E-Paper
Advertisement

సాయి పల్లవిని చంపేయాలనుకున్నా.. అది పెట్టుకోలేకపోయా: అనుపమ షాకింగ్ కామెంట్స్

సాయి పల్లవిని చంపేయాలనుకున్నా.. అది పెట్టుకోలేకపోయా: అనుపమ షాకింగ్ కామెంట్స్
Advertisement

Anupama Parameswaran:మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా ‘ప్రేమమ్’ద్వారా నటీమణులు సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ ఒకేసారి టాలీవుడ్‌కి, సౌత్ ఇండస్ట్రీకి పరిచయమై భారీ పాపులారిటీ సంపాదించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ మాట్లాడుతూ.. ‘ప్రేమమ్’ సినిమా తన జీవితాన్ని మార్చేసినప్పటికీ, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సాయి పల్లవిపై కోపంతో అలా అన్నాను:

‘ప్రేమమ్’ సినిమాలో మలర్ పాత్రతో సాయి పల్లవి ఎంతటి క్రేజ్ సంపాదించారో అందరికీ తెలిసిందే.ఆ సినిమా సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్, నెగెటివిటీ గురించి అనుపమ మాట్లాడుతూ సరదాగా ఒక షాకింగ్ కామెంట్ చేశారు. “ఆ టైంలో సాయి పల్లవిని చంపేద్దాం అనుకున్నా.. అయితే ఆమెపై ఉన్న కోపంతో కాదు, ఆ వయసులో నాపై వచ్చిన ట్రోలింగ్ భరించలేక అలా అనిపించింది” అంటూ అప్పట్లో తాను పడిన ఇబ్బందిని గుర్తుచేసుకున్నారు.

మలయాళ ఇండస్ట్రీ నుంచి పారిపోయి వచ్చా:

Advertisement

అప్పట్లో కేవలం 18 ఏళ్ల వయసున్న అనుపమకు ‘ప్రేమమ్’ సినిమా లైఫ్-ఛేంజింగ్‌గా మారినప్పటికీ, ఆ తర్వాత ఎదురైన ద్వేషం ఆమెను చాలా బాధపెట్టిందట. ఇక చిన్న వయసులో ఆ ట్రోల్స్‌ను తట్టుకోలేకపోయానని తెలిపారు. మలయాళ ఇండస్ట్రీలో మరో సినిమా చేస్తే ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడి, అక్కడి నుంచి పారిపోయి తెలుగు ఇండస్ట్రీకి రావడానికి అదొక ప్రధాన కారణమని అనుపమ ఓపెన్‌గా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

త్వరలోనే ‘క్రేజీ కల్యాణం’తో రాక:

సౌత్‌లో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న అనుపమ పరమేశ్వరన్.. త్వరలోనే ‘క్రేజీ కల్యాణం’ సినిమాతో అలరించనున్నారు.ఈ చిత్రం అక్టోబర్ 16వ తేదీన గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంలో బద్రప్ప గాజుల అనుపమతో పాటు నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

also read:‘నవరాత్రి స్పెషల్’.. కళ్ళతోనే కూచిపూడి ఆడిన స్టార్ హీరోయిన్!

ట్రెండ్ అవుతున్న ప్రేమమ్ జ్ఞాపకాలు:

ఇక ‘ప్రేమమ్’ సినిమా వచ్చి ఇన్ని ఏళ్లు అవుతున్నా, అప్పట్లో మేరీ, మలర్ టీచర్‌లుగా వారు చేసిన సందడిని అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేరు. సోషల్ మీడియాలో ఎప్పుడైనా ఈ ఇద్దరు భామలు కలుసుకున్నప్పుడు లేదా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నప్పుడు ఆ పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక ఇండస్ట్రీలో ఎదురైన ఆరంభ కష్టాలను అధిగమించి, ఇద్దరూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.

స్టార్ హీరోయిన్‌గా ఎదగకముందు అనుపమ పరమేశ్వరన్ ఎదుర్కొన్న భయాలు, ట్రోలింగ్ అనుభవాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ ఇబ్బందులను దాటి ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. ‘క్రేజీ కల్యాణం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఆమె మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సల్మాన్ ఖాన్.. వారి కోసమే ప్రత్యేకంగా?

‘నవరాత్రి స్పెషల్’.. కళ్ళతోనే కూచిపూడి ఆడిన స్టార్ హీరోయిన్!

రవితేజ కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. ఊహించని స్టార్ కాస్ట్!

బలవంతం చేశారు.. ‘మల్లీశ్వరి’ లో పాత్ర పై సింగర్ షాకింగ్ కామెంట్!

హనుమాన్ అంశ్‌కు తెలుగులో షాక్.. అసలేం జరిగింది?

బిగ్ బాస్ షో పై అనుపమ కామెంట్స్…అంత పిచ్చి ఉందా?

వితికా షేరు, రాజీవ్ కనకాలతో సందడిగా మారిన సిస్ట్లా..గ్రాండ్ సెలబ్రేషన్స్!

Big Stories

Advertisement
×