E-Paper
Advertisement

ఎస్పీబీని ఇళయరాజా అంతలా ఎందుకు హర్ట్ చేశారు? నిజాలు బయటపెట్టిన ఎస్పీ చరణ్!

ఎస్పీబీని ఇళయరాజా అంతలా ఎందుకు హర్ట్ చేశారు? నిజాలు బయటపెట్టిన ఎస్పీ చరణ్!
Advertisement

Copyright Dispute: ఎస్పీ బాలసుబ్రమణ్యం ,ఇళయరాజా ఈ పేర్లు వినబడితే చాలు సినీ సంగీత ప్రియుల మనసులు పులకించిపోతాయి.కొన్ని దశాబ్దాల పాటు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన గీతాలు ఎంతోమందిని అలా  అలరించాయి మరి .అలా కేవలం ప్రొఫెషనల్ గానే కాకుండా పర్సనల్ గానే వీరి మధ్య మంచి స్నేహం ఉండేది.అయితే అలాంటి ఇద్దరు దిగ్గజాల మధ్య కొన్నికొన్నేళ్ళ క్రితం చోటు చేసుకున్న కాపీరైట్ ఇష్యూ మొత్తం సినీ ప్రపంచానికే పెద్ద షాక్ ఇచ్చింది.అయితే అసలు వీరి మధ్య ఏం జరిగింది ?ఆ వివాదం వెనుకున్న అసలు నిజాలు ఏంటి ?

అనే విషయాలపై బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ ఒక ఇంటర్వ్యూలో ఇలా బయట పెట్టాడు .అప్పట్లో బాలు అమెరికాలో ఎస్పీబీ 50 అనే పేరుతో ఒక గ్రాండ్ వరల్డ్ నిర్వహిస్తున్నారు. బాలు కెరీర్ లో మైలరాయి లాంటి ఎస్పీబీ 50′  ఏళ్ల  సందర్భంగా జరిగిన ఒక సంగీత కచేరి టూర్ అది.శంకరాభరణం సాగరసంగమం స్వాతిముత్యం రుద్రవీణ వంటి ఎన్నో సూపర్ హిట్ ఆల్ టైం సాంగ్స్ ని అభిమానుల కోసం పాడాడు బాలు.అయితే సరిగ్గా ఆ పర్యటన మధ్యలోనే ఇళయరాజా తరఫున న్యాయవాదుల నుంచి బాలుకి లీగల్ నోటీసులు అందాయి .

Advertisement

తన అనుమతి లేకుండా తనకు ఎలాంటి రాయాల్టీ చెల్లించకుండా కచేరీలలో ఆ పాటలు పాడకూడదని ఒకవేళ పాడితే లీగల్ గా  చర్యలు ఉంటాయని ఆ నోటీసుల్లో ఉన్న సారాంశం.అయితే ఊహించని ఈ సడెన్ షాక్ తోబాధ పడిపోయాడట బాలు.ఇళయరాజా తనకు లీగల్ నోటీసులు పంపించడం వెనుక ఎన్నో పుకార్లు షికారు చేసినప్పటికీ అసలు కారణం వేరే ఉందని క్లారిటీ ఇచ్చాడు చరణ్.ఇళయరాజా కు తన మ్యూజిక్ మీద వచ్చే ఆదాయంపై రైట్స్ కోసం పరిహారం కావాలని ఆలోచన రావడం వల్లే అలా చేశారని చెప్పుకొచ్చాడు .

అయితే ఎస్పీబీ ఎప్పుడు ఆయనకు డబ్బులు ఇవ్వనని చెప్పలేదని కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ చేసి  బాలు నా మ్యూజిక్ వాడుకుంటున్నావు కదా నాకు ఇంత డబ్బు పంపించు  అని  ఫ్రెండ్లీగా అడిగితే బాగుండేదని బాధపడ్డాడట బాలు.అయితే ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని కాదని, ఇలా ఎలాంటి సమాచారం లేకుండా లీగల్ నోటీసులు పంపడం బాలుని బాగా హార్ట్ చేసి చెప్పుకొచ్చాడు.నిజానికి ఆ సమయంలో ఎస్పీబీ టీం ‘ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్ సొసైటీ’ (IPRS) కి నిబంధనల ప్రకారం రాయల్టీ మొత్తాన్ని చెల్లిస్తూనే ఉంది .

Advertisement

హోటల్స్, ఈవెంట్స్, కచేరిలలో పాటలు పాడినప్పుడు అసలైన హక్కుదారులకు రాయల్టీ ఇచ్చే బాధ్యత ఆ సంస్థదే .అలా లీగల్ గా ఉన్నప్పటికీ ఇళయరాజా నేరుగా బాలుకి లీగల్ నోటీస్ లు  పంపించడం సెన్సేషన్ అయింది.అయితే ఈ ఇష్యూ వల్ల తమకు ఒక రకంగా మంచి జరిగిందని చెప్పుకొచ్చాడు చరణ్.

ఆ తర్వాత జరిగిన అనేక కచేరీలలో ఇళయరాజా పాటలు పక్కనపెట్టి ఎమ్మెస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్, చక్రవర్తి, రాజ్ కోటి, ఏఆర్ రెహమాన్ వంటి ఇతర గొప్ప గొప్ప సంగీత దర్శకుల పాటలని బాలు పాడాడని  తెలిపాడు .కేవలం బాలుకే కాకుండా మరికొన్ని కంపెనీ ఆడియో కంపెనీలకి, సింగర్స్ కి కూడా ఇలాంటి నోటీసులు పంపడం గమనార్హం.ఇదిలా ఉండగా ఈ కాపీరైట్ ఇష్యూలో తాజాగా ప్రముఖ ఆడియో సంస్థ సరేగామా  ఇండియా లిమిటెడ్ కి ,ఇళయరాజా కు మధ్య ఢిల్లీ హైకోర్టులో న్యాయపోరాటం నచ్చిన సంగతి తెలిసిందే.

Also read :40 ఏళ్ల బంధం, లెక్కలేనన్ని అఫైర్స్.. ఆభయంతోనే సైలెంట్‌గా ఉన్నానన్న గోవిందా భార్య!

1976 నుంచి 2001 మధ్యలో రిలీజ్ అయిన దాదాపు 134 సినిమాలోని పాటల రైట్స్ ని ఆ సినిమాల  నిర్మాత ద్వారా అగ్రిమెంట్ చేసుకున్నామని వాదించింది సరేగమా .ఇక ఈ కేసును పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఈ కేసును పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, తుది తీర్పు వచ్చే వరకు ఆ 134 సినిమాలకు సంబంధించిన పాటలను కమర్షియల్ గా ఉపయోగించకుండా ఇళయరాజా పై మద్యంతర ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.చూడాలి ముందు ముందు ఈ కాపీ రైట్ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తీసుకోనుందో !

Related News

బావ బామ్మర్ది కథతో వెంకీ–కళ్యాణ్ రామ్.. టైటిల్ అదిరిపోయిందిగా!

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..

ఫైట్ చేసిన భట్టు.. చంద్రకళ సేఫ్, మొత్తానికి ఇద్దరినీ కలిపేశారుగా!

మహాకాళి నుండి బిగ్ అప్డేట్.. మాస్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

ఈడీ అధికారుల ఎదుట నిధి అగర్వాల్.. ఆ ప్రశ్నలు అడగనున్నారా?

Big Stories

Advertisement
×