Tollywood: ప్రస్తుత కాలంలో కొంతమంది చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొని సర్ప్రైజ్ చేస్తుంటే.. మరికొంతమంది తమ జీవితంలోకి రాబోయే పార్టనర్ ను పరిచయం చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంకొంతమంది తమ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ను అభిమానుల సమక్షంలో అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హీరోయిన్ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటూ హాట్ బాంబు పేల్చింది. మరి ఆమె ఎవరు ? ఆమె ప్రేమిస్తున్న ఆ అబ్బాయి ఎవరు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తెలుగు, తమిళ్ భాష చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో గ్లామర్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న యంగ్ బ్యూటీ దుషారా విజయన్( Dushara vijayan) ప్రస్తుతం మగుడం, సార్పట్టా -2 వంటి వరుస ప్రాజెక్టులతో దక్షిణాదిలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. నటనతోనే కాకుండా సహజ సిద్ధమైన శైలితో ఆకట్టుకుంటున్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఊహించని విషయాలను పంచుకుంది. దుషారా మాట్లాడుతూ..” నేను కూడా ప్రేమలో పడ్డాను. గత రెండేళ్లుగా ఒక వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తున్నాను ప్రస్తుతం నా లైఫ్ చాలా సంతోషంగా సాగిపోతోంది” అంటూ తాను ప్రేమలో పడ్డ విషయాన్ని చెప్పుకొచ్చింది.
తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటూ చెప్పిన ఈమె పెళ్లి విషయంపై కూడా ఓపెన్ అయింది. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన ఏదీ లేదు. ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకోవడానికి నేను పడ్డ కష్టాన్ని నా తల్లిదండ్రులు దగ్గరుండి మరీ చూశారు. అందుకే పెళ్లి విషయంలో నాపై వారు ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు అంటూ తెలిపింది.
ALSO READ:ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్.. లైంగిక దాడి ఆరోపణల కేసులో!
ఇదే ఇంటర్వ్యూలో తన ప్రియుడితో పరిచయం, ప్రేమ ఎలా మొదలైంది? అనే విషయంపై కూడా ఆమె చెప్పుకొచ్చింది.. మా ఇద్దరికీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అలా మా మొదటి కలయిక దుబాయ్ లోనే జరిగింది. నా తండ్రి స్నేహితుడి ద్వారా పరిచయమైన క్రమంలో ఆయనతో కలిసి కారులో వెళ్తున్నప్పుడు.. నాకు ఇష్టమైన ఇళయరాజా పాట ప్లే కావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నిజానికి మా ఇద్దరి మనసులను కలిపిన మొదటి అంశం ఇళయరాజా సంగీతమే అంటూ ఈమె మురిసిపోతూ చెప్పుకొచ్చింది.
నా బాయ్ ఫ్రెండ్ నా వృత్తిని, కెరియర్ ను ఎంతగానో గౌరవిస్తూ నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. అలాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం. ఒక బంధంలో పరస్పర నమ్మకం , గౌరవం మాత్రమే చాలా కీలకము అని నేను ఎప్పటికీ భావిస్తాను. ఇక అందుకు తగ్గట్టుగానే నా బాయ్ ఫ్రెండ్ కూడా అదే ఆలోచనలు, అదే స్వభావం కలిగి ఉండడం నిజంగా నేను చాలా లక్కీ అంటూ తన బాయ్ ఫ్రెండ్ పై ప్రశంసలు కురిపించింది ఈ ముద్దుగుమ్మ.