E-Paper
Advertisement

Actor Shivaji: టికెట్ల రేట్లు పెంచడం దుర్మార్గం.. తప్పంతా నిర్మాతలదే: శివాజీ

Actor Shivaji: టికెట్ల రేట్లు పెంచడం దుర్మార్గం.. తప్పంతా నిర్మాతలదే: శివాజీ
Advertisement

Actor Shivaji: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాజీ (Shivaji)తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం మాత్రం విలన్ పాత్రలలోను, నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల కోర్టు సినిమా ద్వారా మంగపతి పాత్రలో తన నటనతో అదరగొట్టిన శివాజీ త్వరలోనే దండోరా (Dandora)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మురళి కాంత్ దర్శకత్వంలో శివాజీ, నవదీప్, బిందు మాధవి వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో దండోరా….

ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని అంత్యక్రియలు పూర్తయ్యే వరకు సాగే కథ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు శివాజీ తన కెరియర్ గురించి అలాగే ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి మాట్లాడారు.

టికెట్ల రేట్లు పెంచడం అమానుషం..

Advertisement

ఇక దండోరా సినిమా గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. కచ్చితంగా ఒక మంచి సినిమా చూసామనే భావనతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారని శివాజీ తెలియజేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమా టికెట్ల రేట్ల (Ticket Price)గురించి కూడా ప్రస్తావనకు రావడంతో ఈయన మరోసారి సినిమా టికెట్ల రేట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్లు పెంచడం నిజంగా దుర్మార్గం అని తెలిపారు. నాలుగు పెద్ద సినిమాలు టికెట్ల రేట్లు పెంచితే ఆ సినిమాల తర్వాత వచ్చే 250 సినిమాలపై కూడా ఆ ప్రభావం చూపుతుందని తెలిపారు.

భారం మొత్తం ప్రేక్షకుల పైనే…

Advertisement

సినిమా టికెట్ల రేట్లు మాత్రమే కాదు మల్టీప్లెక్స్ లలో దొరికే స్నాక్స్ ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని ఇలా ఇష్టానుసారం పెంచడం చాలా అమానుషమని తెలిపారు. అయితే నిర్మాతల వల్లే ఇలా జరుగుతోందని శివాజీ తెలిపారు. సినిమా షూటింగ్ సమయంలో విపరీతమైన డబ్బులు ఖర్చు చేసి ఆ డబ్బు భారాన్ని ప్రజలపై వేస్తున్నారని శివాజీ తెలిపారు. సినిమా టికెట్ల రేట్లను ప్రభుత్వం అనుకుంటే కట్టడి చేయవచ్చు అలాగే మల్టీప్లెక్స్లలో స్నాక్స్ ధరలను కూడా కట్టడి చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని వీటిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మరోసారి టికెట్ల రేట్ల గురించి అలాగే థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధరల గురించి ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Also Read: Tollywood Director Death: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ ఆకస్మిక మరణం!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×