Festive sales: పండగ సీజన్ వచ్చిందంటే.. చాలు ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు భారీ సేల్స్‌ను ప్రకటిస్తాయి. రకరకాల ఆఫర్లు, కళ్లు చెదిరే డిస్కౌంట్లు చూసి మనం కూడా ఇష్టమైన వస్తువులను కార్ట్‌లో వేసేస్తుంటాం. అయితే.. ఈ తొందరపాటులో కొన్ని పొరపాట్లు చేస్తే, మన అకౌంట్‌లోని డబ్బులు గల్లంతవడమే కాకుండా నకిలీ వస్తువులు చేతికి అందే ప్రమాదం ఉంది. కాబట్టి పండగ షాపింగ్ చేసే ముందు ఈ 4 ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి. అవేంటంటే..
పండగ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి సైబర్ కేటుగాళ్లు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీల పేర్లతో.. నకిలీ వెబ్‌సైట్లు, హానికరమైన లింక్‌లను వాట్సాప్, సోషల్ మీడియా.. ద్వారా షేర్ చేస్తుంటారు. అంతే కాకుండా 70% నుంచి 80% డిస్కౌంట్ అని వచ్చే మెసేజ్‌లను చూసి పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఎప్పుడైనా సరే అధికారిక యాప్స్ లేదా ట్రస్టెడ్ వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించండి.
సేల్స్ ప్రారంభానికి ముందు.. కొన్ని సంస్థలు ధరలను పెంచి, ఆపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు బోర్డులు పెడుతుంటాయి. కాబట్టి మీరు కొనాలనుకుంటున్న.. వస్తువు అసలు ధర ఎంత, వేరే ప్లాట్ ఫారమ్‌లలో ధర ఎంత ఉందో ‘ప్రైస్ కంపారిజన్’ టూల్స్ లేదా యాప్స్ ద్వారా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
ఎలక్ట్రానిక్స్ లేదా బట్టలు కొనేటప్పుడు.. కేవలం డిస్కౌంట్ చూసి మోసపోకండి. ఆ వస్తువుకు రిటర్న్ లేదా రీప్లేస్‌మెంట్ పాలసీ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. కొన్ని లోకల్ బ్రాండ్ ప్రొడక్ట్స్‌కు అసలు వారంటీ ఉండదు. వస్తువు పాడైతే డబ్బులు తిరిగిరావు.
ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేటప్పుడు.. ఎప్పుడూ కూడా ట్రస్టెడ్ పేమెంట్ గేట్‌వేలను వాడండి. సాధ్యమైనంత వరకు అనుమానాస్పద లింక్ ద్వారా యూపీఐ పిన్ ఎంటర్ చేయడం, లేదా పూర్తి డబ్బులను ముందే చెల్లించే బదులు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవడం బెస్ట్.
పండగ ఆనందంలో ఎవరికీ మీ పర్సనల్ లేదా బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయకుండా.. జాగ్రత్తగా షాపింగ్ చేసి పండగను ఆనందంగా ఆస్వాదించండి.
డైనమిక్ ప్రైసింగ్ ట్రాప్ : మీరు ఒకే వస్తువును పదే పదే కార్ట్‌లో.. వేసి చూస్తుంటే, ఆ ఈ-కామర్స్ యాప్‌లు లేదా వెబ్‌సైట్లు మీ ఆసక్తిని గమనించి కృత్రిమంగా ధరను పెంచే అవకాశం ఉంది.అలా జరగకుండా ఉండటానికి ‘ఇన్‌కాగ్నిటో మోడ్’లో బ్రౌజ్ చేయడం మంచిది.
హిడెన్ షిప్పింగ్ చార్జెస్ :మొదట్లో వస్తువు ధర చాలా తక్కువగా కనిపిస్తుండొచ్చు.కానీ చెల్లింపు చేసే సమయంలో.. చివరి దశలో భారీ మొత్తంలో షిప్పింగ్ లేదా ప్లాట్‌ఫారమ్ ఫీజులు కలుపుతారు. కాబట్టి ఫైనల్ పేమెంట్ పేజీకి వెళ్లే ముందు టోటల్ అమౌంట్ చెక్ చేయాలి.
ఫేక్ రివ్యూలు: ప్రొడక్ట్ కింద ఉన్న 5-స్టార్ రేటింగ్స్‌ను గుడ్డిగా నమ్మకండి. కొన్ని కంపెనీలు ఫేక్ రివ్యూలను కొని ఉంచుతాయి. కేవలం “With Photos/Videos” ఉన్న రివ్యూలను, నెగటివ్ రివ్యూలను చదివితే ఆ ప్రొడక్ట్ అసలు క్వాలిటీ ఏంటో తెలుస్తుంది.
Also Read: మీ పాన్ కార్డ్ మిస్సయిందా? డూప్లికేట్ పాన్ కార్డ్ ఆర్డర్ చేయండిలా!
ప్రైస్ హిస్టరీ ట్రాకర్స్: పండగ సేల్స్‌లో 80% డిస్కౌంట్ అని బోర్డులు పెడతారు. కానీ సేల్‌కు ముందే ఆ వస్తువు ధరను డబుల్ చేసి ఉంటారు. ప్రైస్ ట్రాకర్ యాప్స్ ఉపయోగించి.. ఆ వస్తువు గత కొన్ని నెలలుగా ఏ ధరకు అమ్ముడవుతోందో చెక్ చేయండి.
క్యాష్ ఆన్ డెలివరీ: ఆన్‌లైన్‌లో.. కొత్త లేదా తెలియని వెబ్‌సైట్ల నుంచి షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ ప్రీపెయిడ్ ఆప్షన్ వాడకండి. సాధ్యమైనంత వరకు ‘క్యాష్ ఆన్ డెలివరీ’ లేదా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లను ఎంచుకోవడం బెస్ట్.
సోషల్ మీడియా యాడ్స్ మోసం: ఇన్‌స్టా, ఫేస్‌బుక్ రీల్స్‌లో కనిపించే బ్రాండెడ్ బట్టలు లేదా ఎలక్ట్రానిక్స్ కేవలం రూ.299 లేదా రూ.499 లకే ఇస్తామనే యాడ్స్ 99% ఫేక్. వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.