E-Paper
Advertisement

అంతా మీ ఇష్టమే.. ‘ది ప్యారెడైజ్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై స్పందించిన నాని

అంతా మీ ఇష్టమే.. ‘ది ప్యారెడైజ్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై స్పందించిన నాని
Advertisement

Actor Nani: నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ది ప్యారడైజ్ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పిస్తుంది. నాని(Nani) కెరియర్ లోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ఈ చిత్రం నిలిచిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్యారడైజ్ మేనియా కనిపిస్తుంది. ఇలా ఈ సినిమాకు చాలామంది పాజిటివ్ గా రియాక్ట్ అవ్వగా మరి కొంతమంది యధావిధిగా విమర్శలు కురిపిస్తూ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి స్పందన పట్ల నటుడు నాని తాజాగా స్పందిస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మీ కోసం రక్తం, చెమటలు చిందించాను..

ఈ నేపథ్యంలోనే నాని స్పందిస్తూ..”మీ అందరి రియాక్షన్స్, స్పందనలను చూశాను. మీరు చూపించిన ప్రేమను పూర్తిగా నేను తీసుకుంటున్నాను. అదే సమయంలో మీరు వేసిన ఫన్నీ ట్రోల్స్‌ను కూడా ఎంతో ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు ఈ సినిమాను తమ సినిమాలా ఓన్ చేసుకున్న విధానం చూసి నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయింది. అలాగే విమర్శకులు, రివ్యూవర్లు చెప్పిన లోపాల నుంచి కూడా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. వీటన్నింటికి థాంక్స్ చెప్పడం తప్ప ఇంకేమీ చెప్పలేను.. మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించాలని తాను ఎంతో కష్టపడి రక్తం, చెమటలు చిందించి ది ప్యారడైజ్ సినిమాని నిర్మించాము. ఇప్పుడు ఈ సినిమా మీదే.. సెలబ్రేట్ చేసినా… జడ్జ్ చేసినా అంతా మీ ఇష్టం.. సినిమా పట్ల మీరు చూపించిన ఆసక్తి, ప్రేమకు కృతజ్ఞుడిని” అంటూ ఈయన పోస్ట్ చేశారు.

ది ప్యారడైజ్ ట్రోల్స్ పై నాని రియాక్షన్…

Advertisement

ఇలా ఈ సినిమాకి వస్తున్న ఆదరణ పట్ల నాని స్పందిస్తూ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాకి నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తూ సినిమాపై విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ట్రోల్స్ కూడా తాను ఎంజాయ్ చేస్తున్నానంటూ ఈయన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా మొదటి రోజు సుమారు 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. నాని కెరియర్ లో ఇది భారీ ఓపెనింగ్ అని చెప్పాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కోసం సుమారు 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

Advertisement

Also Read: మరోసారి కోయంబత్తూర్ ఆసుపత్రికి రామ్ చరణ్… గాయం ఇంకా తగ్గలేదా?

Related News

మాల్దీవ్స్ లో నయనతార.. 2 రోజుల బస కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

‘ది ప్యారడైజ్’ చిత్రంలో నాని తల్లిగా నటించింది ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

రిషబ్ శెట్టి కొత్త మూవీలో నటించాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!

శ్రీకాళహస్తీశ్వరాలయంలో డింపుల్ హయతి ప్రత్యేక పూజలు.. ఎందుకో తెలుసా?

చిరంజీవికి దిమ్మతిరిగే షాక్.. అసలు నిజం ఇదేనా..?

నాని కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్.. ‘ది ప్యారడైజ్’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

అంజలికి ఏమైంది? ఒక్కసారిగా ఇలా మారిపోయిందే!

Big Stories

Advertisement
×