E-Paper
Advertisement

నేను, బండి సంజయ్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్లమే: సీఎం రేవంత్!

నేను, బండి సంజయ్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్లమే: సీఎం రేవంత్!
Advertisement

Revanth Reddy: కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం ప్రజలకి మరింత ఉపయోగ పడుతుందని భావిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేద ప్రజలకు మా తరుపున అందుబాటులో ఉన్న అధికారులకి ధన్యవాదాలని సీఎం రేవంత్ తెలిపారు. పేద ప్రజలు ఎవరు కలెక్టరేట్‌కి వచ్చిన వారిలో మన కుటుంబ సభ్యులని చూసి సహాయం చేయండని అన్నారు. ప్రజా పాలన ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకి జీత భత్యాలు సమయానికి ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇచ్చి పుచ్చుకునే ధోరణి..

ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలని కొన్ని పరిష్కరించాంమని, ఇంకా చేయాల్సి ఉందని సీఎం తెలిపారు. రాష్ట్రానికేనా, కేంద్రానికేనా మంచి పేరొచ్చినా, చెడు పేరొచ్చినా అది ప్రభుత్వ సిబ్బంది వల్లే ఉంటుందని సీఎం క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణి లోనే ఉంటాయని, గౌరవెల్లి ప్రాజెక్ట్ కోసం నిన్ననే కేంద్ర జల శక్తి మంత్రిని కలిసి అనుమతులు అడిగామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Advertisement

Also read: పవర్ కట్ అయినప్పుడు ఫ్రిజ్‌లో.. ఏ పదార్థాలు ఎన్ని గంటలు తాజాగా ఉంటాయో తెలుసా?

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక..

కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చేవారికి శామీర్ పేట దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు తెలియనివి కాదని సీఎం రేవంత్ అన్నారు. కంటోన్మెంట్ ఏరియా వల్ల ఇన్నేళ్ళు ఇబ్బందులు ఉండేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలానే బేగం పేట ఎయిర్ పోర్ట్ రన్ వే కింద నుండి సబ్ వే వేసేందుకు అనుమతులు ఇచ్చింది కేంద్రం తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నామని, నేనైనా బండి సంజయ్ అయినా కింది స్థాయి నుండి రాష్ట్ర దేశ స్థాయి నాయకులుగా ఎదిగామని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల సమయంలో మినహా కలిసిమెలిసి పని చేస్తున్నామని మనీ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also read: వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫర్ విలేజ్ కోసం పనిచేయండి: మంత్రి సీతక్క!

Tags

Related News

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్!

తెలంగాణలో అమిత్ షా పర్యటనకు డేట్ ఫిక్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫర్ విలేజ్ కోసం పనిచేయండి: మంత్రి సీతక్క!

రేవంత్‌రెడ్డి లాంటి సీఎం ఉండడం మన ఖర్మ: తలసాని శ్రీనివాస్ యాదవ్

రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్ సీఎం మాత్రమే!- పాడి కౌశిక్ రెడ్డి

తెలంగాణ పాఠశాల విద్యలో సంచలన మార్పులు.. ఇకపై వారి చేతుల్లోనే మార్కులు!

ఒకటి రెడ్డి.. మరొకటి బీసీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యూహం ఫలించేనా?

Big Stories

Advertisement
×