E-Paper
Advertisement

డిన్న‌ర్ పార్టీలో నసీమ్ షా, హ‌స‌న్ న‌వాజ్ ల‌కు అవ‌మానం…స్కూల్ పిల్ల‌ల్లా ట్రీట్ చేశారు క‌ద‌రా

డిన్న‌ర్ పార్టీలో నసీమ్ షా, హ‌స‌న్ న‌వాజ్ ల‌కు అవ‌మానం…స్కూల్ పిల్ల‌ల్లా ట్రీట్ చేశారు క‌ద‌రా
Advertisement

Naseem Shah, Hasan Nawaz Humiliated At Pakistan Team Dinner:   పాకిస్తాన్ క్రికెటర్లు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఏదో ఒక వివాదాంశంలో చిక్కుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. అయితే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసిన డిన్నర్ సందర్భంగా నసీమ్ షా, హ‌స‌న్ న‌వాజ్ లకు ఘోర అవమానం ఎదురైంది. ఈ డిన్నర్ పార్టీలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ని (Mohsin Naqvi) కలిసేందుకు వచ్చిన నసీమ్ షా, హ‌స‌న్ న‌వాజ్ ఇద్దరు తలపై టోపీలు పెట్టుకొని అతనికి నమస్కారం చేశారని తెలుస్తోంది.

డిన్నర్ పార్టీ నుంచి అర్థాంత‌రంగా వెళ్లిపోయిన నసీమ్ షా, హ‌స‌న్ న‌వాజ్

దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన మేనేజర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వెంటనే తల పైన ఉన్న టోపీలు తీసేయాలని చేతి వేళ్లతో సదరు మేనేజర్ సైగలు చేశాడని తెలుస్తోంది. దీంతో అందరి ముందు తమను అవమానించారని డిన్నర్ పార్టీ నుంచి నసీమ్ షా (Naseem Shah), హ‌స‌న్ న‌వాజ్ (Hasan Nawaz0 ఇద్దరు క్రికెటర్లు వెళ్లిపోయార‌ని సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టు

టోపీలు తీయలేదని రెచ్చిపోయిన పాకిస్తాన్ మేనేజర్

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సిల్వర్ మెడల్ పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లందరికీ డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసింది పీసీబీ. ఈ డిన్నర్ పార్టీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతడిని కలిసేందుకు నసీమ్ షా, తో పాటు సిక్సుల వీరుడు హ‌స‌న్ న‌వాజ్ వచ్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కనబడగానే… టోపీలు పెట్టుకొని ఆయనకు నమస్కారం పెట్టారు. అయితే ఇది చూసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మేనేజర్ సీరియస్ అయ్యాడట.

Advertisement

దూరం నుంచి టోపీలు తీయాలని సైగలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సమక్షంలోనే జరిగింది. దీంతో ఆ అవమానం తట్టుకోలేక డిన్నర్ పార్టీలో అన్నం తినకుండానే ఈ ఇద్దరు క్రికెటర్లు నసీమ్ షా, హ‌స‌న్ న‌వాజ్ తమ ఇంటికి వెళ్లిపోయారట. మిగతా ప్లేయర్లు ఎంత చెప్పినా కూడా అక్కడ ఉండలేదట. స్కూలుకు వెళ్లే పిల్లలు లాగా తమను ట్రీట్ చేస్తారా? మేం మనుషుల లాగా కనిపించడం లేదా? అంటూ సదరు మేనేజర్ పై అక్కడే అసంతృప్తి వ్యక్తం చేశారట నసీమ్ షా, హ‌స‌న్ న‌వాజ్. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Related News

హార్దిక్ పాండ్యా దెబ్బ అదుర్స్‌…విరాట్ కోహ్లీకి కోట్ల‌ల్లో న‌ష్టం ?

ద్రవిడ్ టైంలో ప్లేయ‌ర్లు ప్రశాంతంగా నిద్రపోయేవారు..కానీ గంభీర్ వచ్చాక గందరగోళమే

షోయ‌బ్ అక్త‌ర్ ది బిల్డ‌ప్ త‌ప్ప ఏం లేదు…వాడు 150 స్పీడ్ తో ఒక్క బంతి వేయ‌లేడు

బ్యాట్ తో కోచ్ చాపెల్ పై వీరేంద్ర సెహ్వాగ్ దాడి..అడ్డుకున్న రాహుల్ ద్రవిడ్ ?

అభిషేక్‌, ఇషాన్ ఫ్లాట్ పిచ్ హీరోలే…ఫ‌ర్హాన్ కాలి గోటికి కూడా పనికిరారు

4వ స్థానంలో దూబే క్లిక్ అయింటే, 300 కొట్టేవాళ్లం..బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై గంభీర్ సంచ‌ల‌నం !

గంభీర్‌ను తిడతారు కానీ, అతడే లేకపోతే టీమిండియా ప్లేయర్లు అడుక్కుతినేవారు ?

Big Stories

Advertisement
×