E-Paper
Advertisement

బిగ్ బాస్ సీజన్ 10లోకి జబర్దస్త్ కమెడియన్.. పంచ్ లకు కొదవే లేదు!

బిగ్ బాస్ సీజన్ 10లోకి జబర్దస్త్ కమెడియన్.. పంచ్ లకు కొదవే లేదు!
Advertisement

Bigg Boss 10: ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ.. ఆద్యంతం ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతున్న బిగ్ బాస్ (Bigg Boss) రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తి కాగా, ఇప్పుడు 10వ సీజన్ దశావతారంకి సర్వం సిద్ధమవుతోంది. పైగా అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద ఎత్తున భారీ సెట్ కూడా వేశారు.. ఎప్పటిలాగే హీరో నాగార్జున (Nagarjuna) ఈ 10వ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. అంతేకాదు కామన్ మ్యాన్ క్యాటగిరీలో హౌస్ లోకి అడుగు పెట్టేందుకు అగ్నిపరీక్ష కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభం అయ్యి ఈ అగ్ని పరీక్ష షోలో.. బిగ్ బాస్ విన్నర్స్ అభిజిత్ , బిందు మాధవితో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ నవదీప్ ఎప్పటిలాగే ఈసారి కూడా జడ్జెస్ గా వ్యవహరించబోతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి జబర్దస్త్ కమెడియన్..

ఇక అంతా బాగానే ఉన్నా.. హౌస్ లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారు అనే కామెంట్లు వ్యక్తం అవ్వగా.. ఇప్పటికే ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జబర్దస్త్ కమెడియన్ ఫైనల్ అయినట్లు సమాచారం. ఇక ఆయన ఎవరో తెలియడంతో జబర్దస్త్ లో తనదైన పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన .. బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ కి, పంచ్ లకు కొదవే ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

also read:బిగ్ బాస్ షోను రిజెక్ట్ చేసిన మల్లికా షెరావత్ .. కారణం అదే..!

ఆయన ఎవరో కాదు..

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో తనదైన కామెడీ టైం తో అబ్బురపరుస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న ఆటో రాంప్రసాద్ (Auto RamPrasad). ఈ మేరకు తాజాగా ఆటో రాంప్రసాద్ కన్ఫర్మ్ అయినట్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 10 లోకి జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ అడుగుపెట్టబోతున్నారని తెలియడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు.

ఆటో రాంప్రసాద్ కెరియర్..

Advertisement

ఆటో రాంప్రసాద్ విషయానికి వస్తే.. ఈయన అసలు పేరు రాంప్రసాద్. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించారు. జబర్దస్త్ కార్యక్రమంలో స్కిట్లకు స్క్రిప్టు రైటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత నటుడిగా మారారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లతో కలిసి రాంప్రసాద్ చేసే కామెడీ స్కిట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వందల సంఖ్యలో వీరు చేసిన స్కిట్లు భారీగా పేలాయి .అలా ఈ షో తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఆటో రాంప్రసాద్. టెలివిజన్ తో పాటు రాంప్రసాద్ కొన్ని చిత్రాలలో కూడా నటించారు. ముఖ్యంగా గంధర్వ, వాసుదేవ సుతం ,వైఫ్ ఆఫ్ అనిర్వేష్, బెదురులంక , షష్టిపూర్తి, ఉప్మావతి, దళారి, ఇట్స్ ప్యూర్ లవ్, లెహరాయి, పాగల్, 3 మంకీస్ వంటి చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలలో తనదైన పంచ్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×