Metro Rail Night Operations: నగర ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించడంలో మెట్రో రైళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు దేశంలోని పలు నగరాల్లో ఉన్న మెట్రో రైళ్లపై ఆధారపడుతారు. అయితే, సాధారణ రైళ్ల మాదిరిగా మెట్రో సేవలు రాత్రిపూట అందుబాటులో ఉండవు. దానికి కారణం చాలా మంది ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ, అందులో పూర్తిగా నిజం లేదు. అసలు విషయం ఏంటంటే..
కోల్ కతాలో తొలి మెట్రో రైలు ప్రారంభం
భారత్ లో తొలి మెట్రో రైలు సేవలు 1984లో కోల్ కతాలో ప్రాంభమయ్యాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి ఇతర నగరాల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ ను కలిగి ఉంది. ప్రస్తుతం దేశంలోని అనేక నగరాల్లో మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. రోజూ లక్షలాది మంది ప్రయాణీకులకు వేగవంతమైన, పర్యావరణ అనుకూల రవాణా సేవలను అందిస్తున్నాయి. మార్చి 2024 నాటికి, దేశంలోని 17 నగరాల్లో మొత్తం 902.4 కిలోమీటర్ల మేర మెట్రో నెట్ వర్క్ విస్తరించింది.
దేశంలోనే అతిపెద్దది ఢిల్లీ మెట్రో!
ఢిల్లీ మెట్రో దేశంలోనే అతిపెద్దది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ 1998లో మెట్రో పనులను ప్రారంభించింది. తొలి దశ 2002లో ప్రారంభించబడింది. ఢిల్లీ మెట్రో సమీపంలోని ఫరీదాబాద్, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్ నగరాలకు కూడా విస్తరించింది. మొత్తం 391 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్‌తో సేవలు అందిస్తుంది. 286 స్టేషన్లను కలిగి ఉంది.
Read Also: ఇండియాలో ఈ రైళ్లు ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాలి.. ఒక్క టికెట్ ధర ఎంతో తెలుసా?
రాత్రి పూట మెట్రో రైళ్లు నడవవా?
సాధారణంగా, మన దేశంలో మెట్రో సేవలు ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయి. సాధారణంగా, అర్థరాత్రి తర్వాత నుంచి ఉదయం వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో సాధారణంగా మెట్రో రైళ్లు నడపకపోవడానికి ప్రధాన కారణం మెయింటెనెన్స్ వర్క్స్. పగటిపూట సురక్షితమైన కార్యకలాపాలు కొనసాగేదంఉకు ట్రాక్ తనిఖీ, ఓవర్ హెడ్ పరికరాల తనిఖీలు, సిగ్నలింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్ లాంటి కీలకమైన పనులు నిర్వహిస్తారు. కొత్త రేక్‌ల ట్రయల్ రన్స్, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, కొత్త టెక్నాలజీని పరీక్షించడం కోసం రాత్రి సమయాన్ని మెట్రో అధికారులు ఉపయోగిస్తారు. వాస్తవానికి మెట్రో సేవలు రాత్రిపూట ఆగిపోతాయి. కానీ, వాస్తవానికి మరుసటి రోజు అందరికీ సజావుగా, సురక్షితమైన ప్రయాణాన్ని అదించడానికి రాత్రి పూట కూడా మెట్రో అధికారులు, సిబ్బంది పని చేస్తూనే ఉంటారు. అంటే, రాత్రివేళ రైల్వే సేవలు ప్రయాణీకులకు అందుబాటులో లేకపోయినా, సిబ్బంది కొనసాగిస్తూ ఉంటారు.
Read Also: ఏపీ నుంచి నేరుగా అరుణాచలానికి వందే భారత్.. ఇది కదా గుడ్ న్యూస్ అంటే!