Adah Sharma:టాలెంటెడ్ బ్యూటీ ఆదా శర్మ వైవిధ్యమైన పాత్రలతో పాటు తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ భామ, దేవి నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని తన కళ్ళతో పలికించే అద్భుతమైన హావభావాలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. భరతనాట్యం, కథక్‌లో ప్రావీణ్యం ఉన్న ఆదా శర్మ.. తాజాగా పోస్ట్ చేసిన డివైన్ సాంగ్ వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
దేవి నవరాత్రి వేడుకల వేళ అమ్మవారి రూపాలను ప్రతిబింబిస్తూ ఆదా శర్మ ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. గతంలో నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, ఆ చిత్రంలోని పాటలో తన కనుబొమ్మలు, కళ్ళ కదలికలతో కురిపించిన మాయ అందరికీ గుర్తుండే ఉంటుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్‌కు ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అప్పట్లో ఎంత ఫేమస్ అయ్యాయో.. ఇప్పటికీ రీల్స్‌లో అదే క్రేజ్ కొనసాగుతోంది.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఒక అద్భుతమైన దైవిక గీతాన్ని ఆలపిస్తూ కనిపించారు. కేవలం గాత్రంతోనే కాకుండా, కళ్లతోనే అద్భుతమైన భావాలను పలికిస్తూ అమ్మవారి రూపాన్ని గుర్తుచేశారు ఆదా శర్మ. సంప్రదాయ దుస్తుల్లో భక్తిభావంతో కనిపించిన ఆమె పోస్ట్ నవరాత్రి వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
మోడరన్ పాత్రలతో పాటు పవర్‌ఫుల్ రోల్స్ చేయడంలో ఆదా శర్మ తర్వాతే ఎవరైనా! తెలుగులో ‘క్షణం’, ‘కల్కి’ వంటి చిత్రాలతో మెప్పించిన ఆమె, హిందీలో ‘ది కేరళ స్టోరీ’, ‘బస్తర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సినిమాలే కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫన్నీ రీల్స్, డాన్స్ కవర్లతో ఫ్యాన్స్‌ను నిత్యం ఎంటర్‌టైన్ చేస్తుంటారు.
also read:రవితేజ కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. ఊహించని స్టార్ కాస్ట్!
ప్రస్తుతం విభిన్న భాషల్లో ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆదా శర్మ, త్వరలోనే తన తొలి మరాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రేయాస్ జాదవ్ దర్శకత్వంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ‘గజ్రా’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేస్తున్న ఈ భామ ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది.
ఇక మొత్తానికి, నవరాత్రి వేడుకల సందర్భంగా ఆదా శర్మ పంచుకున్న ఈ దైవిక వీడియో ఆమెలోని కళాకారిణిని మరోసారి బయటపెట్టింది. కళ్ళతోనే అభినయం పలికించడంలో ఆమెకి ఉన్న ప్రత్యేకతను ఈ వీడియో మరోసారి రుజువు చేసింది. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతూనే, ఇలాంటి సాంప్రదాయాలను గౌరవిస్తున్న ఆదా శర్మ టాలెంట్‌ను ఫ్యాన్స్ ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&mdxt=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==