున్నాడు.మనీ హైస్ట్ లోని మైండ్ గేమ్స్ ఆస్వాదిస్తున్నాడు.
పక్కనే ఉన్న మలయాళంలో మంజుమ్మల్ లాంటి రియలిస్టిక్ సినిమాల్లో తనని తాను వెతుక్కుంటున్నాడు.
ప్రేక్షకుడి టేస్ట్ మారింది..కానీ మన సినిమా ఫార్ములా మాత్రం మారలేదు.
థియేటర్‌లోకి వెళ్తే.. ఇంకా అదే విలన్ గ్యాంగ్,అదే హీరోయిన్ టీజింగ్ సాంగ్స్, కథను చంపేసే రొట్ట కామెడీ.
ఇది ‘క్రియేటివిటీ ‘లేకపోవడం కాదు.. ఇది ‘క్రియేటివ్ లేజీనెస్’.

ది కాపీ-పేస్ట్ సిండ్రోమ్

గతంలో వచ్చిన సక్సెస్ షాడోలో సేఫ్ గేమ్ ఆడటం బిజినెస్ కి మంచిదేమో కాని , ఆర్ట్ కి కాదు.
ఒక యానిమల్ సినిమా హిట్ అయితే.. అందరూ వయొలెన్స్ వెనుక పరిగెత్తడం,
ఒక కాంతారా ఆడితే అందరూ మట్టి కథల వెంట పడటం..
ఇది ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం కాదు, ఇదో కాపీ పేస్ట్ కల్చర్.
కేరాఫ్ కంచరపాలెం, బలగం లాంటి సినిమాలు …
అక్కడ కోట్లు లేవు, కేవలం కోట్లాది మందికి కనెక్ట్ అయ్యే ‘సోల్ ‘ ఉంది.
నిజమైన సినిమా అంటే ..పాత్రల్లో నిజాయితీ ఉండాలి.సంఘర్షణలో జీవితం కనిపించాలి.

సినిమా అంటే బొమ్మ కాదు.. ఒక అనుభవం!

రిపిటేషన్ విసుగు తెప్పిస్తుంది. విసుగు అబ్జెక్షన్ కి దారి తీస్తుంది.
గుర్తుంచుకోండి.. ఆడియన్ ని మోసం చేయలేం.
అతనికి భారీతనం కంటే.. నువ్వు చెప్పే కథలో ‘సత్యం’ కావాలి.
ఎందుకంటే సినిమా అంటే కేవలం తెరపై బొమ్మ పడటం కాదు.. సినిమా అంటే ఒక అనుభవం!
మలయాళం ‘ఆవేశం’ …అందులో గ్యాంగ్‌స్టర్ ఉన్నాడు, వయొలెన్స్ ఉంది.
కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం ఎంత కొత్తగా, ఫన్నీగా, ఫ్రెష్‌గా ఉంది!
మనం మాత్రం ఇంకా ‘నలుగురిని నరికితేనే మాస్’ అనే పాత కాలపు ఆలోచనల్లోనే ఉన్నాం.
హిట్ అయిన సినిమా ఫార్ములాను మళ్ళీ మళ్ళీ వాడే పనిలో ఉన్నాం .
ఒక కమర్షియల్ సినిమా అంటే – హీరో ఇంట్రడక్షన్ ఫైట్, రెండు కామెడీ సీన్లు, ఒక ఐటెం సాంగ్, సెకండ్ హాఫ్‌లో ఒక సెంటిమెంట్ సీన్.
ఈ టెంప్లేట్ ఇప్పుడు తుప్పు పట్టిపోయింది.
‘మత్తు వదలరా’ లేదా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’…వీటిలో హీరోలు రౌడీలను గాలిలో ఎగరేయరు.
వాళ్లు మనలాంటి మనుషులే. వాళ్ల సమస్యలు మన సమస్యలే.
ఆ ‘రిలేటబిలిటీ’నే ఇప్పుడు ప్రేక్షకుడికి కావాలి.

ఆడియన్ ఇప్పుడు ‘క్రిటిక్’ మాత్రమే కాదు.. ‘అనలిస్ట్’

ప్రేక్షకుడు ‘ప్రేక్షకుడు’ మాత్రమే కాదు.. ఒక ‘క్రిటిక్’
గతంలో ప్రేక్షకులు సినిమాను చూసి ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు బంచులు బంచులుగా బ్రేక్ డౌన్ చేసేస్తున్నారు.
‘దృశ్యం’ సినిమా… ప్రేక్షకులు ఎందుకు అంతగా ఇష్టపడ్డారు?
అందులో కండలు తిరిగిన విలన్ లేడు, ఊహించని ఫైట్లు లేవు. కేవలం ‘మెదడు’ తో ఆడే గేమ్ ఉంది.
ప్రేక్షకుడికి ఇప్పుడు ‘ట్విస్ట్’ కావాలి, ‘లాజిక్’ కావాలి.
“హీరో కాబట్టి కొట్టేస్తాడు” అనే లాజిక్ లేని సీన్లను ఈ తరం ప్రేక్షకుడు సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నాడు .

సోల్ vs స్కేల్

ఒకప్పుడు సినిమా అంటే ఒక ‘అద్భుతం.
ఇప్పుడు సినిమా అంటే ఒక ‘ప్యాకేజీ’.
హీరో డేట్స్ + ఫారిన్ లొకేషన్స్ + ఒక మాస్ సాంగ్
కట్ చేస్తే వంద కోట్ల కలెక్షన్లు.
ఈ పాత చింతకాయ పచ్చడే ఆడియన్స్ వద్దనేది.
చూశారుగా ‘సప్త సాగరదాచె ఎల్లో’ సినిమాలో ప్రేమను ఎంత గాఢంగా చూపించారో.
‘మహారాజా’ లో ఆ స్క్రీన్‌ప్లే మాయాజాలం ఎలా ఉందో.
మన దగ్గర టాలెంట్ లేదని కాదు.. ఆ రొటీన్ ఫార్ములాని బ్రేక్ చేసే డేర్ కావాలి .
మనం గ్లోబల్ సినిమాతో..గ్రాండియర్ ..విజువల్స్ లో మాత్రమే కాదు, ఎమోషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో కూడా పోటీ పడాలి.
రొటీన్ అనే రొంపిలో నుంచి బయటకు వచ్చి.. కొత్తగా ఆలోచించాలి
ఎందుకంటే.. ఆడియన్స్ ఎప్పుడో అప్‌డేట్ అయ్యారు. అవ్వాల్సింది ఇక మేకర్సే !

also read : Allu vs Mega Family: అల్లు ఆర్మీకి పోటీగా మెగా యూత్ ఫోర్స్? ఫ్యామిలీ ఫైట్.. ఫ్యాన్ వార్‌గా మారనుందా?

Tags

Related News

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

Big Stories

×