E-Paper
Advertisement

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫెడరేషన్ కీలక నిర్ణయం!

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫెడరేషన్ కీలక నిర్ణయం!
Advertisement

Johnny Master:గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని డాన్స్ యూనియన్ లో జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది.అవును…తాజాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి జానీ మాస్టర్‌కు ఇక ముందు నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవు అంటూ లేఖ ద్వారా స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 26, 27 తేదీల్లో A.I.F.E.C. సమావేశాలు జరిగాయనిఆ సమావేశాల్లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్నట్టు లేఖలో పేర్కొంది. ఫెడరేషన్ నిర్ణయాలను పట్టించుకోకుండా వ్యవహరించడం, సభ్యుల నిర్ణయాలను పక్కన పెట్టడం, సంస్థ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలను ప్రస్తావించారు. అలాగే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫెడరేషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు జానీ మాస్టర్ పై ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

వివాదం కొత్తేమీ కాదు

జానీ మాస్టర్ విషయంలో ఫెడరేషన్లతో వివాదం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయనపై నాన్ కోఆపరేషన్ నిర్ణయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ముంబైకి చెందిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) కూడా గతంలో జానీ మాస్టర్‌తో నాన్ కోఆపరేషన్ ప్రకటించింది. బాలీవుడ్‌లో పనిచేసే సమయంలో అక్కడి డ్యాన్సర్లకు సంబంధించిన నిబంధనలను పాటించలేదనే ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Advertisement

ఇండస్ట్రీలో హాట్ టాపిక్

గత కొంతకాలంగా జానీ మాస్టర్ ,సుమలతల వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెల్సిందే. డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన అంశాల్లో ఫెడరేషన్ నిర్ణయాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు చిరంజీవి, బాలకృష్ణ వంటి పెద్దలు కూడా చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కొంతకాలం పరిస్థితి సద్దుమణిగినట్టే కనిపించింది. కానీ తర్వాత మళ్లీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సంబంధించి ఫెడరేషన్, యూనియన్ మధ్య విభేదాలు బయటకు వచ్చాయి.

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ

ఇప్పుడు తాజాగా అల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ప్రకటనతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దేశంలోని వివిధ ఫెడరేషన్లు జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ప్రకటించడం వల్ల ఆయనతో కలిసి పనిచేసే ప్రాజెక్టులపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది.మొత్తానికి జానీ మాస్టర్ చుట్టూ నడుస్తున్న ఫెడరేషన్ వివాదం మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. ముంబై నుంచి మొదలైన నాన్ కోఆపరేషన్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఫెడరేషన్ల వరకు వెళ్లడం సినీ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.

ఆయన చేసిన కొరియోగ్రఫీ మంచి గుర్తింపు

జానీ మాస్టర్ అంటే టాలీవుడ్‌లో చాలామందికి వెంటనే గుర్తొచ్చేది ఆయన కొరియోగ్రఫీ. అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోల సినిమాల్లోని పలు పాటల విషయంలో కూడా జానీ మాస్టర్ పేరు వినిపించింది. ‘ఉప్పెన’, ‘రెడ్’, ‘ధమాకా’, ‘తిరు’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో ఆయన చేసిన కొరియోగ్రఫీ మంచి గుర్తింపు సంపాదించుకుంది .

జానీ మాస్టర్‌ ఎలా రియాక్ట్ అవుతాడో

ఇప్పుడు ఫెడరేషన్ తీసుకున్న తాజా నిర్ణయంతో అసలు తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఇపుడు అందరిలో కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా షూటింగ్స్‌లో కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు, ఇతర టెక్నీషియన్లు కలిసి పనిచేస్తారన్న సంగతి తెల్సిందే. ఒక పాట షూటింగ్ అంటే చాలా మంది కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మరి ఫెడరేషన్ స్థాయిలో తీసుకున్న నిర్ణయంపై జానీ మాస్టర్‌ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Tags

Related News

రణబాలి సెకండ్ డాక్యుమెంటరీ ‘ది హిస్టరీ వుయ్ ఫర్ గాట్’ రిలీజ్!

ఆట సందీప్ ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?

ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

బిగ్ బాస్ కృష్ణుడు కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో?

ఎఫ్డిఏ నోటీసులపై షారుక్ , అజయ్ , టైగర్ ష్రాఫ్ రియాక్షన్?

‘ రాకా’ విషయంలో కీలక మార్పులు.. రెండు భాగాలుగా రాబోతోందా?

కేసీఆర్ పాత్ర అద్భుతంగా చేశావు.. ప్రియదర్శిని సత్కరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×