E-Paper
Advertisement

తప్పుగా తీసుకోవద్దు.. జర్నలిస్టు నాగేంద్ర వివాదంపై సంపూర్ణేష్ బాబు వివరణ!

తప్పుగా తీసుకోవద్దు.. జర్నలిస్టు నాగేంద్ర వివాదంపై సంపూర్ణేష్ బాబు వివరణ!
Advertisement

Sampoornesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో హృదయ కాలేయం ,కొబ్బరిమట్ట వంటి తదితర సినిమాలలో నటుడిగా నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన వారిలో సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu)ఒకరు. ఇటీవల కాలంలో సంపూర్ణేష్ బాబు పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఈయన నాని(Nani) హీరోగా నటించిన ది ప్యారడైజ్ (The Paradise) సినిమాలో బిర్యాని అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఈ సినిమాతో తిరిగి వెండి తెరపై సందడి చేసిన సంపూర్ణేష్ బాబు సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.

జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ పై విమర్శలు..

ఈ నేపథ్యంలోనే జర్నలిస్టు నాగేంద్ర కుమార్ తో కలిసి ఈయన ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగేంద్ర కుమార్ (Nagendra Kumar ) సంపూర్ణేష్ బాబుని ఉద్దేశించి మీకు ఏదైనా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉందా ?మీ ఇంట్లో ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా అంటూ అడిగారు అందుకు సంపూర్ణేష్ బాబు లేదని చెప్పడంతో మరి నువ్వెందుకు ఇండస్ట్రీలోకి వచ్చావు నీకేంటి అంత దురద? అంటూ మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే నాగేంద్ర కుమార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

సంపూర్ణేష్ బాబుకు నాగేంద్ర క్షమాపణలు..

Advertisement

ఇలా ఆయన వ్యవహరించిన తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో జర్నలిస్టు నాగేంద్ర కుమార్ సైతం సంపూర్ణేష్ బాబు గురించి మాట్లాడిన మాట తీరులపై క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని, తనకు తెలియకుండానే ఆ మాటలు దొర్లిపోయాయి అంటూ నాగేంద్ర కుమార్ సంపూర్ణేష్ బాబుకి క్షమాపణలు చెప్పారు. అయితే తాజాగా సంపూర్ణేష్ బాబు సైతం నాగేంద్ర కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

Advertisement

ఇందులో భాగంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. నేను సోషల్ మీడియాలో నాగేంద్ర అన్న వీడియో వైరల్ అవడం చూశాను అయితే నాకు నాగేంద్ర అన్న చాలా బాగా క్లోజ్ అని తెలిపారు. ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు అనుకోకుండా కొన్ని మాటలు తప్పుగా దొర్లాయి. ఆ మాటలు తప్పు అని కూడా నేను అనుకోవడం లేదు ఎందుకంటే మా ఇద్దరి మధ్య అంత మంచి సన్నిహితం ఉంది. చాలామంది రిపోర్టర్లకు నేనంటే చాలా ఇష్టం నన్ను అందరూ వాళ్ళ ఓన్ బ్రదర్ లాగే చూసుకుంటారు. హృదయ కాలేయం సినిమా నుంచి కూడా జర్నలిస్టులందరూ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారని వారిలో నాగేంద్ర అన్న కూడా ఉన్నారని తెలిపారు. ఇక నన్ను ఇష్టపడే వారందరూ కూడా నాగేంద్ర అన్న మాట్లాడిన మాటలను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ ఈయన ఈ వివాదంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Also Read: అంతా మీ ఇష్టమే.. ‘ది ప్యారెడైజ్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై స్పందించిన నాని

Related News

డబ్బింగ్ షూర్ చేసిన ‘ కాకా ‘ .. సంక్రాంతి విడుదలకు సిద్ధం!

అంతా మీ ఇష్టమే.. ‘ది ప్యారెడైజ్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై స్పందించిన నాని

మాల్దీవ్స్ లో నయనతార.. 2 రోజుల బస కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

‘ది ప్యారడైజ్’ చిత్రంలో నాని తల్లిగా నటించింది ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

రిషబ్ శెట్టి కొత్త మూవీలో నటించాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!

శ్రీకాళహస్తీశ్వరాలయంలో డింపుల్ హయతి ప్రత్యేక పూజలు.. ఎందుకో తెలుసా?

చిరంజీవికి దిమ్మతిరిగే షాక్.. అసలు నిజం ఇదేనా..?

Big Stories

Advertisement
×